ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిజైన్ సాఫ్ట్‌వేర్ సంస్థలు Adobe, Canva జెమిని కోసం ప్రత్యేక కనెక్టర్లను ప్రకటిస్తూ గూగుల్‌తో చేతులు కలిపాయి.
Photo Credit: Google
The two platforms join Gemini’s growing list of third-party connectors
Google Gemini : టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమినిని కేవలం సమాధానాలు చెప్పే టూల్‌లా కాకుండా, అన్ని పనులూ చక్కబెట్టే ఒక ఒకే ఒక్క సూపర్ యాప్‌గా మార్చడానికి ప్లాన్ చేస్తోంది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ఇతర యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో కస్టమర్ల తరఫున పనులు పూర్తి చేసేలా జెమినిని అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం గూగుల్ తన ఏఐ మోడల్స్‌కు ఏజెంటిక్ కేపబిలిటీస్(కస్టమర్ల తరఫున సొంతంగా పని చేసే సామర్థ్యం), థర్డ్ పార్టీ కనెక్టర్లను జోడిస్తోంది. దీనివల్ల జెమిని చాట్‌బాట్ బయటి అప్లికేషన్లతో కనెక్ట్ అయ్యి, అక్కడ ఉన్న డేటాను యాక్సెస్ చేయడమే కాకుండా నేరుగా యాక్షన్ తీసుకోగలుగుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిజైన్ సాఫ్ట్‌వేర్ సంస్థలు Adobe, Canva జెమిని కోసం ప్రత్యేక కనెక్టర్లను ప్రకటిస్తూ గూగుల్‌తో చేతులు కలిపాయి.
జెమినిలోకి అడోబ్ క్రియేటివ్ క్లౌడ్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యాన్ని వెల్లడించింది. రాబోయే కొద్ది వారాల్లోనే అడోబ్ కనెక్టర్ జెమిని యాప్‌లోకి అందుబాటులోకి రానుంది. దీనివల్ల జెమిని వాడుతున్న క్రియేటర్లు, డిజైనర్లు అడోబ్ కంపెనీకి చెందిన రకరకాల ప్రొఫెషనల్ డిజైనింగ్ మరియు ఎడిటింగ్ టూల్స్‌ను నేరుగా జెమిని చాట్‌బాట్ నుంచే ఆపరేట్ చేయవచ్చు. అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌లోని ఫొటోషాప్, ఇలస్ట్రేటర్, ప్రీమియర్, ఎక్స్‌ప్రెస్ వంటి పాపులర్ సాఫ్ట్‌వేర్లకు జెమిని ద్వారానే టాస్క్‌లను అసైన్ చేయవచ్చు. క్రియేటివ్ పనులు ఎక్కడ జరిగితే అక్కడ తమ టూల్స్ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడోబ్ తెలిపింది. అయితే ఈ ఫీచర్లు పెయిడ్ జెమిని సబ్‌స్క్రైబర్లకు ప్రత్యేకంగా ఏమైనా అదనపు ప్రయోజనాలు ఇస్తాయా లేదా అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
కాన్వా కనెక్టర్ రోల్ అవుట్ స్టార్ట్
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాడుతున్న ఈజీ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్ Canva ఇప్పటికే జెమిని కోసం తన కనెక్టర్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. జెమిని ఉచిత వెర్షన్ వాడుతున్న వారితో పాటు పెయిడ్ యూజర్లందరికీ, అలాగే కాన్వా ప్లాన్లన్నింటికీ ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని దేశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నారు. జెమిని యాప్‌లోకి వెళ్లి సింపుల్‌గా @Canva అని టైప్ చేసి, మనకు ఎలాంటి డిజైన్ కావాలో ఐడియా ఇస్తే చాలు.. కాన్వా ఏజెంట్ రంగంలోకి దిగి డిజైన్లను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అయ్యే డిజైన్లు పూర్తిగా ఎడిట్ చేసుకునేలా ఉండటమే కాకుండా, యూజర్ల కాన్వా బ్రాండ్ కిట్‌తో కనెక్ట్ అయి ఉంటాయి.
గూగుల్ నానో బనానా, మ్యాజిక్ లేయర్స్ కాంబినేషన్ అద్భుతం
ఈ సరికొత్త కనెక్టర్ ద్వారా గూగుల్‌కు చెందిన నానో బనానా ఇమేజ్ జనరేషన్ మోడల్, కాన్వా మ్యాజిక్ లేయర్స్ ఫీచర్లు కలిసి పనిచేస్తాయి. దీనివల్ల కస్టమర్లు జెమిని యాప్‌లో ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసిన తర్వాత, దానిని మళ్లీ మార్చడం కోసం పదే పదే కొత్త ప్రాంప్ట్‌లు (Prompt) రాయాల్సిన అవసరం లేదు. ఆ ఇమేజ్‌ను నేరుగా కాన్వాలోకి తీసుకెళ్లి, అందులోని వేర్వేరు ఆబ్జెక్టులు మరియు ఎలిమెంట్లను మనకు నచ్చినట్లుగా మార్చుకుని ఫైనల్ వెర్షన్‌ను రెడీ చేసుకోవచ్చు. జెమినిలో ఐడియాలు వెతికే కోట్లాది మందికి, కాన్వా ఇచ్చే బ్రాండ్ కంటెంట్ మరియు డిజైన్ పవర్ తోడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవచ్చని, దీనివల్ల ఏఐ కంటెంట్‌ను చాలా సులభంగా ప్రొఫెషనల్ వర్క్‌గా మార్చవచ్చని కాన్వా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కేమరాన్ ఆడమ్స్ పేర్కొన్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999