గూగుల్ తన లేటెస్ట్ ఏఐ సిరీస్ మోడల్ జెమిని 3.5 ఫ్లాష్ ను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేసింది.
Photo Credit: Google
Here's Everything That Was Announced During the Google IO 2026
Google I/O 2026 : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ గూగుల్ ఐ/ఓ 2026ను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ కీనోట్ ప్రసంగంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ఎన్నో సంచలన ఫీచర్లు, టూల్స్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్రొడక్ట్స్ వాడుతున్న యూజర్లకు ఏఐ ఆధారిత ఫలితాలను అందించడానికి కంపెనీ నెలకు అక్షరాలా 3.2 క్వాడ్రిలియన్ టోకెన్లను ప్రాసెస్ చేస్తోందని, ఇది గత ఏడాది కంటే 7 రెట్లు ఎక్కువని పిచాయ్ వెల్లడించారు. యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్ వ్యాప్తంగా సరికొత్త జెమిని పవర్డ్ టూల్స్‌ను గూగుల్ పరిచయం చేసింది.
4 రెట్లు వేగవంతమైన జెమిని 3.5 ఫ్లాష్
ఈ ఈవెంట్‌లో గూగుల్ తన లేటెస్ట్ ఏఐ సిరీస్ మోడల్ జెమిని 3.5 ఫ్లాష్ ను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేసింది. ఇది ప్రస్తుతం జెమిని యాప్, సెర్చ్‌లోని ఏఐ మోడ్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. డెవలపర్లు దీనిని యాంటిగ్రావిటీ ప్లాట్‌ఫారమ్, జెమిని ఏపీఐ ద్వారా ఆండ్రాయిడ్ స్టూడియోలో ఉపయోగించుకోవచ్చు. ఈ జెమిని 3.5 ఫ్లాష్ మోడల్ ఇతర ఏఐ మోడల్స్ కంటే 4 రెట్లు వేగంగా పనిచేస్తుందని, ఏఐ నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గిస్తుందని గూగుల్ పేర్కొంది. కేవలం 12 గంటల్లోనే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్వయంగా క్రియేట్ చేసి చూపించడం విశేషం. ఇక దీనికంటే అడ్వాన్స్‌డ్ అయిన జెమిని 3.5 ప్రో మోడల్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నారు.
![]()
24 గంటలు పనిచేసే జెమిని స్పార్క్
టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో వంటి మల్టీమోడల్ ఇన్‌పుట్లను ఒకే ప్రాంప్ట్‌లో కలిపి సరికొత్త హై-క్వాలిటీ వీడియోలను క్రియేట్ చేసే జెమిని ఓమ్ని మోడల్‌ను గూగుల్ లాంచ్ చేసింది. యూజర్లు ఒక రిఫరెన్స్ వీడియో లేదా ఇమేజ్ ఇచ్చి, కెమెరా యాంగిల్ వివరిస్తే చాలు.. ఇది సరికొత్త వీడియోను జనరేట్ చేస్తుంది. దీనితో పాటు జెమిని స్పార్క్ అనే పర్సనల్ ఏఐ ఏజెంట్‌ను గూగుల్ తీసుకొచ్చింది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో క్లౌడ్ వర్చువల్ మెషీన్లపై రన్ అవుతూ యూజర్ల తరపున మెయిల్స్ రాయడం, షెడ్యూల్స్ మేనేజ్ చేయడం వంటి పనులను ఫోన్ లాక్ చేసి ఉన్నా కూడా నిరంతరాయంగా పూర్తి చేస్తుంది.
జీమెయిల్, డాక్స్‌లో ఏఐ ఇన్‌బాక్స్
గూగుల్ వర్క్‌స్పేస్‌లోని జీమెయిల్, గూగుల్ డాక్స్, కీప్ వంటి యాప్స్ సరికొత్త ఏఐ ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇకపై యూజర్లు నార్మల్ వాయిస్ కమాండ్స్ లేదా టెక్స్ట్ ద్వారా ఏఐతో మాట్లాడి డాక్యుమెంట్లను సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీనితో పాటు నానో బనానా మోడల్ ఆధారంగా పనిచేసే గూగుల్ పిక్స్ అనే ఇమేజ్ క్రియేషన్ & ఎడిటింగ్ టూల్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఇది ఆబ్జెక్ట్ సెగ్మెంటేషన్, ఇమేజ్‌లలోని టెక్స్ట్ ట్రాన్స్‌లేషన్ వంటి పనులను చిటికెలో చేస్తుంది. అలాగే జీమెయిల్‌లో AI Inbox ఫీచర్ ద్వారా ఒకే క్లిక్‌తో అవసరం లేని మెయిల్స్ డిస్మిస్ చేయడం, పర్సనలైజ్డ్ డ్రాఫ్ట్ రిప్లైలు పంపడం చాలా ఈజీ అవుతుంది.
![]()
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Gallery Adds Google Photos Integration Ahead of OneDrive Sync Ending: How It Works
BenQ Showcases New iScreenBar and ScreenBar Max Desk Lighting Systems at InfoComm 2026