అసూస్ వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,07,990గా ఉంది.
Photo Credit: Amazon
Vivobook 15
Asus : ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ అసూస్ భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్స్‌ను పరిచయం చేసింది. నిత్యం ల్యాప్‌టాప్‌లు వాడే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వినోదాన్ని కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ వివోబుక్ 14, వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త లైనప్‌ను కంపెనీ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రూపొందించింది. ఇవి యూజర్లకు విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తాయి. రోజువారీ పనులు, ఆఫీస్ వర్క్, గేమింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
రూ.75,990 లకే ల్యాప్‌టాప్
ధరల విషయానికి వస్తే.. అసూస్ వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,07,990గా ఉంది. దీనిని అసూస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అసూస్ ఈ-షాప్, అధికారిక రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక అసూస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్ బేస్ వేరియంట్ ధర రూ.75,990గా నిర్ణయించారు. దీనిని అసూస్ స్టోర్లతో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ల అధికారిక విక్రయాలు జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి కూల్ సిల్వర్, టెర్రా కోటా, క్వైట్ బ్లూ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటాయి.
ఇంటెల్ కోర్ 7 సిరీస్ ప్రాసెసర్, ప్రత్యేక ఎన్పీయూ
ఈ ల్యాప్‌టాప్‌ల పర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉండబోతోంది. ఇందులో పవర్ఫుల్ ఇంటెల్ కోర్ 7 350 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు ఏఐ టాస్క్‌లను వేగంగా ప్రాసెస్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక ఎన్‌పీయూను కూడా అమర్చారు. మెమొరీ పరంగా ఇందులో 16GB DDR5 ర్యామ్, 512GB వరకు అత్యంత వేగవంతమైన PCIe 4.0 NVMe SSD స్టోరేజ్‌ను అందించారు. దీనివల్ల ల్యాప్‌టాప్ ఆన్ అవ్వడం, భారీ సాఫ్ట్వేర్లను రన్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉన్నాయి.
Samsung Galaxy : ఫోల్డబుల్ మొబైల్ లవర్లకు భారీ షాక్.. శాంసంగ్ ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్లు శాశ్వతంగా బంద్ కానున్నాయా?
కళ్ల రక్షణ కోసం ప్రత్యేక సర్టిఫికేషన్, 180 డిగ్రీల హింజ్ డిజైన్
డిస్ప్లే విభాగంలో వివోబుక్ 14 మోడల్ 14 ఇంచుల ఫుల్ హెచ్డీ స్క్రీన్‌తో రాగా, వివోబుక్ 15 మోడల్ 15 ఇంచుల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ప్యానల్‌తో వస్తుంది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో 16:9 ఆస్పెక్ట్ రేషియో, 250 నిట్స్ బ్రైట్నెస్ లభిస్తాయి. ఎక్కువ సమయం స్క్రీన్ చూసే వారి కళ్లకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ఇందులో TÜV Rheinland సర్టిఫికేషన్ ఇచ్చారు. 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉండటం వల్ల స్క్రీన్ చాలా పెద్దగా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ల్యాప్‌టాప్‌ను 180 డిగ్రీల వరకు పూర్తిగా ఫ్లాట్‌గా వెనక్కి మడతబెట్టేలా డిజైన్ చేశారు.
మిలిటరీ గ్రేడ్ మన్నిక, ఫింగర్‌ప్రింట్ స్కానర్
ఈ ల్యాప్‌టాప్‌లు చాలా గట్టివి, మన్నికైనవి. ఎందుకంటే వీటికి MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లభించింది. అంటే చిన్నపాటి షాక్‌లు, ఒత్తిళ్లను ఇవి ఈజీగా తట్టుకోగలవు. సెక్యూరిటీ కోసం టచ్ప్యాడ్లోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. వీడియో కాల్స్ కోసం 720p HD వెబ్‌క్యామ్ ఉంది. ఆడియో విషయానికి వస్తే సోనిక్‌మాస్టర్ సౌండ్ టెక్నాలజీతో స్పష్టమైన సౌండ్ వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 42Wh బ్యాటరీని కేటాయించారు, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. వీటితో పాటు యూఎస్బీ టైప్-సి, యూఎస్బీ టైప్-ఎ, హెచ్డీఎమ్ఐ 1.4, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని రకాల కనెక్టివిటీ పోర్టులను ఇందులో ఇచ్చారు.
ప్రకటన
ప్రకటన