వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా విఐ సంస్థ రూ. 230, రూ. 250, రూ. 435 విలువగల ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
Photo Credit: Vi
Vi
Vi New Plans : భారతీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మూడు ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందించడమే ఈ ప్లాన్ల ప్రధాన ప్రత్యేకత. దీనితో పాటు వినియోగదారులకు అపరిమిత 4G/5G డేటా, ఉచిత కాలింగ్, జియోహాట్‌స్టార్‌తో పాటు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ కూడా లభించనుంది.
విఐ ప్రవేశపెట్టిన రూ. 435, రూ. 250, రూ. 230 ప్లాన్ల వివరాలు
వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా విఐ సంస్థ రూ. 230, రూ. 250, రూ. 435 విలువగల ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
రూ. 435 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్ లిమిటెడ్ 4G/5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎమ్‌ఎస్‌లతో పాటు జియోహాట్‌స్టార్ (మొబైల్) ఉచిత యాక్సెస్, స్పాటిఫై ప్రీమియం లభిస్తాయి. ఎక్కువ డేటా వాడే వారికి ఇది సరైన ప్లాన్.
రూ. 250 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎమ్‌ఎస్‌లు, స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
రూ. 230 యాడ్-ఆన్ ప్యాక్: 28 రోజుల వ్యాలిడిటీతో 30GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. దీనితో పాటు స్పాటిఫై ప్రీమియమ్‌తో పాటు 20కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది.
20కి పైగా ఓటీటీలు, ప్రకటనలు లేని మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్
డేటా, మ్యూజిక్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన రూ. 435 ప్లాన్, రూ. 230 యాడ్-ఆన్ ప్యాక్‌లలో లభించే స్పాటిఫై ప్రీమియం ద్వారా ఎలాంటి ప్రకటనల గోల లేకుండా, ఆఫ్‌లైన్‌లో పాటలను డౌన్‌లోడ్ చేసుకుని అత్యంత స్పష్టమైన హై-క్వాలిటీ ఆడియోను ఆస్వాదించవచ్చు. దీనికి తోడు రూ. 230 ప్యాక్‌లో జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఫ్యాన్‌కోడ్, లయన్స్ గేట్ ప్లే సహా 20కి పైగా ఓటీటీ ఛానెళ్ల కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చు.
Airtel : రూ. 200 లకే 30GB డేటా, 19 ఓటీటీలు ఉచితం.. ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్
ఫ్రీ స్పాటిఫై ప్రీమియాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ఈ ప్లాన్ల ద్వారా ఉచిత స్పాటిఫై ప్రీమియం ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు మొదట పైన పేర్కొన్న ప్లాన్లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 'Vi App' ఓపెన్ చేసి, అందులోని Claim Benefits విభాగానికి వెళ్లాలి. అక్కడ స్పాటిఫై ప్రీమియంను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. కస్టమర్లు తమ వద్ద ఇప్పటికే ఉన్న స్పాటిఫై ఖాతాతో లాగిన్ అవ్వవచ్చు లేదా కొత్త ఖాతాను ప్రారంభించి కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
రీఛార్జ్ వ్యాలిడిటీ ఉన్నంత వరకే ఆఫర్ పరిమితి
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉచిత స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మీరు ఎంచుకున్న రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత కాలం మాత్రమే పని చేస్తుంది. ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత, వినియోగదారులు మళ్లీ అర్హత కలిగిన వి ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఉచిత స్పాటిఫై ప్రీమియం సేవలను నిరంతరాయంగా పొందే వెసులుబాటు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains