Viral Hack : వ్యాలెట్‌కి అల్యూమినియం పేపర్ చుడితే రూపాయి కూడా పోదు.. వైరల్ అవుతున్న విచిత్రమైన ట్రిక్

నేటి డిజిటల్ యుగంలో వ్యాలెట్ అనేది కేవలం నగదు దాచుకునేందుకు మాత్రమే పరిమితం కాలేదు.

Viral Hack : వ్యాలెట్‌కి అల్యూమినియం పేపర్ చుడితే రూపాయి కూడా పోదు.. వైరల్ అవుతున్న విచిత్రమైన ట్రిక్

Photo Credit: AI Generated

ముఖ్యాంశాలు
  • టిఫిన్ కట్టే ఫాయిల్ పేపర్‌తో బ్యాంక్ ఖాతా సేఫా
  • ప్రపంచాన్ని షాక్‌కి గురిచేస్తున్న వైరల్ ట్రిక్
  • సైబర్ మోసాలకు చెక్ పెట్టే తిరుగులేని అస్త్రం
ప్రకటన

 Viral Hack : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ట్రిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రజలు తమ వ్యాలెట్‌ను లేదా డెబిట్, క్రెడిట్ కార్డులను అల్యూమినియం ఫాయిల్‎లో చుట్టి జేబులో పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కార్డుల నుంచి డేటా చోరీ కాకుండా కాపాడుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు. మొదటి చూపులో ఇది కాస్త వింతగా, నవ్వు తెప్పించేలా అనిపించినా.. ఈ చిట్కా వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. అయితే ఈ ఒక్క ట్రిక్ మిమ్మల్ని అన్ని రకాల డిజిటల్ మోసాల నుంచి కాపాడుతుందని అనుకుంటే పొరపాటే! అసలు ఈ ట్రిక్ ఎంతవరకు పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం.

అసలు ఈ కార్డులు ఎలా పనిచేస్తాయి?
నేటి డిజిటల్ యుగంలో వ్యాలెట్ అనేది కేవలం నగదు దాచుకునేందుకు మాత్రమే పరిమితం కాలేదు. అందులో డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు మెట్రో కార్డులు, ఆఫీస్ యాక్సెస్ కార్డులు, హోటల్ కీ-కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంచుతున్నాం. వీటిలో చాలా వరకు RFID (Radio Frequency Identification) లేదా NFC (Near Field Communication)  టెక్నాలజీ పై పనిచేస్తాయి. దీనివల్ల కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా, మెషిన్ దగ్గర ఉంచగానే ఆటోమేటిక్ గా పేమెంట్లు జరిగిపోతాయి లేదా తలుపులు తెరుచుకుంటాయి. ఈ సౌకర్యమే కొందరిలో సెక్యూరిటీ భయాలను పెంచుతోంది. స్పెషల్ రీడర్లతో ఎవరైనా దగ్గరకు వచ్చి డేటా కొట్టేస్తారేమోనని కంగారు పడుతుంటారు.

అల్యూమినియం ఫాయిల్ నిజంగా సిగ్నల్స్‌ను ఆపగలదా?
దీనికి సమాధానం.. అవును, ఆపగలదు..  కానీ అది కొంత పరిమితికి మాత్రమే. అల్యూమినియం అనేది మంచి విద్యుత్ వాహకం. మీరు వ్యాలెట్‌ను అల్యూమినియం ఫాయిల్‌తో పూర్తిగా కప్పి ఉంచినప్పుడు, అది తాత్కాలికంగా ఫ్యారడే కేజ్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల కార్డుల నుంచి బయటకు వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ బలహీనపడతాయి లేదా బ్లాక్ అవుతాయి. ఫలితంగా బయటి రీడర్లు ఈ సిగ్నల్స్‌ను స్క్యాన్ చేయడం కష్టమవుతుంది. మార్కెట్‌లో అమ్మే RFID బ్లాకింగ్ వ్యాలెట్లు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. కాకపోతే అల్యూమినియం ఫాయిల్ అనేది ఒక తాత్కాలిక, సౌకర్యం లేని జుగాడ్ పద్ధతి మాత్రమే.

సైబర్ మోసాలన్నీ దీంతో ఆగిపోతాయా?
 అల్యూమినియం ఫాయిల్ కేవలం గాలిలో ప్రసారమయ్యే వైర్‌లెస్ రేడియో సిగ్నల్స్‌ను మాత్రమే అడ్డుకుంటుంది. ఫిషింగ్ లింక్‌లు, ఓటీపీ మోసాలు, యూపీఐ స్కామ్‌లు, కార్డ్ స్కిమ్మింగ్, మాల్వేర్, డేటా లీక్‌లు లేదా సిమ్ స్వాప్ వంటి ఆన్‌లైన్ సైబర్ నేరాల నుంచి ఇది మిమ్మల్ని ఎంతమాత్రం కాపాడలేదు. మీరు ఏదైనా నకిలీ యాప్‌లో లేదా ఫేక్ వెబ్‌సైట్‌లో మీ కార్డ్ వివరాలు నమోదు చేస్తే ఈ ఫాయిల్ పేపర్ మిమ్మల్ని రక్షించలేదు. అంతేకాకుండా, నేటి ఆధునిక EMV చిప్ ఉన్న కార్డులలో ఇప్పటికే స్ట్రాంగ్ ఎన్‌క్రిప్షన్, భద్రతా పొరలు ఉంటాయి. కాబట్టి కేవలం దూరం నుంచి స్క్యాన్ చేసి డబ్బులు దొంగిలించడం అనేది ఆచరణలో చాలా అరుదుగా జరిగే విషయం.

Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం

ఏ కార్డులకు ఇది ఎంతోకొంత ఉపయోగపడుతుంది?
కొన్ని రకాల పాత ఆఫీస్ యాక్సెస్ కార్డులు, హోటల్ రూమ్ కీ-కార్డులు, కొన్ని ఐడీ కార్డులు చాలా దూరంలో ఉన్నా సిగ్నల్స్‌ను క్యాచ్ చేయగలవు. ఇలాంటి కార్డుల డేటా లీక్ కాకుండా ఉండటానికి అల్యూమినియం ఫాయిల్ ఒక అదనపు ప్రొటెక్షన్ లేయర్‌లా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఎక్కువ సంఖ్యలో RFID కార్డులు వాడుతున్నప్పుడు సెక్యూరిటీ కోసం ఇది తాత్కాలికంగా పనికొస్తుంది.

ఈ ట్రిక్ మీరు వాడొచ్చా?  
మీ లక్ష్యం కేవలం ఆర్‌ఎఫ్‌ఐడీ సిగ్నల్స్‌ను అడ్డుకోవడమే అయితే అల్యూమినియం ఫాయిల్ ఉపయోగపడుతుంది. కానీ దీనిని సంపూర్ణ భద్రతగా భావించకూడదు. రోజూ వ్యాలెట్‌కి ఫాయిల్ పేపర్లు చుట్టడం అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, కాస్త బడ్జెట్ ఉంటే సర్టిఫైడ్ RFID బ్లాకింగ్ వ్యాలెట్ కొనడమే తెలివైన పని. వీటితో పాటు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ఆన్ చేసుకోవడం, బ్యాంక్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గమనించడం, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకపోవడమే నిజమైన సైబర్ రక్షణ. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »