Realme 14T ధరతోపాటు కీలక స్పెసిఫికేషన్స్ లీక్.. 6,000mAh భారీ బ్యాటరీతో
Realme 14T అతి త్వరలోనే ఇండియా లాంఛ్ జరగొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, Realme ఇంకా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, ఓ కొత్త లీక్.. ఇండియాలో ఫోన్ ధరను సూచిస్తోంది. రాబోయే Realme 14T స్మార్ట్ ఫోన్ 8GB RAM తోపాటు 128GB, 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో విడుదల కానున్నట్లు తెలుపుతోంది. అలాగే, ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో రూపొందిచబడినట్లు సమాచారం.