ముఖ్యంగా రూ.2000 లోపు ధరలోనే బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను నియంత్రించే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), స్పేషియల్ ఆడియో, మల్టీ-డివైజ్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు వచ్చేస్తున్నాయి.
Photo Credit: Boat
The Boat Airdopes Prime 701 ANC is said to offer up to 46dB ANC
Earbuds : భారతదేశంలో బడ్జెట్ ధరలో మంచి ఇయర్‌బడ్స్ కొనడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా రూ.2000 లోపు ధరలోనే బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను నియంత్రించే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), స్పేషియల్ ఆడియో, మల్టీ-డివైజ్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు వచ్చేస్తున్నాయి. అయితే ఒక్కో బ్రాండ్ ఒక్కో ప్రత్యేకతతో పోటీ పడుతుండటంతో కస్టమర్లకు ఏది కొనాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 బెస్ట్ ఏఎన్‌సీ ఇయర్‌బడ్స్ వివరాలు, వాటి ధరల గురించి తెలుసకుందాం.
బోట్ ఎయిర్‌డోప్స్ ప్రైమ్ 701 ANC
ఫీచర్లు ఎక్కువగా కావాలనుకునే వారికి బోట్ ఎయిర్‌డోప్స్ ప్రైమ్ 701 ANC ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఇందులో 46dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం వల్ల బయటి శబ్దాలు అస్సలు వినబడవు. థియేటర్ లాంటి అనుభూతిని ఇచ్చే స్పేషియల్ ఆడియో, స్పష్టమైన కాల్స్ కోసం AI-ENx టెక్నాలజీ, ఒకేసారి ఫోన్, లాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునే మల్టీపాయింట్ కనెక్టివిటీ దీని సొంతం. గేమింగ్ కోసం లో-లేటెన్సీ మోడ్, IPX5 వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఈ బడ్స్.. కేస్ మొత్తంతో కలిపి 50 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. దీని ధర రూ.1,899 కాగా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్‌సైట్లలో లభిస్తుంది.
బోట్ నిర్వాణ అయాన్ ANC
మీరు లాంగ్ ట్రావెల్స్ చేస్తూ పదే పదే ఛార్జింగ్ పెట్టడం ఇష్టం లేని వారైతే బోట్ నిర్వాణ అయాన్ ANC కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏకంగా 120 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇందులో 32dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇన్-ఇయర్ డిటెక్షన్ (బడ్స్ చెవిలోంచి తీయగానే పాట ఆగిపోతుంది), అడాప్టివ్ ఈక్యూ, కాల్స్ కోసం క్వాడ్-మైక్ సెటప్ ఉన్నాయి. ఆఫీస్ అవసరాలకు, ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. దీని ధర ₹1,799 మాత్రమే.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3r
వన్ ప్లస్ బ్రాండ్‌ను ఇష్టపడే వారికి వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఒక నమ్మకమైన ఆప్షన్. ఇందులో టైటానియం కోటెడ్ డయాఫ్రాగమ్‌తో కూడిన పెద్ద 12.4mm డైనమిక్ డ్రైవర్స్ అమర్చారు, ఇవి బెస్ట్ ఆడియో క్వాలిటీని ఇస్తాయి. లేటెస్ట్ బ్లూటూత్ 5.4, డ్యూయల్-డివైజ్ పేరింగ్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. గేమర్స్ కోసం 47ms లో-లేటెన్సీ, కాల్స్ కోసం డ్యూయల్-మైక్ ఏఐ నాయిస్ రిడక్షన్, 54 గంటల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ.1,999గా ఉంది.
బోట్ నిర్వాణ ఐవీ
పాటలు, సినిమాలు చూసేటప్పుడు అద్భుతమైన ఇమ్మర్సివ్ ఆడియో కావాలనుకుంటే బోట్ నిర్వాణ ఐవీ అదరగొడుతుంది. ఎందుకంటే ఇందులో ఈ బడ్జెట్‌లో ఎవరూ ఇవ్వని విధంగా హెడ్ ట్రాకింగ్‌తో కూడిన 360-డిగ్రీల స్పేషియల్ ఆడియోను ఇచ్చారు. అంటే మనం తల తిప్పినా దానికి తగ్గట్లు సౌండ్ మారుతుంది. అంతేకాకుండా అత్యధికంగా 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇన్-ఇయర్ డిటెక్షన్, యాప్ సపోర్ట్, 50 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. దీని ధర కూడా కేవలం రూ.1,799 మాత్రమే.
రియల్‌మి బడ్స్ T310
రియల్‌మి నుంచి వస్తున్న రియల్‌మి బడ్స్ T310 కూడా రూ.1,899 ధరలో గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో 12.4mm డైనమిక్ డ్రైవర్లు, 46dB హైబ్రిడ్ ఏఎన్‌సీ సదుపాయం ఉంది. చుట్టుపక్కల వారి మాటలు వినడానికి ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఇచ్చుకోవచ్చు. కాల్స్ అద్భుతంగా మాట్లాడటానికి ట్రిపుల్-మైక్ ఏఐ ఈఎన్‌సీ, గేమింగ్ కోసం సూపర్ ఫాస్ట్ 45ms లో-లేటెన్సీ మోడ్‌ను ఇచ్చారు. బడ్స్ మొత్తం 40 గంటల ప్లేబ్యాక్ టైమ్ (ఏఎన్‌సీ ఆన్ చేస్తే 26 గంటలు) ఇస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know