ఐకూ కంపెనీ జూలై 24న భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
Photo Credit: iQOO
iQOO Z11 Lite
iQOO : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ ఐకూ భారతీయ మార్కెట్లో తన సరికొత్త 5జీ మొబైల్ iQOO Z11 Lite లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 24వ తేదీన దేశీయ మార్కెట్లో గ్రాండ్‌గా అడుగుపెట్టబోతోంది. అయితే ఈ ఫోన్‌ను కంపెనీ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. నిత్యం ఆన్‌లైన్ లెక్చర్లు వినేవారికి, అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్ నోట్స్ కోసం ఎక్కువగా ఏఐ టూల్స్ ఉపయోగించేవారికి, అలాగే బయట తిరిగేటప్పుడు మంచి బ్రైట్‌నెస్, బలమైన బాడీ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. క్లాస్సి లుక్, అధునాతన ఏఐ ఉత్పాదకతతో కూడిన ఈ ఫోన్ లాంచ్ కోసం టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఐకూ కంపెనీ జూలై 24న భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. వీటిలో ఒకటి సోలార్ ఫ్లేమ్ కాగా, మరొకటి మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్. ఈ ఫోన్ అధికారికంగా విడుదలైన తర్వాత కంపెనీ సొంత అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్లో స్టూడెంట్స్ చదువుకు, కమ్యూనికేషన్‌కు ఎంతగానో ఉపయోగపడే పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్ల సెట్‌ను ఐకూ జతచేసింది. ఇందులో ఉండే AI Creation ఫీచర్ సహాయంతో విద్యార్థులు పెద్ద పెద్ద డాక్యుమెంట్లు లేదా పాఠాలను చాలా సులభంగా సమ్మరీ చేసుకోవచ్చు. అలాగే అసైన్‌మెంట్లను సరిచేసుకోవడానికి, కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ చేయడానికి, రైటింగ్స్ బ్లాక్స్ సమస్యలను అధిగమించడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. దీనితో పాటు AI Captions అనే మరొక ఫీచర్ కూడా ఉంది, ఇది రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్, వన్-టాప్ సమ్మరీ సదుపాయాన్ని అందిస్తుంది. దీనివల్ల క్లాసుల్లో జరిగే లెక్చర్లు, వర్క్‌షాప్‌ల నోట్స్‌ను ఈజీగా సేవ్ చేసుకుని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ కెపాసిటీ అని చెప్పాలి. రోజంతా క్లాసులు విన్నా, ఆన్‌లైన్ ప్రాజెక్టులు చేసినా చార్జింగ్ అయిపోకూడదనే ఉద్దేశ్యంతో ఇందులో ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని అమర్చారు. అంతేకాదు, ఇది 44W ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవుతుంది. దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ బ్యాటరీ హెల్త్ లైఫ్‌తో ఈ ఫోన్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాబట్టి స్టూడెంట్స్ చదువుకునే సమయంలో ఎలాంటి బ్రేక్స్ లేకుండా నాన్-స్టాప్‌గా దీని పర్ఫార్మెన్స్‌ను ఆస్వాదించవచ్చు.
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మారిన రూల్స్.. ఇకపై పాత పద్ధతి పనిచేయదు
కాలేజ్ క్యాంపస్ లైఫ్‌లో ప్రయాణాలు చేసేటప్పుడు లేదా హడావిడిలో ఫోన్ కింద పడిపోవడం, వర్షంలో తడవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకునేలా iQOO Z11 Lite ఫోన్‌ను చాలా గట్టిగా తయారుచేశారు. దీనికి మిలిట్రీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు ఎస్‌జీఎస్ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా లభించింది. అంటే పొరపాటున చేయి జారి కింద పడినా ఫోన్ స్క్రీన్ గానీ, బాడీ గానీ అంత త్వరగా డ్యామేజ్ అవ్వదు. రోజువారీ రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఇది పక్కాగా సరిపోతుంది.
ఐకూ జెడ్11 లైట్ ఫోన్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా లుక్ వైజ్ కూడా చాలా మోడ్రన్‌గా, స్లీక్‌గా కనిపిస్తుంది. ఇందులో కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్‌తో పాటు, ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మెరిసేలా ఒక ప్రత్యేకమైన డైనమిక్ లైట్ ఫీచర్‌ను అందించారు. ఇది ఫోన్‌కు చాలా స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ ఫోన్ నాన్-స్టాప్.. నో లిమిట్ అనే కాన్సెప్ట్‌తో సరికొత్త OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే దీనికి 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన