యూజర్ల వయస్సును నిర్ధారించడానికి గూగుల్ ప్లే ఏజ్ సిగ్నల్ API అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది.
Photo Credit: freepnglogo
Google Play Store : టెక్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌లలో ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి, రెగ్యులేటరీ సంస్థల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి, నిబంధనల నేపథ్యంలోని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆపిల్ సంస్థ తన యాప్ స్టోర్‌లో ఈ రకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు గూగుల్ కూడా ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్లే స్టోర్‌లో రోల్‌అవుట్ చేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచంలో ఏ మూలన ఉన్న యూజర్ అయినా సరే యాప్‌లను యాక్సెస్ చేసే ముందు ఏజ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏమిటీ ప్లే ఏజ్ సిగ్నల్ API ?
యూజర్ల వయస్సును నిర్ధారించడానికి గూగుల్ ప్లే ఏజ్ సిగ్నల్ API అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఈ సిస్టమ్ యూజర్ల వ్యక్తిగత వివరాలను లేదా నిబంధనలను అతిక్రమించకుండా, ప్రైవసీకి పూర్తి భద్రతనిస్తూ వారి వయస్సు పరిమితిని డెవలపర్లు తెలుసుకునేలా చేస్తుంది. 2026 చివరి నాటికి అమెరికా మార్కెట్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ సిస్టమ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
Photo Credit: Google
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera