Motorola : లాంచ్‌కు ముందే లీకైన మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫీచర్లు.. జూలై 15న గ్రాండ్ ఎంట్రీ

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూలై 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ కానుంది.

Motorola : లాంచ్‌కు ముందే లీకైన మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫీచర్లు.. జూలై 15న గ్రాండ్ ఎంట్రీ

Photo Credit: Flipkart

Motorola Edge 70 Max

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే మోటోరోలా సంచలనం
  • లాంచ్‌కు ముందే లీకైన ‘మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్’ ఫీచర్లు
  • సింగిల్ ఛార్జ్‌తో 58 గంటల నాన్‌స్టాప్ బ్యాకప్
ప్రకటన

Motorola : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా భారతీయ మార్కెట్లో మరో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తమ మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‎ను లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్ లాంచ్‌కు కేవలం మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ డివైజ్ అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టడానికి ముందే, కంపెనీ దీనికి సంబంధించిన అన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్లను, ఫీచర్లను రివీల్ చేసింది. ఈ ఫోన్‌లో అన్నింటికంటే పెద్ద హైలైట్ ఏమిటంటే.. మోటోరోలా బ్రాండ్ చరిత్రలోనే ఇంతవరకు ఏ ఫోన్‌లోనూ ఇవ్వనంత భారీ సైజ్ బ్యాటరీని ఈ మోడల్‌లో అందించబోతున్నారు.

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూలై 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‎లో ఈ ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజీని కూడా కంపెనీ ఇప్పటికే లైవ్ చేసింది. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను గ్రీన్, లైట్ బ్లూ, బ్లాక్  అనే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్ ధర ఎంత ఉండబోతుందనే విషయానికి సంబంధించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లూ ఇవ్వలేదు. కానీ ఫీచర్లను బట్టి చూస్తే ఇది ప్రీమియం రేంజ్‌లో ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. ఈ ఫోన్‌లో అత్యంత నాణ్యమైన QHD+ రిజల్యూషన్ గల ఎల్‌టీపీఓ  డిస్‌ప్లే ప్యానెల్‌ను అమర్చారు. ఇది గేమింగ్, స్క్రోలింగ్ చేసేటప్పుడు అత్యంత స్మూత్ అనుభూతిని ఇచ్చేలా 144Hz హై రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో అందించడం విశేషం. స్క్రీన్‌కు గట్టి రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో క్వాల్కమ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో పాటు వేగవంతమైన 12GB LPDDR5X ర్యామ్‌ను జత చేశారు.

ముందే చెప్పుకున్నట్లుగా, ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద యుఎస్‌పి దీని బ్యాటరీ సామర్థ్యమే. మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఏకంగా 7100mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో వస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ నిరంతరాయంగా 58 గంటల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది. ఈ మెగా బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. వీటితో పాటు వైర్ల సాయం లేకుండా ఛార్జ్ చేసుకునేందుకు 25W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ విభాగంలో ఇదే అత్యంత వేగవంతమైన మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ కావడం విశేషం. ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా లభించే మ్యాగ్నెటిక్ సిస్టమ్ వల్ల వివిధ రకాల మ్యాగ్నెటిక్ యాక్సెసరీలను సులభంగా వాడుకోవచ్చు.


Xiaomi Mi 10T : భారీగా తగ్గిన షావోమి Mi 10T 5G ధర.. ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు బంపర్ ఆఫర్

మంచి ఫోటోలు, వీడియోలు క్లిక్ చేయడం కోసం మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ సామర్థ్యం గల సోనీ ఎల్‌వైటీ-710 ప్రీమియం ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన, స్పష్టమైన చిత్రాలను క్యాప్చర్ చేయడానికి సహాయపడుతుంది. భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్‌ఫుల్ ప్రొసెసర్,  అద్భుతమైన కెమెరా కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో ఉన్న మిగతా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  2. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  3. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
  4. Vivo V70 FE 5G : రూ.19 వేల భారీ డిస్కౌంట్.. 200MP కెమెరాతో Vivo V70 FE 5G ఇప్పుడు సూపర్ డీల్
  5. Samsung : శామ్‌సంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. 13 సార్లు తప్పు పాస్‌వర్డ్ కొడితే ఫోన్‌కు గుడ్‌బై
  6. Specialized E Bike : బరువు తక్కువ.. పెర్ఫార్మెన్స్ ఎక్కువ.. కాకపోతే ఈ బైక్ ధర ఏకంగా రూ.12.55 లక్షలు
  7. Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్
  8. iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  9. Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం
  10. Redmi 17 4G : మార్కెట్‌లోకి రెడ్‌మీ 17 4జి.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »