Redmi 17 4G : రెండు రోజులు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా పర్లేదు... షావోమి నుంచి 7,500mAh బ్యాటరీ ఫోన్

రెడ్‌మీ 17 4G ఫోన్ మీడియాటెక్ హెలియో G91 ఆల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Redmi 17 4G : రెండు రోజులు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా పర్లేదు... షావోమి నుంచి 7,500mAh బ్యాటరీ ఫోన్

Photo Credit: Redmi

Redmi 15

ముఖ్యాంశాలు
  • రెడ్‌మీ 17 4G స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7,500mAh భారీ బ్యాటరీ
  • 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటె
  • లాంచ్‌కి ముందే లీకైన రెడ్‌మీ 17 4G ఫీచర్లు
ప్రకటన

Redmi 17 4G :  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తమ బడ్జెట్ సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. రెడ్‌మీ 17 4G పేరుతో రానున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక లాంచ్‌కి ముందే బయటికొచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ సుధాన్షు అంబోరే (@Sudhanshu1414) ఈ ఫోన్ స్పెసిఫికేషన్ షీట్‌ను X వేదికగా షేర్ చేశారు. దీని ప్రకారం ఈ ఫోన్ భారీ బ్యాటరీ,పెద్ద డిస్‌ప్లేతో వినియోగదారులను ఆకట్టుకోనుంది.

బిగ్ డిస్‌ప్లే.. బెస్ట్ స్క్రీన్ ప్రొటెక్షన్
ఈ స్మార్ట్‌ఫోన్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా చాలా బాగుండనుంది. ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 720x1600 పిక్సెల్స్ రెసొల్యూషన్‌తో పాటు, స్మూత్ పర్‌ఫార్మెన్స్ కోసం 120Hz ఎడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ 825 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అంతేకాకుండా కళ్ళకు రక్షణగా TÜV Rheinland సర్టిఫికేషన్, డిస్ప్లే దెబ్బతినకుండా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా పొందుపరిచారు. ఈ ఫోన్ ఆక్ గ్రీన్, డీప్ బ్లూ, బ్లాక్, లోటస్ పర్పుల్ రంగుల్లో రానుంది. ఫోన్ బ్యాక్ సైడ్ డైనమిక్ RGB లైట్ ఉండటం విశేషం. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఇచ్చారు.

పవర్‌ఫుల్ ప్రాసెసర్.. రకరకాల వేరియంట్లు
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే, రెడ్‌మీ 17 4G ఫోన్ మీడియాటెక్ హెలియో G91 ఆల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభించనుంది: 4GB+128GB, 4GB+256GB, 6GB+128GB, 6GB+256GB. ఇందులో LPDDR4X ర్యామ్, eMMC 5.1 స్టోరేజ్ టెక్నాలజీ వాడారు. అదనంగా 12GB వరకు వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ ఉంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే ఇది లేటెస్ట్ HyperOS 3 పై పనిచేస్తుంది.

Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17

7,500mAh బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ ఫోన్‌లో అత్యంత ప్రధానమైన విశేషం దీని బ్యాటరీనే. ఏకంగా 7,500mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 45W టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల పాటు నిరంతరంగా వాడుకోవచ్చు. ఫోన్ కొలతల విషయానికి వస్తే 170.12 x 78.42 x 8.8 మిమీ సైజుతో, 232 గ్రాముల బరువు ఉంటుంది.

50MP కెమెరా.. కనెక్టివిటీ ఫీచర్లు
కెమెరా సెటప్ పరంగా చూస్తే వెనుక వైపు f/1.8 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరొక సెకండరీ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, NFC వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో కలవు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Viral Hack : వ్యాలెట్‌కి అల్యూమినియం పేపర్ చుడితే రూపాయి కూడా పోదు.. వైరల్ అవుతున్న విచిత్రమైన ట్రిక్
  2. iQOO Z11 Lite : పవర్‌ఫుల్ ప్రాసెసర్, 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే.. వచ్చే నెలలో భారత్‌లోకి iQOO Z11 గ్రాండ్ ఎంట్రీ
  3. Redmi 17 4G : రెండు రోజులు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా పర్లేదు... షావోమి నుంచి 7,500mAh బ్యాటరీ ఫోన్
  4. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  5. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  6. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  7. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  8. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  9. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  10. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »