OTT : ఓటీటీ లవర్స్‌కు పండగే పండగ.. ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్, సిరీస్ ఇవే

ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రాజా శివాజీ’ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT : ఓటీటీ లవర్స్‌కు పండగే పండగ.. ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్, సిరీస్ ఇవే

Photo Credit: Raja Shivaji

Raja Shivaji

ముఖ్యాంశాలు
  • ఓటీటీ లవర్స్‌కు పండగే పండగ
  • జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్షమైన జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ అవతార్
  • అమెజాన్ ప్రైమ్‌లో ‘గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2’ హడావిడి
ప్రకటన

OTT : డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే వారికి ఈ వారం ఒక పండగ లాంటిదని చెప్పవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ఎన్నో క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒకేసారి విడుదలయ్యాయి. మీరు ఈ వీకెండ్ అంతా ఇంట్లోనే ఉండి హాయిగా ఎంజాయ్ చేయడానికి వీలుగా, అత్యుత్తమ కొత్త ఓటీటీ రిలీజ్‌ల పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో చారిత్రాత్మక చిత్రం రాజా శివాజీ 
ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రాజా శివాజీ' జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నతనం నుంచి, రాజమాత జిజాబాయి మార్గదర్శకత్వంలో ఆయన సాధించిన సైనిక విజయాలు, అఫ్జల్ ఖాన్‌తో జరిగిన చారిత్రాత్మక పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసి, మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్  వంటి స్టార్స్ నటించారు.

సోనీలివ్‌లో ఫ్యామిలీ డ్రామా పర్ఫెక్ట్ ఫ్యామిలీ 
గుల్షన్ దేవయ్య, నేహా ధూపియా, మనోజ్ పహ్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఎనిమిది ఎపిసోడ్‌ల హిందీ సిరీస్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ జూన్ 26 నుంచి సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదట యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ పద్ధతిలో విడుదలైన ఈ సిరీస్‌ను సచిన్ పాఠక్ డైరెక్ట్ చేశారు. బయటకు చాలా హ్యాపీగా, పర్‌ఫెక్ట్‌గా కనిపించే కర్కరియా కుటుంబంలోని చిన్న కూతురు స్కూల్‌లో ఎమోషనల్ బ్రేక్‌డౌన్‌కు గురవుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తం థెరపీ తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో వారి మధ్య ఉన్న పాత గొడవలు, రహస్యాలు ఎలా బయటపడ్డాయి అనేదే ఈ సిరీస్ కథ.

అమెజాన్ ప్రైమ్‌లో గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 
గ్రామీణ వైద్యం నేపథ్యంతో సాగే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సిరీస్ ‘గ్రామ్ చికిత్సాలయ్' తన రెండవ సీజన్‌తో జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హల్‌చల్ చేస్తోంది. టీవీఎఫ్ (TVF) నిర్మించిన ఈ ఐదు ఎపిసోడ్‌ల సిరీస్‌లో అమోల్ పరాశర్, వినయ్ పాఠక్, ఆకాంక్ష రంజన్ కపూర్ నటించారు. భత్కండి గ్రామంలోని నిర్లక్ష్యం చేయబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెరుగుపరచడానికి డాక్టర్ ప్రభాత్ (అమోల్ పరాశర్) చేసే ప్రయత్నాలు, ఈ సీజన్‌లో పల్లెటూరి రాజకీయం, మందుల కొరత,  ప్రభుత్వ అధికారుల వల్ల వచ్చే ఇబ్బందులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.

నెట్‌ఫ్లిక్స్‌లోకి లాక్ అప్ సీజన్ 2 రియాలిటీ షో
గతంలో ఆల్ట్ బాలాజీలో వచ్చి సూపర్ హిట్ అయిన జైలు నేపథ్య రియాలిటీ షో ‘లాక్ అప్' ఇప్పుడు తన రెండవ సీజన్‌తో జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతోంది. ఈ క్రేజీ షోకు ఈసారి ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. జైలు లాంటి సెటప్‌లో 14 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఉంచి, వారితో కఠినమైన టాస్కులు ఆడిస్తారు. ప్రస్తుతానికి రామ్ కపూర్, శివాంగి జోషి, ఇన్‌ఫ్లుయెన్సర్ పమేలా సెరెనా కంటెస్టెంట్లుగా కన్ఫర్మ్ అయ్యారు.

జియోహాట్‌స్టార్‌లో రివెంజ్ థ్రిల్లర్  లింగం 
తమిళనాడు దక్షిణ జిల్లాల్లో 1990,  2000ల ప్రారంభంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘లింగం' జూన్ 26 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. కబడ్డీ ప్లేయర్ అయిన కథానాయకుడు పోలీస్ అవ్వాలని కలలుకంటాడు, కానీ ఒక హత్య కేసులో అన్యాయంగా ఇరుక్కుంటాడు. ఆ తర్వాత న్యాయం కోసం, పగ తీర్చుకోవడం కోసం అతడు చేసిన పోరాటమే ఈ సిరీస్. కదిర్, దివ్య భారతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ హాట్‌స్టార్ స్పెషల్ సిరీస్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ బ్లాస్ట్ 
తమిళ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సినిమా బ్లాస్ట్ జూన్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ నటించారు. కరాటే మాస్టర్ అయిన రాజారాం తన భార్య, కూతురితో కలిసి హ్యాపీగా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. వీరి ముగ్గురికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి పట్టు ఉంటుంది. అయితే ఒక ప్రమాదకరమైన నేరగాళ్ల ముఠాతో వీరికి శత్రుత్వం ఏర్పడినప్పుడు, ఆ ముఠాను వీరు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా కథనం.

జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ అవతార్: ఫైర్ అండ్ యాష్ 
హాలీవుడ్ సంచలనం జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన మూడవ అవతార్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్' జూన్ 24 నుంచి జియోహాట్‌స్టార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పండోరా గ్రహంలోని సరికొత్త ప్రాంతాలు, కొత్త ముప్పు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తమ కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న జేక్ సుల్లీ, నెయ్‌తిరి దంపతులు అగ్ని,  వినాశనానికి ప్రతీక అయిన యాష్ పీపుల్ (బూడిద తెగ) అనే కొత్త క్లాన్‌ను కలుసుకుంటారు. మానవుల నుంచి, ఆ తెగ నుంచి మనుగడ సాగించడానికి వారు చేసిన పోరాటాన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు.

మహా యుద్ధానికి సిద్ధమైన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3'
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్' అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడవ సీజన్ జూన్ 22 నుంచి భారత్‌లో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన 'ఫైర్ అండ్ బ్లడ్' నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సీజన్ లో రాణి రాహెనిరా టార్గేరియన్ తన హక్కుల కోసం చేసే పోరాటం, ఆమె ప్రత్యర్థులైన టీమ్ గ్రీన్ (ఏగాన్ II, ఏమండ్) ల మధ్య జరిగే భీకరమైన డ్రాగన్ యుద్ధాలు, సముద్ర పోరాటాలు ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని కలిగిస్తాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2'
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ లైవ్-యాక్షన్ సిరీస్ ‘అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్' సీజన్ 2 జూన్ 25 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త సీజన్ ప్రధానంగా భూమి ఎలిమెంట్‌పై కేంద్రీకృతమై ఉంటుంది. ఆంగ్, అతని గ్యాంగ్ ఎర్త్ కింగ్‌డమ్‌లోని ప్రసిద్ధ ప్రాకారాల నగరం బా సింగ్ సేకి చేరుకునే ప్రయాణాన్ని ఇందులో చూపించారు. కొత్త పాత్రలు, ఊహించని ట్విస్టులతో ఈ సీజన్ ఫ్యాంటసీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఈ వారం విడుదలైన మరికొన్ని ముఖ్యమైన చిత్రాలు
ఇవే కాకుండా జియోహాట్‌స్టార్‌లో జూన్ 22 నుంచి ది ఏజెన్సీ సీజన్ 2, జూన్ 26 నుంచి వరల్డ్ ఫేమస్ ‘ది బేర్ సీజన్ 5' స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 23 న ‘బిల్లీ ఎలిష్ – హిట్ మీ హార్డ్ అండ్ సాఫ్ట్: ది టూర్', ‘బ్లూ హెరాన్', ‘కరోలినా కరోలినా',  జూన్ 26 న ‘అలయన్స్', ‘సావేజ్ హౌస్' విడుదలయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 24 న ‘ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ డాంటే', జూన్ 26 న ‘లిటిల్ బ్రదర్', ‘ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్' స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఈటీవీ విన్ లో జూన్ 25 న ‘డియర్ కేరళ కుట్టి', మనోరమ మాక్స్ లో ‘కప్', జీ5 ప్లాట్‌ఫారమ్‌లో జూన్ 26 నుంచి ‘మమ్మట్టియాన్ స్టార్స్', ‘ముత్తస్సి' వంటి సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Red Magic Tablet 5Pro : గేమర్స్‌కు పూనకాలే.. మార్కెట్లోకి వస్తున్న సరికొత్త రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో
  2. Realme P4 Series : రియల్‌మీ కస్టమర్లకు భారీ షాక్.. పీ4 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచేసిన కంపెనీ
  3. OTT : ఓటీటీ లవర్స్‌కు పండగే పండగ.. ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్, సిరీస్ ఇవే
  4. Oppo Reno 16 : గ్లోబల్ మార్కెట్లోకి ఒప్పో సరికొత్త ఫ్లాగ్‌షిప్స్.. ఒప్పో రెనో 16 సిరీస్ అఫీషియల్ లాంచ్
  5. 8849 Tank 5 : స్మార్ట్‌ఫోన్ లోనే హోమ్ థియేటర్.. ఇన్-బిల్ట్ ప్రొజెక్టర్‎తో వచ్చిన సరికొత్త రగ్గడ్ మొబైల్
  6. Google Pixel 10 : అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్
  7. Hydrogen Train : ప్రపంచంలోనే మొదటిసారి.. పట్టాలెక్కబోతున్న సరికొత్త హైడ్రోజన్ రైలు
  8. vivo y05e : భారత మార్కెట్లోకి వివో సరికొత్త బడ్జెట్ ఫోన్.. వివో Y05e లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్
  9. Lava Smart 4 Plus : భారత మార్కెట్లోకి లావా కొత్త బడ్జెట్ ఫోన్.. రూ.10 వేల లోపే లావా స్మార్ట్ 4 ప్లస్ లాంచ్
  10. Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో సరికొత్త సంచలనం.. జూలై 2న ఒప్పో రెనో 16 సిరీస్ గ్రాండ్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »