లాంచ్‌కు ముందే Poco M7 Pro 5G, Poco C75 5G కెమెరాతోపాటు ఇతర స్పెసిఫికేషన్‌ల వెల్లడి
భారత్ మొబైల్ మార్కెట్‌లోకి Poco M7 Pro 5G, Poco C75 5G హ్యాండ్‌సెట్‌లు డిసెంబర్ 17న లాంచ్ కాబోతున్నాయి. ఈ Xiaomi సబ్-బ్రాండ్ రాబోయే స్మార్ట్ ఫోన్‌ల కెమెరా, డిస్‌ప్లే సామర్థ్యాలతోపాటు అనేక కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ Poco M7 Pro 5G హ్యాండ్‌సెట్ సోనీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానున్నట్లు స్పష్టం చేసింది. అలాగే, Poco C75 5G ఫోన్ కంపెనీ C సిరీస్‌లో Xiaomi హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతోన్న మొదటి ఫోన్‌గా గుర్తింపు పొందుతోంది