మారుతి ఈ-విటారా కారు మొత్తం మూడు ఆకర్షణీయమైన వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Photo Credit: Maruti e Vitara
Maruti e Vitara
Maruti e Vitara : భారతదేశపు నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచైన ఈ కారు ధరలు పెరగడం వినియోగదారులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. అయితే, కంపెనీ ఈ ధరల పెంపును అన్ని వేరియంట్లకు వర్తింపజేయలేదు. ప్రారంభ మోడల్ కొనుగోలు చేసే వారికి ఎలాంటి అదనపు భారం పడకుండా మారుతి సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. మారుతి ఈ-విటారా కారు మొత్తం మూడు ఆకర్షణీయమైన వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఆల్ఫా, డెల్టా, జీటా. ఇందులో బేస్ వెర్షన్ అయిన 49 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన డెల్టా వేరియంట్ ప్రారంభ ధర రూ.15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ బేస్ మోడల్ ధరలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, మిగతా హై-ఎండ్ వేరియంట్ల ధరలను మాత్రం వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.30,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ వినూత్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీకి చెందిన ప్రత్యేకమైన హార్టెక్ట్-ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఇందులో కస్టమర్ల కోసం రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించారు. మొదటిదైన 49 kWh బ్యాటరీ వెర్షన్ 144 bhp గరిష్ట పవర్‌ను, 189 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక రెండవదైన పెద్ద 61 kWh బ్యాటరీ వెర్షన్ 174 bhp పవర్‌ను, 189 Nm టాప్ టార్క్‌ను అందిస్తుంది. ఈ కారును ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే చాలు.. గరిష్టంగా 543 కిలోమీటర్ల మైండ్ బ్లోయింగ్ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
డిజైన్ పరంగా ఈ-విటారా చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, విభిన్నమైన Y షేప్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అమర్చారు. కారు లోపల డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు డ్యాష్‌బోర్డ్‌పై రెండు స్క్రీన్ల కలయిక ఉంటుంది. దీనిలో కస్టమర్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డ్రైవర్ సమాచారం కోసం 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.19,000 పైగా తగ్గిన ధర
మారుతి ఈ-విటారా కారుకు సంబంధించిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దాని భద్రత. ఇటీవలే జరిగిన అధికారిక భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టింగ్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి రికార్డు సృష్టించింది. పెద్దల రక్షణ విభాగంలో మొత్తం 32 పాయింట్లకు గానూ ఈ కారు అద్భుతంగా 31.49 పాయింట్లను సొంతం చేసుకుంది. అలాగే ఫ్రంట్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో 16 కి 15.49 పాయింట్లు, సైడ్ మూవబుల్ బారియర్ టెస్ట్‌లో క్లీన్‌గా 16 కి 16 పాయింట్లు సాధించింది.
ఈ కారు బాడీని చాలా బలంగా తయారు చేశారు. దీని నిర్మాణంలో 60 శాతానికి పైగా అల్ట్రా-హై టెన్సైల్, హై-టెన్సైల్ స్ట్రెంత్ స్టీల్‌ను ఉపయోగించారు. పిల్లల రక్షణ విభాగంలో కూడా ఈ ఎస్‌యూవీ 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు సాధించి తోపుగా నిలిచింది. కారులో సేఫ్టీ కోసం లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ, ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. మార్కెట్లో ఈ కారు హుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, ఎమ్‌జీ విండ్సర్ ఈవీలకు గట్టి పోటీ ఇస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999