Vivo V50 హ్యాండ్‌సెట్ భారత్‌లో లాంఛ్.. ఫ్రిబ్రవరి 25 నుంచి అమ్మకాలు
భారత్‌లో Vivo V50 లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని అందించారు. ఇది 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు రెండు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు IP68+IP69 రేటింగ్‌లను, 7.39mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉందని వెల్లడైంది. అంతేకాదు, ఈ విభాగంలో అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్‌గా ప్రచారం జరుగుతోంది. ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.