దేశీయ మార్కెట్‌లో మోటో జి మ్యాక్స్ ఫోన్ ధర సుమారు రూ. 30,000 వరకు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Photo Credit: Motorola
Moto G Max
Moto G Max : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తమ నూతన మోడల్ మోటో జి మ్యాక్స్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న అధికారికంగా ఆవిష్కృతం కానుంది. దేశీయ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర సుమారు రూ. 30,000 వరకు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇండియన్ వర్షన్‌లో స్పెషల్ చిప్‌సెట్, కెమెరా
గత జూన్ నెలలోనే సెలక్ట్ చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన మోటో జి మ్యాక్స్ మోడల్‌కు, ఇండియాలో లాంచ్ కాబోయే మోడల్‌కు మధ్య కొన్ని కీలకమైన మార్పులు ఉండనున్నాయి. గ్లోబల్ వర్షన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ఇవ్వగా, భారత మార్కెట్లో రాబోయే మోడల్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌ను అందించబోతున్నారు. అలాగే అంతర్జాతీయ మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, భారత్‌లో లాంచ్ అయ్యే వేరియంట్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రైమరీ కెమెరాను పొందుపరచనున్నట్లు సమాచారం.
గ్లోబల్ వర్షన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోటో జి మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 6.8 ఇంచుల 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 బెస్డ్ Hello UI ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. గ్లోబల్ వర్షన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5,200 mAh బ్యాటరీ ఉంది, ఇది 32W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌కు 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి.
రామ్, స్టోరేజ్, కలర్ ఆప్షన్లు
గ్లోబల్ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 8GB రామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఒకే ఒక్క వేరియంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది అజుల్ క్లారో, గ్రాఫైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్‌లో కూడా ఇదే స్టోరేజ్ వేరియంట్ రానుందని భావిస్తున్నారు.
Honor Robot Phone : ప్రపంచంలోనే తొలి గింబల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. వచ్చే వారమే హానర్ రోబోట్ ఫోన్ లాంచ్
మోటో జి37, జి37 పవర్ విజయపరంపర
ఇటీవలే మోటోరోలా భారత్‌లో మోటో జి37, మోటో జి37 పవర్ మోడళ్లను సరసమైన ధరల విభాగంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. మోటో జి37లో 5,200 mAh బ్యాటరీ ఉండగా, జి37 పవర్ మోడల్‌లో ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీని అందించారు. ఈ బడ్జెట్ ఫోన్ల సక్సెస్ తర్వాత ఇప్పుడు మిడ్-రేంజ్ విభాగంలో మోటో జి మ్యాక్స్‌తో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మోటోరోలా సిద్ధమైంది.
ప్రకటన
ప్రకటన
Mafia: The Old Country's Man of Honor Expansion Gets First Look at Gameplay Ahead of Launch