సాధారణంగా ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా, యాడ్స్ లేకుండా అమెజాన్ మ్యూజిక్ యాప్‌ను వాడుకునేవారు. కానీ వచ్చే నెల నుండి ఈ రూల్స్ పూర్తిగా మారిపోబోతున్నాయి.
Amazon Prime members will get access to Amazon Music entire catalogue
Amazon : మ్యూజిక్ లవర్స్ అందరికీ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. భారతదేశంలో తన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ పేరుతో ఒక సరికొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను మంగళవారం రోజున లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ రావడంతో, ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు లభిస్తున్న ఉచిత మ్యూజిక్ బెనిఫిట్స్‌లో కంపెనీ భారీ మార్పులు చేసింది. సాధారణంగా ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా, యాడ్స్ లేకుండా అమెజాన్ మ్యూజిక్ యాప్‌ను వాడుకునేవారు. కానీ వచ్చే నెల నుండి ఈ రూల్స్ పూర్తిగా మారిపోబోతున్నాయి.
ఈ కొత్త మార్పుల ప్రకారం.. వచ్చే నెల జూలై 2 నుంచి సాధారణ ప్రైమ్ మెంబర్లకు పాటలు వినేటప్పుడు మధ్య మధ్యలో లిమిటెడ్ యాడ్స్ రాబోతున్నాయి. ఒకవేళ ప్రైమ్ యూజర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా ప్రశాంతంగా పాటలు వినాలనుకుంటే.. వారు కచ్చితంగా ఈ కొత్త అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ప్రైమ్ మెంబర్లు తమ పాత సబ్‌స్క్రిప్షన్ ధరతో పాటు అదనంగా నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేని సాధారణ యూజర్లు ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్ కావాలనుకుంటే, వారు నెలకు రూ.199 చెల్లించి ఈ సేవలను పొందవచ్చు.
ఫీచర్లు, బెనిఫిట్స్ విషయానికి వస్తే.. కొత్తగా వచ్చిన అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ యూజర్లకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇందులో ఎక్కడా ప్రకటనలు లేకుండా 10 కోట్లకు పైగా పాటలు, పాడ్‌కాస్ట్‌లను వినవచ్చు. అంతేకాకుండా, ఆడియోను హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీలో స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. వీటితో పాటు మ్యూజిక్ థియేటర్ ఫీలింగ్ ఇచ్చే స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా పాటలు వినడానికి వీలుగా ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ ఆప్షన్ కూడా ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్ యూజర్లకు మాత్రమే లభిస్తుంది.
మరోవైపు, అదనపు డబ్బులు కట్టి అప్‌గ్రేడ్ అవ్వని సాధారణ ప్రైమ్ యూజర్ల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే మారనుంది. వీరికి 10 కోట్ల పాటల క్యాటలాగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, పాటల మధ్యలో యాడ్స్ వస్తాయి. అంతేకాదు, వీరు హెచ్‌డీ లేదా అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీలో ఆడియోను స్ట్రీమ్ చేయలేరు. ప్రైమ్ మెంబర్లకు స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ వంటి ప్రీమియం ఫీచర్లు కట్ అవ్వడమే కాకుండా, పాటలను ఆఫ్‌లైన్ లో వినడానికి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉండదు. ప్రస్తుతానికి ఈ ఫీచర్లన్నీ అందరు ప్రైమ్ మెంబర్లకు ఉచితంగానే వస్తున్నప్పటికీ, జూలై 2 నుంచి ఈ కొత్త కండిషన్లు అమలులోకి వస్తాయి.
![]()
ఇదే తరుణంలో సాధారణ యూజర్ల కోసం అమెజాన్ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. దేశంలో త్వరలోనే అమెజాన్ మ్యూజిక్ ఫ్రీ అనే సరికొత్త ఉచిత ప్లాన్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా అమెజాన్ మ్యూజిక్‌లోని పూర్తి పాటలను ఉచితంగా వినవచ్చు. అయితే, ఇది పూర్తిగా యాడ్స్ ఆధారిత ప్లాన్. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్పాటిఫై ఫ్రీ ప్లాన్ లాగే, పాటల మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి.
అమెజాన్ మ్యూజిక్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం చూస్తుంటే, కంపెనీ గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో విషయంలో చేసిన ప్లాన్‌నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రైమ్ వీడియోలో కూడా మొదట్లో ప్రైమ్ మెంబర్లకు ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూపించేవారు. కానీ ఆ తర్వాత యాడ్స్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కోసం విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనే రూల్ తెచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములాను ఆడియో స్ట్రీమింగ్‌లో కూడా వర్తింపజేస్తూ యూజర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు అమెజాన్ సిద్ధమైంది.
ప్రకటన
ప్రకటన
Motorola Edge 2026 Launched With 6.3-Inch Display, MediaTek Dimensity 7450 SoC: Price, Specifications
God of War Laufey Revealed With Extended Gameplay Trailer Showcasing New Protagonist, Setting and Combat System