iQOO Z11 Lite : పవర్‌ఫుల్ ప్రాసెసర్, 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే.. వచ్చే నెలలో భారత్‌లోకి iQOO Z11 గ్రాండ్ ఎంట్రీ

భారత్‌లో విడుదల కాబోయే iQOO Z11 మోడల్ కొన్ని కీలక మార్పులతో రాబోతోంది.

iQOO Z11 Lite : పవర్‌ఫుల్ ప్రాసెసర్, 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే.. వచ్చే నెలలో భారత్‌లోకి iQOO Z11 గ్రాండ్ ఎంట్రీ

Photo Credit: iQOO

iQOO Z11 Lite

ముఖ్యాంశాలు
  • భారత్‌లోకి iQOO Z11 గ్రాండ్ ఎంట్రీ
  • ఐకూ నుంచి మరొక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ iQOO Z11 భారత్‌లో వచ్చే నెల లాంచ్
  • సరికొత్త ప్రాసెసర్, 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే
ప్రకటన

iQOO Z11 : దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ భారత మార్కెట్‌లో వరుస కొత్త ఫోన్లతో రచ్చ చేస్తోంది. ఇటీవలే దేశీయంగా iQOO Z11 Lite మోడల్‌ను పరిచయం చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ సిరీస్‌లోనే మెయిన్ వెర్షన్ అయిన iQOO Z11ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పరిశ్రమ వర్గాల నుంచి లభించిన ప్రత్యేక సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలోనే  భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఇండియా వేరియంట్‌లో స్పెషల్ ప్రాసెసర్, 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే
భారత్‌లో విడుదల కాబోయే iQOO Z11 మోడల్ కొన్ని కీలక మార్పులతో రాబోతోంది. దేశంలో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ఐకూ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. చైనాలో విడుదలైన మోడల్‌లో డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ వాడగా, ఇండియన్ వేరియంట్ కోసం ప్రత్యేకంగా డైమెన్సిటీ 7500 టర్బోను ఖరారు చేశారు. అంతేకాకుండా, వినియోగదారులకు ప్రీమియం లుక్ అండ్ ఫీల్ అందించేందుకు ఇందులో 3D కర్వ్‌డ్ డిస్‌ప్లేను పొందుపరుస్తున్నారు.

చైనా వేరియంట్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన iQOO Z11 మోడల్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇది 6.83 అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1,260 x 2,800 పిక్సెల్స్ రెసొల్యూషన్, 165Hz దాకా రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 16 GB వరకు ర్యామ్, 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఇచ్చారు. కెమెరా పరంగా.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్  సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఏకంగా 9,020 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకత.

Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17

ఇటీవలే విడుదలైన iQOO Z11 Lite విశేషాలు
గత వారంలోనే భారత్‌లో లాంచ్ అయిన iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే.. ఇది 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, Mali-G57 MC2 GPU వాడారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పై పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇక 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500 mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Viral Hack : వ్యాలెట్‌కి అల్యూమినియం పేపర్ చుడితే రూపాయి కూడా పోదు.. వైరల్ అవుతున్న విచిత్రమైన ట్రిక్
  2. iQOO Z11 Lite : పవర్‌ఫుల్ ప్రాసెసర్, 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే.. వచ్చే నెలలో భారత్‌లోకి iQOO Z11 గ్రాండ్ ఎంట్రీ
  3. Redmi 17 4G : రెండు రోజులు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా పర్లేదు... షావోమి నుంచి 7,500mAh బ్యాటరీ ఫోన్
  4. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  5. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  6. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  7. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  8. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  9. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  10. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »