Online Gaming firms Approach Supreme Court over 28% GST verdict: దేశీయ గేమింగ్ కంపెనీలు ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా...
Online Gaming
Online Gaming firms Approach Supreme Court over 28% GST Verdict: ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ తగిలింది. గేమింగ్‌పై ప్రభుత్వం విధించిన 28 శాతం వస్తు సేవల పన్ను నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రముఖ గేమింగ్ సంస్థలు సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. కోర్టు ఇచ్చిన పాత తీర్పును పునఃపరిశీలించాలంటూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ ఈ 28 శాతం పన్ను నిబంధన గనుక పూర్తిగా అమల్లోకి వస్తే.. దేశీయ గేమింగ్ కంపెనీలు ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో పన్ను భారం పడితే పరిశ్రమ మనుగడే కష్టమవుతుందని గేమింగ్ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.1.5 లక్షల కోట్ల పన్ను భారం..
మీడియా నివేదికల ప్రకారం.. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ప్లే గేమ్స్24x7, జంగ్లీ గేమ్స్ ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే మరికొన్ని పెద్ద గేమింగ్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వివాదంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన చట్టపరమైన అంశాలు ముడిపడి ఉన్నందున, ఈ కేసును ఒక పెద్ద రాజ్యాంగ బెంచ్‌కు బదిలీ చేసి విచారణ జరపాలని గేమింగ్ కంపెనీలు తమ పిటిషన్లలో గట్టిగా దమ్ము పడుతున్నాయి.
ఎంట్రీ ఫీజుపై పన్ను వేయడం ఏంటి..?
గేమింగ్ కంపెనీలు కోర్టు ముందు ఉంచిన ప్రధాన వాదన ఏంటంటే.. ఆటగాళ్లు గెలుచుకున్న నికర బహుమతి మొత్తం పై మాత్రమే జీఎస్టీని పరిమితం చేయాలి. కానీ అలా చేయకుండా, గేమ్‌లో పాల్గొనడానికి ప్లేయర్స్ చెల్లించే ఎంట్రీ ఫీజు పై పూర్తి స్థాయిలో 28 శాతం పన్ను విధించడానికి కోర్టు తప్పుడు పద్ధతిలో అనుమతి ఇచ్చిందని వారు వాదిస్తున్నారు. గేమర్లకు గెలుపు సొమ్ము బదిలీ అయినప్పుడే జీఎస్టీ వర్తింపజేయాలి తప్ప, గేమ్ లో కేవలం ఎంట్రీ ఫీజుగా కట్టే డబ్బుపై పన్ను వేయడం సరికాదని కంపెనీలు అంటున్నాయి. అలాగే జీఎస్టీ చట్టంలో సవరణల ద్వారా తెచ్చిన నిబంధనలను సుప్రీంకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, దీనివల్ల పాత తేదీల నుంచి చట్టాన్ని వర్తింపజేస్తున్నట్లు అవుతుందని ఆరోపించాయి. ఈ నిర్ణయం వల్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గేమింగ్ మధ్య తీవ్ర వివక్ష ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
TRAI vs Truecaller : ట్రూకాలర్ వర్సెస్ ట్రాయ్.. 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ముదిరిన వివాదం
ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై నిషేధం..
ఇటీవల సుప్రీంకోర్టు ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించే ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని సంచలన తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గతంలో గేమింగ్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ తీర్పు ప్రకారమే ఇప్పుడు జీఎస్టీ శాఖ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల పన్ను డిమాండ్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. దీనికి తోడు దేశంలో ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను అరికట్టేందుకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ అనే చట్టాన్ని కూడా తెచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఆన్‌లైన్ మనీ గేమింగ్ నిర్వహించడం చట్టవిరుద్ధం. ఎవరైనా దీనికి పాల్పడితే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.కోటి వరకు భారీ జరిమానా విధించేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features