వాట్సాప్ వెబ్‌లో చేర్చిన ఈ కాలింగ్ సదుపాయం పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడుతుంది.
Photo Credit: WhatsApp
WhatsApp : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తమ వినియోగదారుల కాలింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. మాతృ సంస్థ మెటా, వాట్సాప్ ఆడియో, వీడియో కాలింగ్ విభాగంలో కీలకమైన కొత్త ఫీచర్లను అధికారికంగా పరిచయం చేసింది. ముఖ్యంగా వాట్సాప్ వెబ్ వినియోగదారులు ఇకపై ఎలాంటి డెస్క్‌టాప్ అప్లికేషన్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోకుండానే నేరుగా తమ బ్రౌజర్ ద్వారా వన్-ఆన్-వన్, గ్రూప్ కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ వెబ్‌లో అందుబాటులోకి కాలింగ్ టాబ్
వాట్సాప్ వెబ్‌లో చేర్చిన ఈ కాలింగ్ సదుపాయం పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడుతుంది. దీనివల్ల మీ సంభాషణలు అత్యంత సురక్షితంగా ఉంటాయి. ఇందుకోసం రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లో ఉండే స్క్రీన్ షేరింగ్, ఎమోజీ రియాక్షన్లు వంటి ఫీచర్లన్నీ ఇప్పుడు వెబ్‌లోనూ వాడుకోవచ్చు. అంతేకాకుండా మీ కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్టులను సులభంగా చూసుకోవడానికి వెబ్ వెర్షన్‌లో ఒక ప్రత్యేకమైన కాల్స్ టాబ్‌ను కూడా డిజైన్ చేశారు.
ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి కాల్ ట్రాన్స్‌ఫర్
వాట్సాప్ తీసుకొచ్చిన అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో కాల్ ట్రాన్స్‌ఫర్ ఒకటి. ప్రస్తుతం నడుస్తున్న గ్రూప్ కాల్‌ను కట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్‌లో మొదలుపెట్టిన గ్రూప్ కాల్‌ను, ఇంటికి రాగానే కట్ చేయకుండానే నేరుగా ల్యాప్‌టాప్ లేదా వాట్సాప్ వెబ్‌కి మార్చుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నుంచి మళ్లీ ఫోన్‌కి మారాలనుకుంటే కూడా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
Dell Laptops : ల్యాప్‌టాప్ మందం కేవలం 12 మిమీ.. టెక్ రంగాన్ని ఊపేస్తున్న డెల్ కంపెనీ
వెయిటింగ్ రూమ్, క్విక్ హెచ్‌డీ ఫీచర్లు
గ్రూప్ కాల్స్‌పై కాల్ హోస్ట్‌కు పూర్తి నియంత్రణ ఇచ్చేందుకు వెయిటింగ్ రూమ్ ఫీచర్‌ను పరిచయం చేశారు. మీరు కాల్ లింక్ క్రియేట్ చేసేటప్పుడు రెక్వైర్ అప్రూవల్ టూ జాయిన్ ఆప్షన్ ఎంచుకుంటే.. ఆ లింక్ క్లిక్ చేసిన ప్రతి ఒక్కరూ నేరుగా కాల్‌లోకి రాకుండా వర్చువల్ వెయిటింగ్ రూమ్‌లో ఉంటారు. హోస్ట్ అనుమతి ఇస్తేనే లోపలికి రాగలరు. ఇక క్విక్ హెచ్‌డీ ద్వారా కాల్ ప్రారంభమైన మొదటి కొన్ని సెకన్లలోనే హై-క్వాలిటీ వీడియో, బ్యాక్‌గ్రౌండ్ నోయిస్ క్యాన్సిలేషన్ లభిస్తాయి. ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999