5,000 నిట్స్ బ్రైట్‌నెస్.. 5,200mAh బ్యాటరీ.. మోటో జీ స్టైలస్ 2026 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్!

మోటరోలా సంస్థ అమెరికా, కెనడా మార్కెట్లలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ స్టైలస్ (2026)'ను మంగళవారం ఘనంగా విడుదల చేసింది.

5,000 నిట్స్ బ్రైట్‌నెస్.. 5,200mAh బ్యాటరీ.. మోటో జీ స్టైలస్ 2026 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్!

Photo Credit: Motorola

మోటో జీ స్టైలస్ (2026) పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్

ముఖ్యాంశాలు
  • Moto G Stylus (2026) విడుదల
  • సుమారు రూ. 41,500 ధరలో కొత్త మోటో జీ స్టైలస్
  • మరో అదిరిపోయే ఫోన్‌తో మోటోరోలా రచ్చ
ప్రకటన

మోటరోలా సంస్థ అమెరికా, కెనడా మార్కెట్లలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ స్టైలస్ (2026)'ను మంగళవారం ఘనంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన మోటో జీ స్టైలస్ (2025) మోడల్‌కు వారసుడిగా ఇది టెక్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ పేరులోనే ఉన్నట్టుగా బాడీలోనే అమర్చిన యాక్టివ్ స్టైలస్ దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మనం నోట్‌బుక్‌పై పెన్నుతో రాసిన అనుభూతిని ఇచ్చేలా ఈ స్టైలస్ పెన్ రూపొందింది. సపోర్ట్ చేసే యాప్‌లలో ఒత్తిడిని, వాలును గుర్తించి సన్నని గీతలు లేదా షేడింగ్‌ను అత్యంత స్పష్టంగా గీయడానికి ఇది సహకరిస్తుంది. ఆర్టిస్టులు, క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండేవారికి ఇది ఒక వరంలా మారుతుంది.

ఈ కొత్త మోడల్ ఫీచర్లు, ధర విషయానికి వస్తే అమెరికాలో 8GB ర్యామ్ అలాగే 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర సుమారు 499 డాలర్లుగా నిర్ణయించారు. దీనిని పాంటోన్ కోల్ స్మోక్, పాంటోన్ లావెండర్ మిస్ట్ అనే రెండు అద్భుతమైన రంగుల్లో తీసుకొచ్చారు. ఫోన్ వెనుక భాగం లెదర్ ఫినిషింగ్‌తో లభిస్తుండటంతో పట్టుకోవడానికి చాలా ప్రీమియం లుక్ కనిపిస్తుంది. అమెజాన్, బెస్ట్ బై లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో ఏప్రిల్ 16 నుండి ఇది అందుబాటులోకి రానుంది. ఏటీ అండ్ టీ, గూగుల్ ఫై లాంటి నెట్‌వర్క్ ప్రొవైడర్ల ద్వారా కూడా వినియోగదారులు దీనిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కెనడా వాసులు కూడా ఇదే తేదీ నుండి కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

సాంకేతిక వివరాలను గమనిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఎక్స్ స్కిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.7 అంగుళాల 1.5K పి-ఓలెడ్ స్క్రీన్ అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండి ఏకంగా 5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అంటే ఎండలో కూడా స్క్రీన్ కళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు కింద పడినా దెబ్బతినకుండా గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కవచంలా నిలుస్తుంది. ధూళి, నీటి నుండి రక్షణ కోసం ఐపీ68 తో పాటు ఐపీ69 రేటింగ్‌ను కూడా ఇచ్చారు. నీటి అడుగున కూడా ఈ ఫోన్ చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యతను మెరుగుపరిచారు.

పెర్ఫార్మెన్స్ పరంగా స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను వాడారు. ఇది వేగవంతమైన మల్టీటాస్కింగ్‌కు తోడ్పడుతుంది. 8GB ఎల్‌పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్ ఉన్నప్పటికీ ర్యామ్ బూస్ట్ ఫీచర్ సాయంతో దీనిని వర్చువల్ గా 24GB వరకు పెంచుకోవచ్చు. భారీ ఫైళ్లను దాచుకోవడానికి 128GB అంతర్గత స్టోరేజ్ సరిపోకపోతే మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 1TB వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ లో ఎక్కువ సేపు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా సాఫీగా సాగిపోతుంది. స్టోరేజ్ విషయంలో రాజీ పడకుండా భారీ డేటాను దాచుకోవచ్చు.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సోనీ ఎల్‌వైటీ-700సీ సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అద్భుతమైన చిత్రాలను క్లిక్ చేస్తుంది. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉండటంతో వీడియోలు తీస్తున్నప్పుడు షేక్స్ లేకుండా చాలా స్టెబిలిటీ ఉంటుంది. మరో 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను ఇచ్చారు. ఇది పెద్ద గ్రూప్ ఫోటోలు తీయడానికి, చిన్న వస్తువులను దగ్గరగా ఫోకస్ చేసే మాక్రో విజన్ కు ఉపయోగపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. క్లారిటీ తో కూడిన సెల్ఫీలను ఇది అందిస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ వంటి అధునాతన ఆప్షన్లు అన్నీ ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5,200mAh భారీ సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 68W వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా మోటో జోడించింది. ఫోన్ బరువు 192.3 గ్రాములు ఉండటంతో చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ సాయంతో డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.

#తాజా కథనాలు
  1. Moto G37 Power: ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వాడుకోవచ్చు.. మోటో G37 పవర్ వస్తోంది
  2. Google Shocking Decision: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. జీమెయిల్ ఫ్రీ స్టోరేజీపై కత్తెర.. కొత్త రూల్స్ ఇవే
  3. Thimmarajupalli TV : ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ.. నవ్వులు పూయిస్తూనే కన్నీళ్లు పెట్టించే ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
  4. Oppo FindX9s : ఒప్పో కొత్త ఫోన్ లో 7025mAh బ్యాటరీ.. ఇక ఛార్జర్ ను మర్చిపోవాల్సిందే
  5. Amazon Great Summer Sale 2026 : పాత ల్యాప్‌టాప్ కి గుడ్ బై.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కళ్ళు చెదిరే ఆఫర్లు
  6. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ మ్యూజిక్ మ్యాజిక్... 11 వేల బోట్ స్పీకర్ కేవలం రూ. 2,999కే
  7. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ బంపర్ ధమాకా.. సగం రేటుకే ఎయిర్ ప్యూరిఫైయర్లు
  8. Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం
  9. Google Gemini Spark : గూగుల్ జెమిని స్పార్క్ వచ్చేస్తోంది.. ఇక మీ ఫోన్ మీకు చెప్పకుండానే పనులు చేసేస్తుంది
  10. Amazon Great Summer Sale 2026: ఇంటిని థియేటర్‌లా మార్చేయండి.. అమెజాన్లో 65 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »