Xiaomi : ఇండియాలోకి రెడ్‌మి టర్బో సునామీ.. ఏకంగా 7560mAh బ్యాటరీతో వస్తున్న నయా స్మార్ట్‌ఫోన్

రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ జూన్ మొదటి వారంలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.

Xiaomi : ఇండియాలోకి రెడ్‌మి టర్బో  సునామీ.. ఏకంగా 7560mAh బ్యాటరీతో వస్తున్న నయా స్మార్ట్‌ఫోన్

Photo Credit: Xiaomi

Redmi Turbo 5 (pictured) launched in China in January this year

ముఖ్యాంశాలు
  • షావోమి తన సరికొత్త పవర్‌ఫుల్ సిరీస్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం
  • రెడ్‌మి టర్బో 5 త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ అధికారిక ధృవీకరణ
  • ప్రారంభ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర 2,299 యువాన్లుగా ఉంది.
ప్రకటన

Xiaomi : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి చైనా దిగ్గజం షావోమి తన సరికొత్త పవర్‌ఫుల్ సిరీస్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. రెడ్‌మి టర్బో  సిరీస్ నుంచి భారతదేశంలో విడుదలవుతున్న మొట్టమొదటి ఫోన్‌గా రెడ్‌మి టర్బో 5 త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. హెవీ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‎లో ఇప్పటికే ఒక ప్రత్యేక మైక్రోసైట్  కూడా ప్రత్యక్షమైంది.

జూన్ లోనే గ్రాండ్ ఎంట్రీ 
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన సమాచారం ప్రకారం.. రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ జూన్ మొదటి వారంలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఫోన్‌తో పాటు షావోమి మరికొన్ని సరికొత్త ప్రొడక్ట్స్‌ను కూడా ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ ఏడాది జనవరిలో చైనాలో విడుదలైన మోడల్‌కు ఉన్న అన్ని స్పెసిఫికేషన్లను మార్చకుండా.. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇండియన్ వేరియంట్‌లోనూ అందిస్తున్నట్లు లీకులు స్పష్టం చేస్తున్నాయి.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత  హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్!
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ పరంగా యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. ఇందులో 1.5K రెజల్యూషన్‌తో కూడిన 6.59-ఇంచుల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో వస్తోంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇందులో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే సరికొత్త హైపర్‌ఓఎస్ 3తో నడవబోతోంది.

మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్.. 
ఈ ఫోన్ స్పీడ్, పవర్‌ను తట్టుకోవడానికి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆల్ట్రా చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడు 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ లో హైలైట్ ఏంటంటే.. స్మార్ట్‌ఫోన్ల హిస్టరీలోనే అతిపెద్దదైన 7,560mAh బ్యాటరీని ఇందులో ఇచ్చారు. దీనిని చిటికెలో ఛార్జ్ చేయడానికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే, ఈ ఫోన్ ద్వారా ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేలా 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం.

సోనీ సెన్సార్‌తో 50MP కెమెరా 
ఫొటోగ్రఫీ కోసం రెడ్‌మి టర్బో 5 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతో పాటు, 8-మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ లెన్స్ ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్, బ్లాక్ కలర్ ఆప్షన్ తో చూడటానికి చాలా ప్రీమియంగా ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి. అంటే వేడి నీటి తుంపర్లు పడినా, ఫోన్ పూర్తిగా నీటిలో మునిగినా దీనికి ఏమీ కాదు.

ఇండియాలో ధర ఎంత ఉండబోతోంది?
చైనా మార్కెట్లో రెడ్‌మి టర్బో 5 ప్రారంభ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర 2,299 యువాన్లుగా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30,000 వరకు ఉంటుంది. భారతదేశంలో కూడా ఈ ఫోన్ దాదాపు రూ.30,000 నుంచి రూ.32,000 బడ్జెట్ ధరలోనే లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెజాన్ లో దీని సేల్స్ ప్రారంభం కానున్నాయి.

#తాజా కథనాలు
  1. Apple : యాపిల్ హిస్టరీలోనే మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. ఐఓఎస్ 27తో ఐఫోన్ల రూపమే మారిపోనుంది
  2. Amazon : ఇక రేడియో, పాటలు పక్కన పెట్టేయండి.. అమెజాన్ అలెక్సా ప్లస్‎లో మైండ్ బ్లోయింగ్ ఏఐ ఫీచర్
  3. Xiaomi : లాంచ్‌కు ముందే లీకైన షావోమి 17T ప్రొ ధర, ఫీచర్లు.. ఏకంగా 7000mAh బ్యాటరీతో మైండ్ బ్లాక్
  4. Xiaomi : ఇండియాలోకి రెడ్‌మి టర్బో సునామీ.. ఏకంగా 7560mAh బ్యాటరీతో వస్తున్న నయా స్మార్ట్‌ఫోన్
  5. Google I/O 2026 : ఇక అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయం.. జెమిని 3.5 ఫ్లాష్ వచ్చేసింది
  6. Samsung : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!
  7. WhatsApp : వాట్సాప్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రైవసీ ఫీచర్.. మెసేజ్ చదవగానే మాయం
  8. Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే 20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2
  9. ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు
  10. Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »