వన్‌ప్లస్ 16T స్మార్ట్‌ఫోన్ లీక్స్ ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తున్నాయి. 6.3 ఇంచుల కాంపాక్ట్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్ వివరాలు తెలుసుకుందాం.
Photo Credit: OnePlus 16T
OnePlus 16T
OnePlus 16T : ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మార్కెట్లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను విస్తరించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మిడ్-రేంజ్, ప్రీమియం సెగ్మెంట్లలో తిరుగులేని అమ్మకాలతో దూసుకుపోతున్న ఈ కంపెనీ, ఇప్పుడు ఒక సరికొత్త చిన్న సైజు స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ దీనికి సంబంధించిన లీక్స్‌ను పంచుకున్నారు. లీకైన వివరాలు, నెటిజన్ల కామెంట్స్ ప్రకారం.. ఈ ఫోన్ వన్‌ప్లస్ 16T పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సరికొత్త వన్‌ప్లస్ 16T స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ సంస్థ త్వరలోనే ప్రతిష్టాత్మకంగా పరిచయం చేయబోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌ను ఉపయోగించబోతున్నారట. ఈ పవర్‌ఫుల్ చిప్‌సెట్ రాబోయే కొన్ని నెలల్లో అధికారికంగా విడుదల కానుంది. సైజు పరంగా ఈ ఫోన్ చిన్నదిగా ఉన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్, స్పీడ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ నెక్స్ట్ జనరేషన్ చిప్‌ను ఇందులో అమర్చబోతున్నారు. లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల కాంపాక్ట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
ఈ ఏడాది మార్చి నెలలో చైనా మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ 15T మోడల్‌కు సక్సెసర్‌గా ఈ కొత్త వన్‌ప్లస్ 16T రానుంది. గత మోడల్ అయిన వన్‌ప్లస్ 15T కేవలం చైనాకే పరిమితమై, అంతర్జాతీయ మార్కెట్లలోకి ఇంకా విడుదల కాలేదు. పాత మోడల్ అయిన వన్‌ప్లస్ 15T లో 6.32 ఇంచుల 1.5K LTPO AMOLED స్క్రీన్‌ను అందించారు, ఇది ఏకంగా 165Hz హై రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా కంటి రక్షణ కోసం దీనికి TUV Rheinlandలో బ్లూ లైట్, స్మార్ట్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
గత వన్‌ప్లస్ 15T మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెн 5 ప్రాసెసర్‌ను వాడారు. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ప్రత్యేకంగా నెక్స్ట్-జనరేషన్ విండ్ చేజర్ గేమింగ్ కెర్నల్ టెక్నాలజీని అందించారు, ఇది గేమింగ్ సమయంలో ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16 పై రన్ అవుతుంది. సెక్యూరిటీ కోసం అడ్వాన్స్‌డ్ ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అమర్చారు.
వన్‌ప్లస్ 15T కెమెరా విభాగంలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఆల్ట్రా విజన్ ప్రైమరీ కెమెరాతో పాటు, మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలదు. ఇది 4K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయగలదు. అంతేకాకుండా, ఇందులో ఏకంగా 100W సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే భారీ 7,500 mAh గ్లేసియర్ బ్యాటరీని అందించడం విశేషం. ఇప్పుడు రాబోయే వన్‌ప్లస్ 16T లో ఈ ఫీచర్లను మరింత అప్‌గ్రేడ్ చేసి సరికొత్త టెక్నాలజీతో కస్టమర్ల ముందుకు తీసుకురానున్నారు.
ప్రకటన
ప్రకటన
Infinix Note 60 Pro Pininfarina Edition Launched in India With 6,500mAh Battery, Snapdragon 7s Gen 4 SoC