Motorola : మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ.. రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్

ఇందులో కేవలం ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ గల ఈ బేస్ మోడల్ ధర రూ. 13,999. ఇది పాంటోన్ కాప్రి, పాంటోన్ ఇంపెనెట్రబుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Motorola : మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ.. రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్

Photo Credit: Motorola

The Moto G37 (left) and Moto G37 Power (right)

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి మోటోరోలా కొత్త బాంబ్స్
  • మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ..
  • రూ. 5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్
ప్రకటన

Motorola : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా  తమ లేటెస్ట్ 'G' సిరీస్ మొబైల్స్ మోటో G37, మోటో G37 పవర్‎లతో పాటు మోటో బడ్స్ 2 ఇయర్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విక్రయానికి ఉంచింది. గత వారమే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ డివైజెస్ నేటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్, పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలోనే ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఈ సరికొత్త గ్యాడ్జెట్స్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

కొత్త ఫోన్ల ధరల విషయానికి వస్తే, మోటోరోలా అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకునేలా రేట్లను సెట్ చేసింది.
* మోటో G37: ఇందులో కేవలం ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ గల ఈ బేస్ మోడల్ ధర రూ. 13,999. ఇది పాంటోన్ కాప్రి, పాంటోన్ ఇంపెనెట్రబుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
* మోటో G37 పవర్: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 15,999 కాగా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న హై-ఎండ్ మోడల్ ధర రూ. 18,999 గా ఉంది.
* మోటో బడ్స్ 2: ఈ సరికొత్త ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌ఫోన్స్ ధరను కంపెనీ రూ. 2,999 గా నిర్ణయించింది.
 

WhatsApp : వాట్సాప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్.. ఇకపై ఫోన్ నంబర్ ఇవ్వకుండానే చాటింగ్



ఫీచర్ల పరంగా చూస్తే, మోటో G37, G37 పవర్ రెండు ఫోన్లలోనూ లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది మల్టీటాస్కింగ్, డే-టు-డే యాప్స్ వాడకాన్ని చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. అలాగే వీటిలో ఫోటోల కోసం 13-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అయితే బ్యాటరీ విభాగంలో ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఉంది. నార్మల్ మోటో G37 మోడల్ 5,200mAh బ్యాటరీ తో వస్తుండగా.. మోటో G37 పవర్ మోడల్ మాత్రం ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చు. ఇక మోటో బడ్స్ 2 విషయానికొస్తే.. ఇందులో బెస్ట్ ఆడియో క్వాలిటీ కోసం డ్యూయల్ 11mm డైనమిక్ డ్రైవర్ సెటప్‌ను ఇచ్చారు.

కొత్తగా లాంచ్ అయిన ఈ మోటో ఫోన్లపై కంపెనీ అదిరిపోయే లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు తమ ఐడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఆప్షన్‌లో తీసుకుంటే రూ. 5,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా రిలయన్స్ జియో నెట్‌వర్క్ వాడుతున్న కస్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలుపై ఆరు నెలల పాటు ఉచితంగా 5,000GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. అలాగే రూ. 15,000 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్ బెనిఫిట్స్ కూడా అదనంగా అందుతాయి.

#తాజా కథనాలు
  1. Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ
  2. Vivo : ఆడియో మార్కెట్లోకి వివో ఎంట్రీ.. ఒకేసారి 3 డివైజ్ కనెక్ట్ అయ్యే సరికొత్త హెడ్‌ఫోన్స్
  3. Realme : మార్కెట్లోకి రియల్‌మీ మరో కొత్త 5G అస్త్రం.. జూన్‌లో రియల్‌మీ P4s 5G గ్రాండ్ ఎంట్రీ
  4. Samsung : శాంసంగ్ వినియోగదారులకు పండగే.. పాత ఫోల్డబుల్ మొబైల్స్‌లోకి ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్
  5. Oppo : అఫీషియల్ ఎంట్రీ.. రూ.13,999 ధరకే ఒప్పో కొత్త 4G ఫోన్ వచ్చేసింది
  6. Smartphone Comparison : రియల్‌మీ 16T, వన్‌ప్లస్ నార్డ్ CE 6, మోటో ఎడ్జ్ 70.. రూ. 30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?
  7. Xiaomi : రెడ్‌మి లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు పాపులర్ 5G ఫోన్ల ధరలను పెంచేసిన షావోమి
  8. Oppo A6c 4G : గెలాక్సీ, రెడ్‌మిలకు పోటీగా 7,000mAh బ్యాటరీతో ఒప్పో A6c లాంచ్
  9. Motorola : మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ.. రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్
  10. WhatsApp : వాట్సాప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్.. ఇకపై ఫోన్ నంబర్ ఇవ్వకుండానే చాటింగ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »