ECI Clarifies No documents required from Voters during Enumeration Phase: బీఎల్ఓలు ఇళ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరించే సమయంలో ఓటర్ల నుంచి కేవలం ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారు.
Photo Credit: Pexels/ Edmond Dantès
SIR
ECI Clarifies No documents required from Voters during Enumeration Phase: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) దేశవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. అయితే ఈ ఓటర్ల లిస్ట్ అప్‌డేట్ ప్రక్రియ మధ్యలో సాధారణ ఓటర్లలో ఒక రకమైన గందరగోళం నెలకొంది. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పుల కోసం బూత్ లెవల్ అధికారులు ఇళ్ల వద్దకు సర్వే కోసం వస్తున్నప్పుడు.. చాలా చోట్ల స్పష్టత లేకపోవడం వల్ల వారు ఓటర్ల నుంచి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను అడుగుతున్నారు. దీంతో ఓటర్లు తమ వద్ద ఉన్న కాగితాలను ఎప్పుడు సబ్మిట్ చేయాలి, వేటిని చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులుగా పరిగణిస్తారనే దానిపై అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్లకు ఊరటనిస్తూ ఒక అత్యంత కీలకమైన స్పష్టతను ఇచ్చింది. ఎన్యూమరేషన్ దశలో ఓటర్లు ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్యూమరేషన్ దశలో వివరాలు ఇస్తే చాలు..
తెలంగాణ టుడే నివేదిక ప్రకారం.. బీఎల్ఓలు ఇళ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరించే సమయంలో ఓటర్ల నుంచి కేవలం ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారు. ఈ ఫేజ్‌లో ఎవరూ కూడా తమ ఒరిజినల్ లేదా జిరాక్స్ పత్రాలను ఇవ్వనవసరం లేదు. ఈ వివరాల సేకరణ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. ఈ డ్రాఫ్ట్ ఇలెక్టోరల్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ఓటర్ల రికార్డులను పరిశీలిస్తారు. ఒకవేళ గత ఓటర్ లిస్ట్‌తో డేటా లింక్ కాకపోయినా లేదా ఓటరు రికార్డులలో ఏవైనా తప్పులు, విరుద్ధమైన వివరాలు కనిపించినా కేవలం ఆయా కేసులను మాత్రమే అధికారులు నిశితంగా పరిశీలిస్తారు.
నోటీసు వస్తేనే డాక్యుమెంట్లు చూపించాలి..
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా పరిశీలనలో ఎవరి రికార్డులలోనైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే.. సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) సదరు ఓటరుకు అధికారికంగా ఒక నోటీసు జారీ చేస్తారు. అలా నోటీసు అందుకున్న ఓటరు మాత్రమే తాము ఆ నియోజకవర్గంలో ఓటు హక్కుకు అర్హులమేనని నిరూపించుకోవడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అంటే, రికార్డులు పక్కాగా ఉన్న సాధారణ ఓటర్లు అందరూ ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం డేటా మ్యాచ్ కాని లేదా తప్పులు దొర్లిన ఓటర్ల నుంచి మాత్రమే అధికారులు నోటీసుల ద్వారా కాగితాలను సేకరిస్తారు.
ఎన్నికల సంఘం ఆమోదించే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇదే..!
ఒకవేళ అధికారుల నుంచి నోటీసులు వస్తే.. ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలను సమర్పించవచ్చో ఎన్నికల సంఘం ఒక అధికారిక జాబితాను విడుదల చేసింది. ఆమోదించబడే పత్రాలు ఇవే:
Samsung : రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే ఏకంగా రూ.8,000 పెరిగిన శాంసంగ్ కొత్త 5G ఫోన్ ధర
ఆధార్ కార్డు లింకింగ్‌పై ప్రత్యేక మార్గదర్శకాలు..
ఇక ఓటరు కార్డుతో ఆధార్ గుర్తింపు వివరాలను అనుసంధానం చేసే లేదా సమర్పించే విషయాలపై ఎన్నికల సంఘం మరింత స్పష్టతనిచ్చింది. ఆధార్‌కు సంబంధించిన అంశాలలో సెప్టెంబర్ 9, 2025న తాము ప్రత్యేకంగా జారీ చేసిన మార్గదర్శకాలు యథాతథంగా వర్తిస్తాయని ఈసీ పేర్కొంది. అంటే ప్రస్తుత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా, ఆధార్ కార్డ్‌కు సంబంధించిన రూల్స్ మునుపటి నిబంధనల ప్రకారమే అమలు చేయబడతాయి. కాబట్టి అధికారులు అధికారికంగా నోటీసు జారీ చేసేంత వరకు ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, బీఎల్ఓలకు ముందే సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పనేలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999