సరికొత్త కథాంశంతో రూపొందిన లింగం అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.
Photo Credit: JioHostar
Lingam will stream online on JioHotstar from June 26
Lingam OTT Release : ప్రస్తుతం ఓటీటీలలో క్రైమ్, సస్పెన్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు కస్టమర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సిరీస్‌లను వీక్షించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలోనే, సరికొత్త కథాంశంతో రూపొందిన లింగం అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. 2026లో అత్యంత ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ సిరీస్, ఇప్పుడు నేరుగా డిజిటల్ స్క్రీన్‌లపై అలరించడానికి సిద్ధమైంది.
ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?
ఈ సరికొత్త వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన జియోహాట్‌స్టార్‌లో జూన్ 26, 2026 నుంచి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా.. సౌతిడియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది. ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ క్రైమ్ డ్రామాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఉత్కంఠ రేపుతున్న లింగం కథ ఇదే
తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్ ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కంటుంటాడు. ఆ కలను నిజం చేసుకునే క్రమంలో, ఒక కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక హత్య జరుగుతుంది. ఆ మర్డర్ కేసులో ఈ యువకుడిపై తప్పుడు ఆరోపణలు రావడంతో అతనిపై అన్యాయంగా ముద్ర పడుతుంది. దీనివల్ల అతని కెరీర్ నాశనమవ్వడమే కాకుండా, పోలీస్ అవ్వాలనే కల ముక్కలై జీవితం అతలాకుతలం అవుతుంది.
ప్లేయర్ టు గ్యాంగ్‌స్టర్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్
ఆ తప్పుడు కేసు వల్ల సమాజం అతడిని క్రిమినల్‌గా చూస్తుంది. దాంతో విధి లేని పరిస్థితుల్లో, ప్రాణాలను కాపాడుకోవడానికి అతను క్రైమ్ ప్రపంచంలోకి (అండర్ వరల్డ్) అడుగుపెట్టాల్సి వస్తుంది. పరిస్థితులు అతడిని బలవంతంగా ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారుస్తాయి. తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా, నేర సామ్రాజ్యంలో తను ఎలా మనుగడ సాగించాడు? చివరికి తనపై ఉన్న నిందను ఎలా పోగొట్టుకున్నాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ రివెంజ్ డ్రామా సాగుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఈ సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేసింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో కథిర్, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామాను లక్ష్మీ శరవణకుమార్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ప్రశాంత్ పాండియరాజ్ సమర్పణలో.. పూర్ణిమ రవి, సత్య, బాస్ వెంకట్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. చలనచిత్ర రంగంలో మంచి గుర్తింపు ఉన్న వికటన్ టెలివిస్టాస్ సంస్థ ఈ సిరీస్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించింది.
Raakh OTT Release : ప్రైమ్ వీడియోలోకి వచ్చేసిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్'.. ఎలా ఉందంటే?
ప్రేక్షకులలో పెరుగుతున్న ఆదరణ
లింగం సిరీస్ ఇంకా అధికారికంగా రిలీజ్ కాకపోవడంతో ప్రస్తుతం దీనికి ఐఎమ్‌డీబీ రేటింగ్స్ ఏమీ రాలేదు. అయినప్పటికీ, దీని సస్పెన్స్ కథాంశం, విడుదలైన టీజర్, ట్రైలర్‌ల వల్ల సినిమా లవర్స్ లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కథిర్ నటన, గ్యాంగ్‌స్టర్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. జూన్ 26 న జియోహాట్‌స్టార్ లో రిలీజ్ కానున్న ఈ సరికొత్త థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know