అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు ఈ అడ్వాన్స్‌డ్ అలెక్సా ప్లస్ సేవలు పూర్తిగా ఉచితం.
Photo Credit: Amazon
Alexa sends finished episodes to Echo Show and the Alexa app
Amazon : ప్రపంచ ఈ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ తన ప్రీమియం ఏఐ అసిస్టెంట్ అలెక్సా ప్లస్ యూజర్ల కోసం ఒక సంచలన ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు అలెక్సా పాడ్‌కాస్ట్స్. ఈ సరికొత్త జనరేటివ్ ఏఐ టూల్ సహాయంతో యూజర్లు తమకు నచ్చిన ఏ విషయాన్నైనా సరే, కేవలం కొన్ని నిమిషాల్లోనే ఒక ఆసక్తికరమైన పాడ్‌కాస్ట్ ఆడియో ఎపిసోడ్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన సింథటిక్ వాయిస్ హోస్ట్లు రేడియో ఆర్టిస్టుల తరహాలో ముచ్చటిస్తూ సమాచారాన్ని అందిస్తాయి.
ప్రైమ్ మెంబర్లకు ఉచితం..
అమెజాన్ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ లేటెస్ట్ ఏఐ పాడ్‌కాస్ట్ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని అలెక్సా ప్లస్ కస్టమర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు ఈ అడ్వాన్స్‌డ్ అలెక్సా ప్లస్ సేవలు పూర్తిగా ఉచితం. ఒకవేళ ప్రైమ్ మెంబర్‌షిప్ లేని వారైతే.. ఈ ఏఐ ఫీచర్లను ఆస్వాదించడానికి నెలకు 19.99 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.1,900) చెల్లించి విడిగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్క్రిప్ట్ మార్చుకునే ఛాన్స్ కూడా మనదే
ఈ ఫీచర్ పనిచేసే విధానం చాలా సింపుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యూజర్లు తమ ఎకో స్మార్ట్ స్పీకర్లు లేదా అలెక్సా యాప్ ద్వారా.. "అలెక్సా, నాకు టోక్యో నగర సాంప్రదాయాల గురించి ఒక పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ క్రియేట్ చేయి" అని అడిగితే చాలు. వెంటనే అలెక్సా ఏఐ రంగంలోకి దిగి, ఆ టాపిక్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. ఆడియో జనరేట్ చేయడానికి ముందే.. అది ఏమేం విషయాలు కవర్ చేయబోతోందో ఒక అవుట్‌లైన్ మనకు చెప్తుంది. ఆ సమయంలో పాడ్‌కాస్ట్ నిడివి ఎంత ఉండాలి, ఏ విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేది యూజర్లు వాయిస్ కమాండ్స్ ద్వారా మార్చుకోవచ్చు. మనం ఓకే అనగానే ఏఐ హోస్ట్ వాయిస్‌లతో ఆడియో ఎపిసోడ్ రెడీ అయిపోతుంది.
200 కి పైగా టాప్ పత్రికల సమాచారంతో..
ఏఐ అందించే సమాచారంలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కి పైగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వార్తా సంస్థలు, పత్రికలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ (AP), ది వాషింగ్టన్ పోస్ట్, టైమ్, ఫోర్బ్స్, బిజినెస్ ఇన్‌సైడర్, పొలిటికో, యూఎస్ఏ టుడే వంటి టాప్ మీడియా హౌస్‌లతో పాటు అమెరికాలోని 200కి పైగా స్థానిక ప్రాంతీయ పత్రికల డేటాను అలెక్సా ఏఐ ఉపయోగిస్తుంది. దీనివల్ల కస్టమర్లకు రియల్ టైమ్, అత్యంత నమ్మకమైన కరెంట్ అఫైర్స్ అందుతాయి.
ఆఫీస్ ప్రయాణాల్లో వినడానికి బెస్ట్.. గూగుల్ నోట్‌బుక్ ఎల్ఎమ్కు గట్టి పోటీ
అలెక్సా ప్లస్ క్రియేట్ చేసిన పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ఎకో షో డిస్‌ప్లే డివైజ్‌లపై లేదా మొబైల్ యాప్‌లో నోటిఫికేషన్ వస్తుంది. యూజర్లు దానిని అప్పుడే వినవచ్చు లేదా అలెక్సా యాప్‌లోని మ్యూజిక్ అండ్ మోర్ సెక్షన్ లో సేవ్ చేసుకొని ఆఫీస్ ప్రయాణాల్లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. రోజువారీ వార్తలు, స్పోర్ట్స్ హైలైట్స్, టెక్నాలజీ అప్‌డేట్స్, ట్రావెల్ గైడ్స్, కెరీర్ లెసన్స్ వంటి దేనినైనా దీని ద్వారా ఆడియోగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో డాక్యుమెంట్లను ఆడియోగా మార్చే గూగుల్ నోట్‌బుక్ ఎల్‌ఎమ్, జెమిని ఏఐ టూల్స్ కు పోటీగా అమెజాన్ దీనిని లాంచ్ చేసింది. త్వరలోనే యూజర్లు అప్‌లోడ్ చేసే పర్సనల్ డాక్యుమెంట్ల ఆధారంగా కూడా కస్టమ్ ఆడియోలను క్రియేట్ చేసేలా ఈ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది.
ప్రకటన
ప్రకటన
Oppo Find X9s Launched in India With Hasselblad-Tuned 50-Megapixel Cameras, 7,025mAh Battery: Price, Features