Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 16 సిరీస్.. ఫోన్ వెనుక భాగంలో అంతరిక్ష గ్రహం తిరిగేలా క్రేజీ డిజైన్

ఒప్పో రెనో 16 సిరీస్ 3D పాప్ ప్లానెట్ డిజైన్, డెడికేటెడ్ AI స్నాప్ కీ, IP69K ప్రొటెక్షన్‌తో భారత్‌లో త్వరలో లాంచ్ కానుంది.

Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 16 సిరీస్.. ఫోన్ వెనుక భాగంలో అంతరిక్ష గ్రహం తిరిగేలా క్రేజీ డిజైన్

Photo Credit: Oppo Reno 16

Oppo Reno 16

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి ఒప్పో రేనో 16 సిరీస్
  • ఒప్పో ఫోన్లలో తొలిసారి ప్రత్యేక ‘AI స్నాప్ కీ’
  • హోలోవర్స్ 3D టెక్నాలజీ, ఐఫోన్ తరహా యాక్షన్ బటన్
ప్రకటన

Oppo Reno 16 : దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కెమెరా, డిజైన్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఒప్పో రెనో సిరీస్ సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమైంది. చైనా మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టించిన ఒప్పో రెనో 16 సిరీస్‌ను అతి త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ లాంచ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన లుక్, ప్రధాన ఫీచర్లు, బాడీ డిజైన్ వివరాలను ఒప్పో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈసారి ఈ సిరీస్‌లో అధునాతన ఏఐ ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.

బ్యాక్ ప్యానెల్‌పై తిరిగే 3D ప్లానెట్ మ్యాజిక్
ఈ ఫోన్ యొక్క రియర్ డిజైన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో సరికొత్త 3D పాప్ ప్లానెట్ డిజైన్‎ను ఉపయోగించారు. ముఖ్యంగా స్టార్రి వైట్  కలర్ వేరియంట్‌లో ఈ టెక్నాలజీ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌ను ఇస్తుంది. దీని కోసం కంపెనీ హోలోవర్స్ 3D టెక్నాలజీని వాడింది. ఫోన్ వెనుక భాగంలో స్పెషల్ మైక్రో లెన్స్ స్ట్రక్చర్, ఆప్టికల్ లేయర్లను అమర్చడం వల్ల.. ఫోన్‌ను వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు లోపల ఒక గ్రహం నిజంగానే తేలుతూ తిరుగుతున్నట్లు భ్రమ కల్పిస్తుంది.

డిస్‌ప్లే పరిమాణాలు, బ్రైట్‌నెస్
ఈ సిరీస్ కింద రెండు వేర్వేరు స్క్రీన్ సైజుల ఫోన్లు రానున్నాయి. ఒప్పో రెనో 16 మోడల్‌లో 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్న 6.32 ఇంచుల అమోలెడ్   స్క్రీన్‌ను అందించారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీని గరిష్ట బ్రైట్‌నెస్ 1800 నిట్స్ వరకు ఉంటుంది. మరోవైపు ఒప్పో రెనో 16c మోడల్‌లో కాస్త పెద్దదైన 6.57 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌ను చేర్చారు. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఫోన్ పక్కనే ప్రత్యేకమైన AI స్నాప్ కీ
ఒప్పో చరిత్రలోనే మొదటిసారిగా ఈ సిరీస్ ఫోన్ల సైడ్ ఫ్రేమ్‌పై AI స్నాప్ కీ అనే ప్రత్యేకమైన డెడికేటెడ్ బటన్‌ను ఇచ్చారు. దీనిని వినియోగదారులు తమకు నచ్చిన పనుల కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ బటన్‌ను ఒకసారి నొక్కితే స్క్రీన్ పై ఉన్న కంటెంట్ మైండ్ స్పేస్‎లో సేవ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ నోట్ రికార్డ్ అవుతుంది, అలాగే డబుల్ ప్రెస్ చేస్తే నేరుగా మైండ్ స్పేస్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా కెమెరా షట్టర్, టార్చ్ లైట్, ట్రాన్స్‌లేటర్ వంటి ఫీచర్లకు కూడా దీనిని షార్ట్‌కట్‌గా వాడుకోవచ్చు.

Ai+ Nova : భారత మార్కెట్లోకి Ai+ నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. తక్కువ ధరలోనే నోవా సిరీస్ హల్చల్

ఇన్-బిల్ట్ చాట్‌జీపీటీ, జెమిని ఏఐ సపోర్ట్
ఈ ఫోన్లలో AI మైండ్ పైలట్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ను జత చేశారు. దీని సహాయంతో గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ వంటి పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నేరుగా ఫోన్ సిస్టమ్‌లోనే అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఇంటర్నెట్‌లో ఏదైనా సమాచారాన్ని వేగంగా సెర్చ్ చేయడం, వేర్వేరు సమాధానాలను పోల్చి చూడడం, ఫోన్ లోని డేటాను స్మార్ట్‌గా మేనేజ్ చేయడం వంటి పనులు చాలా సులువుగా మారిపోతాయి.

ఏరోస్పేస్ బాడీ, ఐపీ69K గట్టి రక్షణ
ఫోన్ల పరిమాణం చూస్తే రెనో 16 మోడల్ 8.22mm మందం, 182 గ్రాముల బరువు ఉంటుంది. రెనో 16c మోడల్ 8.44mm మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది. ఫోన్ గట్టిదనం కోసం ఇందులో ప్లాస్టిక్ కాకుండా ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ను వాడారు, ఇది కింద పడినా దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్షణ పరంగా దీనికి అత్యంత కఠినమైన IP66, IP68, IP69, IP69K సర్టిఫికేషన్లు రేటింగ్‌లు ఇచ్చారు. అంటే ధూళి, నీరు, హై-ప్రెషర్ వాటర్ జెట్స్ పడినా ఫోన్ పాడవదు. అలాగే స్ప్లాష్ టచ్, గ్లోవ్ టచ్ ఫీచర్ల వల్ల చేతులు తడిగా ఉన్నా లేదా గ్లౌజ్ వేసుకున్నా స్క్రీన్ చక్కగా రెస్పాండ్ అవుతుంది. అయితే ఈ ఫోన్ల ధర,  లాంచ్ డేట్‌ను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Apple : ఆపిల్ ప్రియులకు భారీ షాక్.. త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం
  2. Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 16 సిరీస్.. ఫోన్ వెనుక భాగంలో అంతరిక్ష గ్రహం తిరిగేలా క్రేజీ డిజైన్
  3. xiaomi 18 pro : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. సరికొత్త 2K ప్రైవసీ స్క్రీన్‌తో వస్తున్న షాఓమీ 18 ప్రో
  4. OnePlus 16T : వన్‌ప్లస్ నుంచి కాంపాక్ట్ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 16T లీక్
  5. Infinix : భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్ లాంచ్.. ఇటాలియన్ రేసింగ్ కార్ డిజైన్‌తో క్రేజ్
  6. Ai+ Nova : భారత మార్కెట్లోకి Ai+ నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. తక్కువ ధరలోనే నోవా సిరీస్ హల్చల్
  7. Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
  8. Coolpad : మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి అదిరిపోయే డిజైన్‌తో కూల్ 80 లాంచ్
  9. Magnetic Cooling : ఇకపై గ్యాస్ అక్కర్లేదు.. కంప్రెసర్ అవసరం లేదు.. అయస్కాంతంతో పనిచేసే ఏసీలు, ఫ్రిజ్‌లు
  10. Smartphones : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రివర్స్ ట్రెండ్.. సరికొత్త మిడ్-రేంజ్ 4G ఫోన్ల రీ-ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »