Kia Syros EV: కియా సైరోస్ ఈవీని ఈ జూలై 2026 నెల ఆఖరి నాటికే భారత మార్కెట్లో ప్రదర్శించే అవకాశం ఉంది.
Photo Credit: Kia
Kia Syros EV: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రస్తుతానికి టాటా మోటార్స్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ తిరుగులేని రికార్డులతో దూసుకుపోతోంది. అయితే ఈ కారు హవాకు బ్రేక్ వేసేందుకు ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సైరోస్ ఈవీని భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. అయితే అధికారికంగా లాంచ్ కావడానికి ముందే ఈ కారు ఎలాంటి కవర్లు లేకుండా రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. సోషల్ మీడియాలో లీకైన ఈ ఫోటోల ద్వారా ఈ సరికొత్త ఈవీ కారు డిజైన్, అనేక ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నెల ఆఖరి నాటికే గ్రాండ్ ఎంట్రీ..
మీడియా కథనాల ప్రకారం.. కియా సైరోస్ ఈవీని ఈ జూలై 2026 నెల ఆఖరి నాటికే భారత మార్కెట్లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ కారును లాంగ్ రేంజ్, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండేలా రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అమర్చే పెద్ద బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఈ కారు సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు చార్జింగ్ గురించిన టెన్షన్ పూర్తిగా తప్పనుంది.
పెట్రోల్ మోడల్‌ను పోలి ఉన్న లుక్స్..
ప్రముఖ ఆటోమొబైల్ అనలిస్ట్ బన్నీ పునియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తే.. అప్కమింగ్ కియా సైరోస్ ఈవీ లుక్స్ చాలా వరకు పెట్రోల్ (ICE) మోడల్‌ను పోలి ఉన్నాయి. కారు ముందు భాగంలో స్లిమ్ ఫ్రంట్ గ్రిల్, స్వల్పంగా మార్పులు చేసిన ఫ్రంట్ బంపర్ కనిపిస్తున్నాయి. అలాగే వర్టికల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, బాడీ కలర్ ఇన్సర్ట్స్, సైడ్ ప్రొఫైల్‌ను పాత మోడల్ లాగే కొనసాగించారు. అయితే, టెస్టింగ్ లో కనిపించిన ఈ మోడల్‌కు సరికొత్త డ్యూయల్ టోన్ 17-ఇంచుల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. అంతేకాకుండా ఫ్రంట్ డోర్లపై అధునాతన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.
వెనుక భాగంలో EV బ్యాజ్.. లోపల లగ్జరీ కేబిన్ సెటప్..
ఈ ఎస్‌యూవీ వెనుక డిజైన్‌ను గమనిస్తే పెద్దగా మార్పులు చేయలేదు. వర్టికల్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్, ఎల్-షేప్ లైటింగ్ ఎలిమెంట్స్, బంపర్ డిజైన్ యథాతథంగా ఉన్నాయి. కాకపోతే టెయిల్‌గేట్‌పై ప్రత్యేకంగా ఉండే EV బ్యాజ్ మాత్రమే దీనిని రెగ్యులర్ పెట్రోల్ కార్ల నుంచి వేరుగా చూపిస్తుంది. ఇక కేబిన్ లోపలి విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం ఫిజికల్ బటన్లను ఇచ్చారు. వీటికి తోడు డ్రైవింగ్ అనుభూతిని పెంచేందుకు ప్యాడల్ షిఫ్టర్లు, భద్రత కోసం ఇన్-బిల్ట్ డాష్ క్యామ్ ఫీచర్‌ను కూడా జోడించారు.
Voter List : ఇంటికొచ్చిన బీఎల్ఓలు ఆధార్, పాన్ అడుగుతున్నారా? ఎన్నికల సంఘం కీలక ప్రకటన
ఫీచర్ల పరంగా నో కాంప్రమైజ్..
ఫీచర్ల పరంగా కియా సైరోస్ ఈవీ టాప్ క్లాస్‌లో ఉండబోతోంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక ప్రయాణీకుల కోసం రియర్ సీట్ బేస్ వెంటిలేషన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ ఉంటుందా లేదా అనేదానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మెకానికల్ పరంగా చూస్తే.. ఇందులో ఇటీవల లాంచ్ అయిన కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ పవర్‌ట్రైన్‌నే ఉపయోగించనున్నారు. దీని బేస్ వేరియంట్‌లో 42kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది 420 కిలోమీటర్ల ARAI రేంజ్ ఇస్తుంది. అలాగే టాప్ వేరియంట్‌లో ఉండే 51.4kWh బ్యాటరీ ప్యాక్ సుమారు 520 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ అందిస్తుందని సమాచారం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999