Acer : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఏసర్ సంచలన ఎంట్రీ.. సరికొత్త సోస్పిరో A15 లాంచ్

ఏసర్ సోస్పిరో A15 స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో అత్యంత ముఖ్యమైన, వినూత్నమైన ఫీచర్ దాని వెనుక భాగంలో ఉన్న డిస్‌ప్లే.

Acer : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఏసర్ సంచలన ఎంట్రీ.. సరికొత్త సోస్పిరో A15 లాంచ్

Photo Credit: Acer

Acer Sospiro A15

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఏసర్ (Acer) సంచలన ఎంట్రీ
  • డ్యూయల్ డిస్‌ప్లేతో అదరగొడుతున్న ఏసర్ కొత్త ఫోన్
  • మెయిన్ కెమెరాతోనే క్లిక్ మనే హై-క్వాలిటీ సెల్ఫీలు
ప్రకటన

Acer : సాధారణంగా లాప్‌టాప్‌లు, కంప్యూటర్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. సరికొత్త టెక్నాలజీతో కూడిన తమ లేటెస్ట్ మొబైల్ ఏసర్ సోస్పిరో A15ను మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లో లాంచ్ చేసింది. ఏసర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఇప్పటికే లిస్ట్ అయింది. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇది చాలా రీజనబుల్ ప్రైస్‌కే అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ సరికొత్త డివైజ్‌ను కస్టమర్లను ఆకట్టుకునేలా ఆరెంజ్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు.

ఈ ఏసర్ సోస్పిరో A15 స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో అత్యంత ముఖ్యమైన, వినూత్నమైన ఫీచర్ దాని వెనుక భాగంలో ఉన్న డిస్‌ప్లే. ఈ ఫోన్ ముందు వైపు 120Hz రీఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌తో కూడిన 6.67 ఇంచుల HD+ IPS ప్రధాన స్క్రీన్‌ను అందించారు. దీనితో పాటు, కారు వెనుక కెమెరా ప్యానెల్ పక్కన 1.88 ఇంచుల చిన్న సైజ్ TFT రేర్ డిస్‌ప్లేను కూడా అమర్చడం విశేషం. ఈ సెకండరీ స్క్రీన్ సాయంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండానే నోటిఫికేషన్లు చూసుకోవచ్చు, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, వెనుక వైపు ఉండే 64 ఎంపీ మెయిన్ కెమెరాతో హై-క్వాలిటీ సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఈ స్క్రీన్ ఒక వ్యూఫైండర్ లాగా ఉపయోగపడుతుంది.

Messenger : మెసెంజర్‌లో మీ పర్సనల్ చాటింగ్ ఎవరికీ తెలియకూడదా? ఈ అదిరిపోయే ట్రిక్ ట్రై చేయండి

ఈ స్మార్ట్‌ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో యునిసోక్ T615 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. రోజువారీ పనులను వేగంగా చేసుకోవడానికి, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో 6GB ర్యామ్, డేటాను దాచుకోవడానికి 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఈ ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది, దీని సాయంతో ర్యామ్ సామర్థ్యాన్ని ఏకంగా 14GB వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే సదుపాయం ఉంది. అయితే, ఈ రోజుల్లో అత్యంత కీలకమైన 5G కనెక్టివిటీ లేకపోవడం, కేవలం 4G నెట్‌వర్క్‌కే పరిమితం కావడం కొంతమంది యూజర్లను నిరాశకు గురిచేసే అంశం. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం ఏసర్ సోస్పిరో A15 లో 64 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ AI ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనికి తోడుగా ఒక సెకండరీ సెన్సార్, చీకటిలో కూడా మంచి ఫోటోలు తీయడానికి వీలుగా ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో రోజంతా నిరంతరాయంగా పనిచేసేలా 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు.

భద్రత, ఇతర కనెక్టివిటీ ఫీచర్ల పరంగా కూడా ఈ ఫోన్ చాలా బాగుంది. ఈ డివైజ్ ధూళి, నీటి చినుకుల నుంచి పాడవకుండా ఉండేందుకు ఇందులో IP64 రేటింగ్‌ను అందించారు. ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ పరంగా వై-ఫై, బ్లూటూత్ 5.0, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం NFC, జీపీఎస్, VoLTE, ViLTE, ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, హెడ్‌ఫోన్స్ వాడుకునే వారి కోసం 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని రకాల ప్రాథమిక సదుపాయాలను ఇందులో పొందుపరిచారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  2. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  3. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
  4. Vivo V70 FE 5G : రూ.19 వేల భారీ డిస్కౌంట్.. 200MP కెమెరాతో Vivo V70 FE 5G ఇప్పుడు సూపర్ డీల్
  5. Samsung : శామ్‌సంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. 13 సార్లు తప్పు పాస్‌వర్డ్ కొడితే ఫోన్‌కు గుడ్‌బై
  6. Specialized E Bike : బరువు తక్కువ.. పెర్ఫార్మెన్స్ ఎక్కువ.. కాకపోతే ఈ బైక్ ధర ఏకంగా రూ.12.55 లక్షలు
  7. Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్
  8. iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  9. Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం
  10. Redmi 17 4G : మార్కెట్‌లోకి రెడ్‌మీ 17 4జి.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »