xiaomi 18 pro : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. సరికొత్త 2K ప్రైవసీ స్క్రీన్‌తో వస్తున్న షాఓమీ 18 ప్రో

షాఓమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో నెక్స్ట్-జెనరేషన్ 2K ప్రైవసీ ప్రొటెక్షన్ డిస్‌ప్లే ఫీచర్ రానుంది.

xiaomi 18 pro : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. సరికొత్త 2K ప్రైవసీ స్క్రీన్‌తో వస్తున్న షాఓమీ 18 ప్రో

Photo Credit: xiaomi 18 pro

xiaomi 18 pro

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్
  • పక్కనున్న వాళ్లకు మీ ఫోన్ స్క్రీన్ అస్సలు కనిపించదు
  • శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా బాటలోనే షాఓమీ
ప్రకటన

xiaomi 18 pro : గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షాఓమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్, డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న షాఓమీ 17 సిరీస్ సక్సెస్ తర్వాత, కంపెనీ తన తదుపరి తరం షాఓమీ 18 సిరీస్‎ను మార్కెట్లోకి తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ అప్‌కమింగ్ సిరీస్ కింద షాఓమీ 18 స్టాండర్డ్ మోడల్‌తో పాటు షాఓమీ 18 ప్రో, షాఓమీ 18 ప్రో మాక్స్ మోడళ్లను కంపెనీ లాంచ్ చేయనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈసారి రాబోయే ప్రో మోడల్‌లో ఎవరూ ఊహించని సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీని తీసుకురాబోతున్నారట.

ఆకట్టుకునే నెక్స్ట్-జెనరేషన్ 2K ప్రైవసీ స్క్రీన్
ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన తాజా సమాచారం ప్రకారం.. షాఓమీ ప్రస్తుతం ఒక సరికొత్త నెక్స్ట్-జెనరేషన్ 2K డిస్‌ప్లేను టెస్ట్ చేస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఇన్-బిల్ట్  ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్‎ను అమర్చారు. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో మాత్రమే ఈ తరహా అడ్వాన్స్‌డ్ ప్రైవసీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇదే టెక్నాలజీని షాఓమీ తమ 18 ప్రో మోడల్‌లో కూడా అందించడానికి ప్రయోగాలు చేస్తోంది.

ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా మనం పబ్లిక్ ప్లేస్‌లలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు పక్కన నిలబడే వారు మన ఫోన్ స్క్రీన్ వైపు తొంగిచూస్తూ ఉంటారు. దీనివల్ల మన పర్సనల్ చాటింగ్‌లు, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఇతర సున్నితమైన సమాచారానికి రక్షణ ఉండదు. కానీ షాఓమీ తీసుకురాబోయే ఈ కొత్త ప్రైవసీ ప్రొటెక్షన్ స్క్రీన్ వల్ల.. ఫోన్‌ను నేరుగా చూసే వినియోగదారునికి మాత్రమే స్క్రీన్ పై ఉన్న కంటెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. పక్కన లేదా సైడ్ యాంగిల్స్ నుంచి చూసే వారికి స్క్రీన్ కేవలం నల్లగా లేదా బ్లర్‌గా మాత్రమే కనిపిస్తుంది. దీనివల్ల యూజర్ల పర్సనల్ డేటాకు పూర్తి ప్రైవసీ లభిస్తుంది.

Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?

లాంచ్ పద్ధతిలో కీలక మార్పులు
గత ఏడాది షాఓమీ కంపెనీ తమ షాఓమీ 17, షాఓమీ 17 ప్రో,  ప్రో మాక్స్ మోడళ్లను ఒకేసారి సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. కానీ ఈసారి షాఓమీ తన లాంచ్ సరళిని మార్చబోతున్నట్లు లీక్స్ చెప్తున్నాయి. రాబోయే సిరీస్‌లో స్టాండర్డ్, ప్రో మోడళ్లను ఒకేసారి కాకుండా.. షాఓమీ 18 ప్రో మోడల్‌ను అందరికంటే ముందుగా మార్కెట్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రో మోడల్ మార్కెట్లోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాతే బేస్ మోడల్ అయిన షాఓమీ 18 ను విడుదల చేయనున్నారు.

పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్లు
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లలో క్వాల్‌కామ్ కంపెనీ రాబోయే అత్యంత పవర్‌ఫుల్ చిప్‌సెట్లను ఉపయోగించనున్నారు. క్వాల్‌కామ్ తమ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 సిరీస్ ప్రొసెсорలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. ఆ తర్వాతే షాఓమీ 18 సిరీస్ విడుదల కానుంది. అయితే ఫోన్ల తయారీ ఖర్చును కంట్రోల్‌లో ఉంచడానికి బేస్ మోడల్ అయిన షాఓమీ 18 లో నార్మల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌ను వాడనున్నారు. కానీ ప్రీమియం మోడళ్లయిన షాఓమీ 18 ప్రో,  షాఓమీ 18 ప్రో మాక్స్ లలో మాత్రం అత్యంత ఖరీదైన, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్లను అమర్చబోతున్నట్లు సమాచారం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Apple : ఆపిల్ ప్రియులకు భారీ షాక్.. త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం
  2. Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 16 సిరీస్.. ఫోన్ వెనుక భాగంలో అంతరిక్ష గ్రహం తిరిగేలా క్రేజీ డిజైన్
  3. xiaomi 18 pro : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. సరికొత్త 2K ప్రైవసీ స్క్రీన్‌తో వస్తున్న షాఓమీ 18 ప్రో
  4. OnePlus 16T : వన్‌ప్లస్ నుంచి కాంపాక్ట్ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 16T లీక్
  5. Infinix : భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్ లాంచ్.. ఇటాలియన్ రేసింగ్ కార్ డిజైన్‌తో క్రేజ్
  6. Ai+ Nova : భారత మార్కెట్లోకి Ai+ నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. తక్కువ ధరలోనే నోవా సిరీస్ హల్చల్
  7. Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
  8. Coolpad : మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి అదిరిపోయే డిజైన్‌తో కూల్ 80 లాంచ్
  9. Magnetic Cooling : ఇకపై గ్యాస్ అక్కర్లేదు.. కంప్రెసర్ అవసరం లేదు.. అయస్కాంతంతో పనిచేసే ఏసీలు, ఫ్రిజ్‌లు
  10. Smartphones : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రివర్స్ ట్రెండ్.. సరికొత్త మిడ్-రేంజ్ 4G ఫోన్ల రీ-ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »