సీఎంఆర్ సంస్థ దేశంలోని 13 ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, లక్నో, మైసూర్, నాసిక్ వంటి ప్రాంతాలలో 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల దాదాపు 2,086 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్ల అభిప్రాయాలను సేకరించింది
Photo Credit: Samsung
Samsung had a score of 0.79 in CMR’s Durability Index
Smartphone Trends : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల ఆలోచనా విధానంలో ఊహించని మార్పు వచ్చింది. ఇన్నాళ్లూ కొత్త ఫోన్ కొనేటప్పుడు కేవలం కెమెరా మెగాపిక్సల్స్, డిస్‌ప్లే రేటింగ్స్, లేదా భారీ ఆఫర్లు, తక్కువ ధరల వంటి ఆకర్షణీయమైన ఫీచర్ల వెనకాల పరిగెత్తిన జనాలు.. ఇప్పుడు రూట్ మార్చారు. తాజాగా సైబర్ మీడియా రీసెర్చ్(CMR) నిర్వహించిన ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో భారతీయుల మొబైల్ కొనుగోలు సీక్రెట్స్ బయటపడ్డాయి. ప్రస్తుతం ఇండియన్ కస్టమర్లు ఫోన్ కొనేటప్పుడు ప్రధానంగా మూడు విషయాలకే ఓటు వేస్తున్నారు. అవేంటంటే.. మన్నిక, నమ్మకం, అందుబాటు ధర. కేవలం కొన్ని రోజులు మెరిసిపోయే హార్డ్‌వేర్ కంటే.. లాంగ్ రన్‌లో ఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేదే ఇప్పుడు ముఖ్యం అని తేల్చిచెప్పారు.
ఈ సర్వే కోసం సీఎంఆర్ సంస్థ దేశంలోని 13 ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, లక్నో, మైసూర్, నాసిక్ వంటి ప్రాంతాలలో 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల దాదాపు 2,086 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్ల అభిప్రాయాలను సేకరించింది. ఇందులో తేలిందేంటంటే.. ఏకంగా 87 శాతం మంది కస్టమర్లు తాము బ్రాండ్ మారడానికి ఫోన్ మన్నిక లేకపోవడమే కారణమని చెప్పారు. ముఖ్యంగా ఫోన్ కొన్న కొన్ని నెలలకే బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవడం అనేది బ్రాండ్ మార్చడానికి అతిపెద్ద ట్రిగ్గర్‌గా మారుతోందని 70 శాతం మంది యూజర్లు స్పష్టం చేశారు. అలాగే ఫోన్ బిల్డ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల 60శాతం మంది వేరే కంపెనీల వైపు చూస్తున్నారు.
మనం రోజూ వాడే లైఫ్‌స్పాన్‌లో స్మార్ట్‌ఫోన్లు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఈ రీసెర్చ్ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 28 శాతం మంది తమ ఫోన్ స్క్రీన్ పగిలిపోయిందని, మరో 28 శాతం మంది నీళ్లలో పడటం వల్ల ఫోన్ పాడైందని వాపోయారు. ఇక గేమ్స్ ఆడేటప్పుడు లేదా నార్మల్‌గా వాడుతున్నప్పుడు ఫోన్ విపరీతంగా వేడెక్కుతోందని 27 శాతం మంది చెప్పారు. అందుకే ఇప్పటి జనరేషన్ యూజర్లు, ముఖ్యంగా జెడ్ జనరేషన్ (Gen Z) కుర్రాళ్లు.. ఫోన్ అంటే కేవలం గట్టిగా ఉండటమే కాదు, లాంగ్ రన్‌లో సాఫ్ట్‌వేర్ స్మూత్‌గా పనిచేయాలి, సిగ్నల్ కనెక్టివిటీ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఫోన్ కొన్న తర్వాత కంపెనీలు ఇచ్చే కస్టమర్ కేర్ సపోర్ట్ లేదా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ బాగుంటేనే ఆ బ్రాండ్‌ను మళ్లీ కొంటామని 47 శాతం మంది యూజర్లు తేల్చిచెప్పారు. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో సర్వీస్ సెంటర్ల పాత్ర చాలా పెరిగింది. ఇదే సమయంలో సీఎంఆర్ సంస్థ విడుదల చేసిన డ్యూరబిలిటీ ఇండెక్స్ లో.. రూ. 10,000 లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఐటెల్ బ్రాండ్ 0.86 స్కోరుతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత స్థానాల్లో సామ్‌సంగ్ (0.79 స్కోరు) ద్వితీయ స్థానంలో, వివో (0.72 స్కోరు) తృతీయ స్థానంలో నిలిచాయి.
ప్రకటన
ప్రకటన
Xiaomi Smart Band 10 Pro Launched With 1.74-Inch AMOLED Screen, Up to 21 Days Battery Life: Price, Features