. ఆర్‌బీఐ రెపో రేట్లతో పాటు మన ఆదాయం, ఉద్యోగం, లోన్ రకం వంటివి వడ్డీ రేట్లను డిసైడ్ చేసినప్పటికీ, సిబిల్ స్కోర్ అనేది బ్యాంకులకు అత్యంత కీలకమైన భద్రతా కొలమానంగా మారుతోంది.
CIBIL Score : ప్రస్తుత రోజుల్లో ఇల్లు, కారు, కొత్త మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్.. ఇలా ఏది కొనాలన్నా లోన్లు, ఈజీ ఇఎంఐ ఆప్షన్లు చాలా సులభంగా లభిస్తున్నాయి. బ్యాంకులు అందించే ఈ వెసులుబాటు వల్ల సామాన్యులు కూడా తమ ఆర్థిక బడ్జెట్‌ను చక్కగా ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. అయితే, బ్యాంకు మనకు లోన్ ఇస్తుందా లేదా, ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తుంది అనేది పూర్తిగా మన సిబిల్ స్కోర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ రెపో రేట్లతో పాటు మన ఆదాయం, ఉద్యోగం, లోన్ రకం వంటివి వడ్డీ రేట్లను డిసైడ్ చేసినప్పటికీ, సిబిల్ స్కోర్ అనేది బ్యాంకులకు అత్యంత కీలకమైన భద్రతా కొలమానంగా మారుతోంది.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CIBIL) అనే సంస్థ ఈ స్కోర్‌ను జారీ చేస్తుంది. మనం తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి చెల్లించగలమా లేదా అనే విషయాన్ని బ్యాంకులు ఈ స్కోర్ ఆధారంగానే అంచనా వేస్తాయి. ఈ సిబిల్ స్కోర్‌ను మొత్తం 900 పాయింట్లకు గాను లెక్కిస్తారు. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే లోన్ అంత ఈజీగా దొరుకుతుంది. లోన్ అప్లై చేయడానికి ముందే దీనిని ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మన అర్హత ఏమిటో మనకే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ స్కోర్ తక్కువగా ఉంటే, మిగిలిన ఈఎంఐలను సకాలంలో చెల్లించి దానిని మెరుగుపరుచుకోవడానికి మనకు సమయం దొరుకుతుంది. అంతేకాకుండా, మనకు తెలియకుండా మన పేరుతో ఎవరైనా లోన్లు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారా అనే విషయాన్ని కూడా దీని ద్వారా కనిపెట్టవచ్చు.
ప్రతి ఒక్కరికీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకసారి ఉచితంగా సిబిల్ రిపోర్ట్ పొందే హక్కు ఉంటుంది. ఆన్‌లైన్‌లో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి అధికారిక ట్రాన్స్ యూనియన్ సిబిల్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం మొదటగా సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ స్క్రీన్ ఎడమ వైపున కనిపించే గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ & రిపోర్ట్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
WhatsApp : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్కామర్ల ఆట కట్టించేందుకు వస్తున్న సరికొత్త ఫీచర్
ఆ పేజీలో మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఒక కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొదటి పేరు, చివరి పేరు ఎంటర్ చేయాలి. గుర్తింపు కార్డు కోసం అక్కడ ఉన్న డ్రాప్‌డౌన్ మెనూ నుండి పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డ్ వంటి ఆప్షన్లలో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని, దాని నంబర్‌ను టైప్ చేయాలి. చివరగా మీ డేట్ ఆఫ్ బర్త్, పిన్‌కోడ్ ఎంటర్ చేసి, నిబంధనలకు అంగీకరిస్తూ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ బటన్ నొక్కితే మీ లేటెస్ట్ సిబిల్ స్కోర్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.
వెబ్‌సైట్ కాకుండా మన ఫోన్ లోని గూగుల్ పే యాప్ ద్వారా కూడా చాలా ఈజీగా సిబిల్ స్కోర్‌ను ఉచితంగా చూసుకోవచ్చు. దీని కోసం ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కింది భాగానికి స్క్రోల్ చేస్తే, అక్కడ చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న చెక్ బటన్‌పై టాప్ చేసి, స్క్రీన్ మీద కనిపించే సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అయితే క్షణాల్లో మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలిసిపోతుంది.
మరో ప్రముఖ యాప్ క్రెడ్ ద్వారా కూడా ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే క్రెడ్ యాప్ అకౌంట్ సెటప్ చేసేటప్పుడే మన క్రెడిట్ వివరాలను యాక్సెస్ చేయడానికి మనం పర్మిషన్ ఇచ్చి ఉంటాము. కాబట్టి క్రెడ్ యాప్ ఓపెన్ చేసి, హోమ్ పేజీలో ఉండే క్రెడిట్ స్కోర్ బటన్‌పై క్లిక్ చేస్తే చాలు, మీ స్కోర్ కనిపిస్తుంది. అక్కడ ఉండే రిఫ్రెష్ బటన్ నొక్కడం ద్వారా సరికొత్త అప్‌డేటెడ్ స్కోర్‌ను సులభంగా చూసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999