అమెరికా మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 2026 సింగిల్ వేరియంట్ అయిన 8GB రామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధరను 599.99 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.57,000 వరకు ఉంటుంది.
Motorola : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా అంతర్జాతీయ మార్కెట్లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 2026 పేరుతో విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టింది. గత ఏడాది వచ్చిన మోటో ఎడ్జ్ 2025 మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా దీనిని తీసుకువచ్చారు. ఈ సరికొత్త ఎడ్జ్ సిరీస్ ఫోన్ అద్భుతమైన 1.5K రెజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో లగ్జరీ లుక్‌లో లభిస్తోంది.
ధర, లభ్యత విషయానికి వస్తే.. అమెరికా మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 2026 సింగిల్ వేరియంట్ అయిన 8GB రామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధరను 599.99 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.57,000 వరకు ఉంటుంది. కలర్ ఆప్షన్ల పరంగా మోటోరోలా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తుంది. ఈసారి కూడా పాంటోన్ సంస్థ భాగస్వామ్యంతో పాంటోన్ మార్టిని ఒలీవ్ అనే ఒక ప్రత్యేకమైన సరికొత్త గ్రీన్ షేడ్ కలర్‌వేలో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 11 నుంచి అమెరికాలో బెస్ట్ బై, వెరిజోన్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో ఏటిఅండ్ టి, క్రికెట్ వైర్‌లెస్, స్పెక్ట్రమ్ వైర్‌లెస్, ఎక్స్‌ఫినిటీ మొబైల్ వంటి ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇది విక్రయించబడుతుందని కంపెనీ ధృవీకరించింది. అదేవిధంగా కెనడా మార్కెట్లో కూడా జూన్ 11 నుండి మోటోరోలా వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కస్టమర్లకు లభించనుంది. భారతదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ మోటోరోలా ఎడ్జ్ 2026 స్పెసిఫికేషన్లు యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డ్యూయల్ సిమ్ (నానో + ఈ-సిమ్) సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్, గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హెల్లో యూఐ స్కిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.3-ఇంచుల హెచ్‌డీ అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీ, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.
iPhone 18 Pro : ఐఫోన్ లవర్స్‌కు బిగ్ షాక్.. ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో బ్యాటరీ సైజ్ మారబోతోందా?
ఫోన్ పర్ఫార్మెన్స్ మరింత స్పీడ్‌గా ఉండేందుకు ఇందులో మీడియాటెక్ డిమెన్సిటీ 7450 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడు 8GB LPDDR5x రామ్, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ తోడవ్వడం వల్ల మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్ అప్‌గ్రేడ్ సాధించింది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో సోనీ లిటియా 710 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. దీనితో పాటు 122-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో కూడా ఏకంగా 50-మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వడం విశేషం.
ఈ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, వై-ఫై 6E, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అన్ని రకాల ముఖ్యమైన సెన్సార్లను ఇందులో అమర్చారు.
మోటోరోలా ఎడ్జ్ 2026 ఫోన్ అత్యంత కఠినమైన వాతావరణాన్ని కూడా తట్టుకునేలా డిజైన్ చేయబడింది. దీనికి మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ లభించింది. అంటే ఫోన్ పొరపాటున కిందపడినా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. దీనికి తోడు దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగులను ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ వేడి ఉన్న నీటి ప్రవాహాన్ని కూడా ఈ ఫోన్ తట్టుకోగలదు. సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఇందులో అందించారు.
చివరగా, బ్యాటరీ లైఫ్ విషయంలో మోటోరోలా అస్సలు తగ్గలేదు. ఈ ఫోన్‌లో 5,000mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇంత భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 7.22mm మందంతో, 160 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Meta Reportedly Testing ‘Series’ Feature to Organise Instagram, Facebook Reels Into Episodic Collections
Xiaomi 18 Tipped to Sport 6.4-Inch Display; Pro Models Said to Feature Dual 200-Megapixel Rear Cameras
Marvel's Wolverine Gets Visceral Gameplay Trailer at State of Play, Pre-Orders Now Live