ప్రస్తుతానికి అమెజాన్ నౌ సర్వీస్ బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పుణె, హైదరాబాద్, కొచ్చి, అమృత్‌సర్ వంటి కేవలం 15 ప్రధాన నగరాల్లోని 5 కోట్లకు పైగా కస్టమర్లకు మాత్రమే సేవలు అందిస్తోంది.
Photo Credit: Amazon Now
Amazon Now
Amazon Now : ప్రస్తుతం నడుస్తున్న క్విక్ కామర్స్ ట్రెండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఒక మెగా ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. తమ అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ విభాగం అమెజాన్ నౌ సర్వీస్‌ను రాబోయే సంవత్సరాల్లో దేశంలోని 300కు పైగా నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది. అమెజాన్ ఇండియా చరిత్రలోనే ఈ క్విక్ కామర్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా రికార్డు సృష్టించిందని కంపెనీ తెలిపింది. ఈ భారీ విస్తరణ ద్వారా దేశంలోని చిన్న, పెద్ద నగరాల ప్రజలకు కూడా నిమిషాల వ్యవధిలోనే వస్తువులను సరఫరా చేయనున్నారు.
ప్రస్తుత మార్కెట్, కస్టమర్ల స్పందన
ప్రస్తుతానికి అమెజాన్ నౌ సర్వీస్ బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పుణె, హైదరాబాద్, కొచ్చి, అమృత్‌సర్ వంటి కేవలం 15 ప్రధాన నగరాల్లోని 5 కోట్లకు పైగా కస్టమర్లకు మాత్రమే సేవలు అందిస్తోంది. ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లేదా కొన్ని గంటల లోపే వస్తువులను కస్టమర్ల ఇళ్లకు చేరవేస్తున్నారు. అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ.. అమెజాన్ నౌ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి త్రైమాసికంలోనూ ఆర్డర్ల సంఖ్య రెట్టింపు అవుతోందని తెలిపారు. ముఖ్యంగా ప్రైమ్ మెంబర్స్ ఈ సర్వీస్ వాడటం మొదలుపెట్టాక, వారి షాపింగ్ ఫ్రీక్వెన్సీ మూడు రెట్లు పెరిగిందని ఆయన వెల్లడించారు.
కోటి ప్రొడక్ట్స్.. ఒకే రోజులో డెలివరీ
ఈ మెగా విస్తరణ ప్రణాళికలలో భాగంగా అమెజాన్ తన మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్, అర్బన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఫెసిలిటీస్ నెట్‌వర్క్‌ను భారీగా పెంచబోతోంది. దీనివల్ల కస్టమర్లకు వేలాది రకాల వస్తువులు చాలా వేగంగా అందుబాటులోకి వస్తాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత, దాదాపు 10 లక్షలకు పైగా ప్రొడక్ట్స్ సేమ్ డే డెలివరీ కింద, 40 లక్షలకు పైగా ప్రొడక్ట్స్ నెక్స్ట్ డే డెలివరీ ఆప్షన్ ద్వారా కస్టమర్లకు అందుతాయని అమెజాన్ స్పష్టం చేసింది.
రోజువారీ వస్తువుల నుంచి చిన్న గృహోపకరణాల వరకు
ప్రస్తుతం అమెజాన్ నౌ పోర్ట్‌ఫోలియోలో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్స్, పర్సనల్ కేర్ ఐటమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఇల్లు, వంటగదికి సంబంధించిన సామాగ్రి, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో నగరాల విస్తరణతో పాటు, ఈ ప్రొడక్ట్స్ రేంజ్, కేటగిరీలను కూడా మరింత భారీగా పెంచాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
Apple : ఆపిల్ ప్రియులకు భారీ షాక్.. త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం
డెలివరీ భాగస్వాముల కోసం సమ్మాన్ పథకం
వ్యాపార విస్తరణతో పాటు, తమ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో రాత్రింబగళ్లు కష్టపడుతున్న డెలివరీ బాయ్స్ సంక్షేమం కోసం అమెజాన్ సమ్మాన్ అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఆపరేషన్స్, ఉద్యోగుల సంక్షేమం కోసం ఇటీవల ప్రకటించిన 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,836 కోట్లు) పెట్టుబడి నుంచి ఈ పథకానికి నిధులు కేటాయించనున్నారు. ఈ చొరవ కింద డెలివరీ భాగస్వాముల పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. అలాగే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహించనున్నారు.
ఆశ్రయ్ సెంటర్లు, ఇన్సూరెన్స్ రక్షణ
సమ్మాన్ పథకం కింద డెలివరీ కార్మికులకు రోడ్డు భద్రతా చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, వారి ఇన్సూరెన్స్ పరిధిని కూడా విస్తరించనున్నారు. వీటితో పాటు, దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఆశ్రయ్ రెస్ట్ సెంటర్ల సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి 250 లొకేషన్లకు పెంచాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆశ్రయ్ సెంటర్లలో డెలివరీ సిబ్బందికి స్వచ్ఛమైన తాగునీరు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, వాష్‌రూమ్‌లు, కూర్చోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. అమెజాన్ గ్లోబల్ సీఈఓ ఆండీ జ్యాసీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న తరుణంలోనే ఈ కీలక నిర్ణయాలు వెలువడటం విశేషం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999