ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రైవసీ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది.
Photo Credit: WhatsApp
Your phone number will still be linked to your account for sign-in and recovery
WhatsApp : మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రైవసీ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలన్నా లేదా గ్రూప్‌లో యాడ్ అవ్వాలన్నా మన 10 అంకెల వ్యక్తిగత ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఇతరులకు కనిపించేది. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా, కేవలం ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేసే సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్‌ల తరహాలోనే వాట్సాప్‌లోనూ ఇకపై యూజర్‌నేమ్స్ హవా నడవనుంది.
ఈ సరికొత్త ఫీచర్ వల్ల ఎవరైనా మిమ్మల్ని వాట్సాప్‌లో కాంటాక్ట్ చేయాలనుకుంటే, మీ ఫోన్ నంబర్‌కు బదులుగా మీ యూజర్‌నేమ్ సెర్చ్ చేసి మెసేజ్ చేయవచ్చు. ఆ సమయంలో వారికి మీ ఫోన్ నంబర్ అస్సలు కనిపించదు, కేవలం మీ యూజర్‌నేమ్ హ్యాండిల్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ యూజర్‌నేమ్ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్. అంటే మీకు నచ్చితేనే యూజర్‌నేమ్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పటిలాగే మీ ఫోన్ నంబర్‌తోనే వాట్సాప్‌ను వాడుకోవచ్చు. ప్రతి అకౌంట్‌కు ఒకే ఒక్క యూనిక్ యూజర్‌నేమ్ ఉంటుంది. దీనిని మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీనివల్ల మీ పాత చాట్స్ కానీ, అకౌంట్ కానీ డిలీట్ అవ్వవు.
వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను మీ మొబైల్‌లో యాక్టివేట్ చేసుకోవడానికి వాట్సాప్ కొన్ని సులువైన స్టెప్స్‌ను ఇచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ ప్రొఫైల్ సెట్టింగ్స్ ద్వారా దీనిని చాలా సులభంగా సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూద్దాం.
మొదట మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లాలి. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ-డాట్స్ ఐకాన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి, ఐఫోన్ యూజర్లు అయితే స్క్రీన్ కింద ఉన్న సెట్టింగ్స్ ట్యాబ్‌ను నొక్కాలి. ఆ తర్వాత పేజీ పైభాగంలో ఉన్న మీ ప్రొఫైల్ పేరు, ఫోటోపై టాప్ చేయాలి. అక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో మీకు కొత్తగా యూజర్‌నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.
Motorola : మోటరోలా నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఎడ్జ్ 70 ప్రో+ టీజర్ అవుట్
ఇప్పుడు మీకు నచ్చిన వినూత్నమైన యూజర్‌నేమ్‌ను అక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ వాట్సాప్ కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. మీ యూజర్‌నేమ్ కనీసం 3 నుంచి గరిష్టంగా 35 క్యారెక్టర్ల పొడవు ఉండాలి. అందులో కచ్చితంగా ఒక అక్షరం ఉండాలి. కేవలం అక్షరాలు, నంబర్లు, చుక్కలు, అండర్‌స్కోర్లు మాత్రమే వాడాలి. యూజర్‌నేమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ wwwతో ప్రారంభం కాకూడదు. అలాగే చివర్లో .com, .org, .in వంటి డొమైన్ ఎక్స్‌టెన్షన్లు ఉండకూడదు. యూజర్‌నేమ్ మొదట్లో లేదా చివర్లో చుక్క పెట్టకూడదు, వరుసగా రెండు చుక్కలు కూడా వాడకూడదు.
మీరు ఎంటర్ చేసిన యూజర్‌నేమ్ రూల్స్ ప్రకారం కరెక్ట్‌గా ఉంటే.. అది అందుబాటులో ఉందో లేదో వాట్సాప్ ఆటోమేటిక్‌గా చెక్ చేస్తుంది. ఆ పేరు ఖాళీగా ఉంటే, వెంటనే Save లేదా Done బటన్ నొక్కి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతే.. మీ వాట్సాప్ యూజర్‌నేమ్ రెడీ అయిపోతుంది. ఇకపై తెలియని వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు, ఆన్‌లైన్ బయ్యర్లు లేదా సెల్లర్లకు మీ పర్సనల్ నంబర్ ఇవ్వకుండా ఈ యూజర్‌నేమ్ షేర్ చేసి సురక్షితంగా చాట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి రాగా, 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Reportedly Working on Android-Like Theft Detection Lock Feature for iPhone
Sony Reveals PS Plus Monthly Games June Lineup, Additional Benefits as Part of Days of Play Promotion