బేస్ మోడల్ అయిన షావోమి 17T 12GB + 256GB వేరియంట్ ధర రూ.76,000 కాగా, 512GB టాప్ వేరియంట్ ధర రూ.82,000 గా లిస్ట్ చేశారు.
Photo Credit: Xiaomi
Xiaomi 17T will come with upgrades over the Xiaomi 15T
Xiaomi : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ షావోమి 17T. వచ్చే వారం మే 28న ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. అయితే, ఈ అధికారిక లాంచ్‌కు ముందే రష్యాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ వైల్డ్‌బెర్రీస్లో ఈ సిరీస్ ఫోన్ల ధరలు, అఫీషియల్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్లు లీకైపోయాయి. షావోమి 17T, షావోమి 17T ప్రొ పేరుతో వస్తున్న ఈ ఫోన్లు పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యాయి.
రష్యా వెబ్‌సైట్‌లో లీకైన ధరలు
వైల్డ్‌బెర్రీస్ లిస్టింగ్ ప్రకారం.. ప్రీమియం మోడల్ అయిన షావోమి 17T ప్రొ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 65,651 రూబుల్స్ (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.78,000)గా ఉంది. అలాగే బేస్ మోడల్ అయిన షావోమి 17T 12GB + 256GB వేరియంట్ ధర రూ.76,000 కాగా, 512GB టాప్ వేరియంట్ ధర రూ.82,000 గా లిస్ట్ చేశారు. అయితే యూరప్ మార్కెట్ లీకుల ప్రకారం దీని ధర రూ.83,000 నుంచి రూ.1,11,000 వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇవి బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో లభించనున్నాయి.
నెక్స్ట్ లెవెల్ షావోమి 17T ప్రొ
ఈ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫోన్ అయిన షావోమి 17T ప్రొ ఫీచర్లు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.
డిస్‌ప్లే: ఇందులో 144Hz రీఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్ కలిగిన పెద్దదైన 6.83-ఇంచుల అమోలెడ్ (AMOLED) స్క్రీన్ ఇచ్చారు.
ప్రాసెసర్: అత్యంత వేగవంతమైన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.
బ్యాటరీ & ఛార్జింగ్: స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే అరుదుగా కనిపించే భారీ 7,000mAh బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
సింపుల్ అండ్ సూపర్ షావోమి 17T
ఇక ఈ సిరీస్‌లో వస్తున్న వనిల్లా మోడల్ షావోమి 17T కూడా ఫీచర్ల పరంగా ఎక్కడా తగ్గడం లేదు.
డిస్‌ప్లే & ప్రాసెసర్: ఇందులో కొంచెం చిన్నదైన 6.59-ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే (120Hz రీఫ్రెష్ రేట్) ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
బ్యాటరీ: ఇందులో 6,500mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. హెవీ యూజర్లకు కూడా ఈ బ్యాటరీ రెండు రోజుల పాటు హాయిగా బ్యాకప్ ఇస్తుంది.
లైకా లెన్స్‌తో 50MP ట్రిపుల్ కెమెరా.. ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్!
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే రెండు ఫోన్ల వెనుక భాగంలోనూ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (లైకా లెన్స్), 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ (5x ఆప్టికల్ జూమ్), 12-మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ అడ్వాన్స్‌డ్ కెమెరాను అమర్చారు. రెండు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 తో నడుస్తాయి. అలాగే, ఇవి నీటిలో పడినా పాడవకుండా ఉండేలా ఐపీ68 (IP68) రేటింగ్‌తో వస్తున్నాయి.
ఇండియా లాంచ్ ఎప్పుడు?
షావోమి సంస్థ గ్లోబల్ మార్కెట్లతో పాటు మన భారతదేశంలోనూ ఈ 17T సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా టీజ్ చేయడం ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం నడుస్తున్న ర్యామ్ (RAM) సంక్షోభం కారణంగా ఇండియాలోకి కేవలం స్టాండర్డ్ షావోమి 17T మోడల్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని, ప్రొ మోడల్‌ను ఇక్కడికి తీసుకురావడం లేదని ఇండస్ట్రీ టాక్. ఇండియాలో దీని ధర దాదాపు రూ.60,000 లోపు ఉండవచ్చని అంచనా. మే 28న గ్లోబల్ లాంచ్ అయ్యాక జూన్ మొదటి వారంలో ఇది ఇండియాలో విడుదల కానుంది.
ప్రకటన
ప్రకటన
Oppo Find X9s Launched in India With Hasselblad-Tuned 50-Megapixel Cameras, 7,025mAh Battery: Price, Features