భారత మార్కెట్లో వన్ ప్లస్ నాడ్ బడ్స్ 4 అసలు ధర రూ.3,299 గా కంపెనీ నిర్ణయించింది.
Photo Credit: OnePlus
OnePlus Nord Buds 4
OnePlus : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం వన్ ప్లస్ గత వారం భారతీయ మార్కెట్లో ఘనంగా లాంచ్ చేసిన సరికొత్త ఇయర్‌బడ్స్ OnePlus Nord Buds 4 నేటి నుంచి అధికారికంగా విక్రయానికి వచ్చేశాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ రోజు నుంచి కస్టమర్లు వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌లో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెంట్ మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో ప్రీమియం సౌండ్ క్వాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కోరుకునే ఆడియో ప్రియులను టార్గెట్ చేస్తూ వన్ ప్లస్ ఈ గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ధర ఎంత? లాంచ్ ఆఫర్లు ఏమున్నాయి?
భారత మార్కెట్లో వన్ ప్లస్ నాడ్ బడ్స్ 4 అసలు ధర రూ.3,299 గా కంపెనీ నిర్ణయించింది. ఈ రోజు నుంచి వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్స్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే, లాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల కోసం కంపెనీ ఒక ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. పరిమిత కాలం పాటు ఈ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.3,099 ల ప్రత్యేక ధరకే సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వస్తున్న బెస్ట్ ఆడియో ఆప్షన్ కావడంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది.
కళ్లు చెదిరే ఆడియో క్వాలిటీ, ఏఐ ఫీచర్లు
ఈ సరికొత్త వన్ ప్లస్ నాడ్ బడ్స్ 4 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 12 మిమీ టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు, ఇవి స్పష్టమైన మ్యూజిక్, బరువైన బేస్‌ను అందిస్తాయి. ఈ బడ్స్ 52dB వరకు బయటి శబ్దాలు రాకుండా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను సపోర్ట్ చేస్తాయి. అలాగే అవసరమైనప్పుడు చుట్టుపక్కల శబ్దాలు వినడానికి ట్రాన్స్‌పరెంట్ మోడ్ కూడా ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి వాయిస్ క్లియర్‌గా వెళ్లడం కోసం ఇందులో ఏకంగా 6 మైక్రోఫోన్లు, ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని చేర్చారు. యూజర్లు ఇందులో ఉండే ఏఐ అసిస్టెంట్‌ని ఆన్ చేయడం ద్వారా అలారాలు, రిమైండర్లు, వాతావరణ అప్‌డేట్లు పొందవచ్చు. అంతేకాకుండా, ఇందులో ఉండే ఏఐ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా కొన్ని వన్ ప్లస్ ఫోన్లలో రియల్ టైమ్‌లో భాషను అనువదించుకునే పర్సనల్ ఇంటర్‌ప్రెటర్ సదుపాయం కూడా లభిస్తుంది.
Infinix Note 60 Pro : 6.78 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే.. ఆకట్టుకుంటున్న కొత్త ఇన్ఫినిక్స్ మొబైల్
భారీ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్
బ్యాటరీ విషయానికి వస్తే, ప్రతి ఇయర్‌బడ్‌లో 62mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 530mAh బ్యాటరీని అందించారు. మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి వాడుకుంటే.. ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జ్‌పై 6.5 గంటలు, కేస్‌తో కలిపి 27 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ఒకవేళ ఏఎన్‌సీ ఆఫ్ చేసి వాడితే, ఇయర్‌బడ్స్ ఏకంగా 13 గంటలు, కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయి. కేవలం 10 నిమిషాల పాటు క్విక్ ఛార్జ్ చేయడం ద్వారా 11 గంటల పాటు మ్యూజిక్ వినేలా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను ఇందులో డిజైన్ చేశారు.
ఈ ఇయర్‌బడ్స్‌కు నీరు, చెమట నుంచి రక్షణ కల్పించేలా IP55 రేటింగ్‌ను ఇచ్చారు, కాబట్టి జిమ్‌లో వర్కవుట్స్ చేసేటప్పుడు కూడా వీటిని ధైర్యంగా వాడుకోవచ్చు. బరువు విషయానికి వస్తే ప్రతి బడ్ కేవలం 4.3 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీని పొడవు 29.56 మిమీ, వెడల్పు 19.69 మిమీ, మందం 22.63 మిమీగా ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999