బడ్జెట్ ధరలో పెద్ద టీవీ కోరుకునే వారికి రియల్‌మీ, టీసీఎల్ మోడల్స్ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.
Photo Credit: Flipkart
Realme TechLife 65 inch
Flipkart Freedom Sale : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై, ముఖ్యంగా పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీరు మీ ఇల్లు లేదా ఆఫీస్ కోసం సరికొత్త 65 ఇంచుల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. ఇదే సరైన సమయం. టీసీఎల్, రియల్‌మీ, మోటోరోలా, శామ్‌సంగ్, ఫిలిప్స్ వంటి టాప్ బ్రాండ్లకు చెందిన 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై లభిస్తున్న బెస్ట్ డీల్స్, బ్యాంక్ ఆఫర్ల వివరాలను తెలుసుకుందాం.
రియల్‌మీ అండ్ టీసీఎల్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీలపై క్రేజీ ఆఫర్లు
బడ్జెట్ ధరలో పెద్ద టీవీ కోరుకునే వారికి రియల్‌మీ, టీసీఎల్ మోడల్స్ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.
రియల్‌మీ టెక్‌లైఫ్ 65 ఇంచ్ 4K LED టీవీ (2025): ఎంఆర్‌పీ రూ. 80,199 ఉన్న ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 39,999 లకే లిస్ట్ అయ్యింది. ఇందులో 30W డౌన్‌ఫైరింగ్ స్పీకర్లు, డోల్బీ ఆడియో మద్దతు ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే రూ. 2,750 అదనపు తగ్గింపు లభించి, ఎఫెక్టివ్ ధర రూ. 37,249 కే సొంతం చేసుకోవచ్చు.
టీసీఎల్ T6C 65 ఇంచ్ QLED 4K టీవీ: రూ. 56,990 లీస్ట్ అయిన ఈ క్యూలెడ్ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మద్దతుతో వస్తుంది. డోల్బీ విజన్, 24W అట్మోస్ సౌండ్ ఉంది. ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 7,400 వరకు భారీ తగ్గింపు పొందితే, దీని ప్రభావవంతమైన ధర కేవలం రూ. 49,590 అవుతుంది.
మోటోరోలా, ఫిలిప్స్, శామ్‌సంగ్ విజన్ AI టీవీల డీల్స్
ప్రీమియం ఫీచర్లు, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారి కోసం మోటోరోలా, ఫిలిప్స్, శామ్‌సంగ్ బ్రాండ్లు అద్భుతమైన మోడళ్లను ఆఫర్ చేస్తున్నాయి.
మోటోరోలా 65 ఇంచ్ QLED Ultra 4K టీవీ (2025): రూ. 49,999 కి లభిస్తున్న ఈ టీవీలో 120Hz గేమ్ యాక్సిలరేటర్, 50W డోల్బీ అట్మోస్ స్పీకర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్‌పై రూ. 3,250 డిస్కౌంట్‌తో రూ. 46,749 కే పొందవచ్చు.
ఫిలిప్స్ 65 ఇంచ్ QLED 4K టీవీ: రూ. 55,999 గా ఉన్న ఈ మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 32GB స్టోరేజ్, 30W డాల్బీ స్పీకర్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ. 3,550 తగ్గింపు రాగా, ఎఫెక్టివ్ ధర రూ. 52,449 అవుతుంది.
శామ్‌సంగ్ విజన్ AI 65 ఇంచ్ 4K మిని టైజెన్ టీవీ (2026): రూ. 79,990 కి లిస్ట్ అయిన ఈ ప్రీమియం మిని ఎల్‌ఈడీ టీవీలో 30W పవర్ ఫుల్ స్పీకర్లు, శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ, 150+ ఫ్రీ ఛానెల్స్ వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై రూ. 4,750 డిస్కౌంట్ పోను దీని ధర రూ. 75,240 గా మారుతుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains