మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ ఫోన్ త్వరలోనే ఇండియాలో విడుదల కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Photo Credit: Flipkart/ Motorola
Motorola Edge 70 Pro+ will sport a hole-punch display cutout
Motorola : మోటరోలా కంపెనీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన హవాను కొనసాగిస్తూ బ్యాక్ టు బ్యాక్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే ఎడ్జ్ 70 సిరీస్‌లో మూడు అదిరిపోయే మోడళ్లను (ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ఫ్యూజన్) పరిచయం చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ఈ సిరీస్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తీసుకురావడానికి రెడీ అయింది. అదే మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+. ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో విడుదల కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని కోసం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక స్పెషల్ పేజీ కూడా లైవ్ అయింది.
ఈ ఫోన్ డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌తో కళ్లు చెదిరేలా ఉంది. గ్లోబల్ కలర్ ట్రెండ్ సెట్టర్ పాంటోన్ కలర్ కాంబినేషన్లతో ఈ ఫోన్లను డిజైన్ చేశారు. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ మొత్తం మూడు విభిన్నమైన మెటీరియల్ ఫినిషింగ్‌లతో రానుంది. అందులో మొదటిది లగ్జరీ లుక్ ఇచ్చే ప్యాటర్న్‌తో కూడిన పాంటోన్ షికోరి కాఫీ, రెండోది అదిరిపోయే టెక్స్చర్‌తో ఉండే పాంటోన్ స్టార్మీ సీ, మూడోది క్లాసిక్ లుక్ ఇచ్చే పాంటోన్ జిన్‌ఫాండెల్. ఫోన్ వెనుక భాగం ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, ముందు వైపు అంచులు వంగి ఉండే 'కర్వ్డ్ డిస్‌ప్లే'ను అందించారు.
iQOO 16 : 9000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్.. ఐకూ 16 లీకైన ఫీచర్లు అదరహో
మోటరోలా ఈ ఫోన్ లో కెమెరా డిపార్ట్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా కింద పవర్‌ఫుల్ 50-మెగాపిక్సెల్ సోని ఎల్‌వైటీ-710 సెన్సార్‌ను వాడారు. దీనికి 3.5-డిగ్రీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. దీనివల్ల మీరు నడుస్తూ ఫోటోలు తీసినా లేదా చేతులు కాస్త వణికినా సరే ఫోటోలు అస్సలు బ్లర్ అవ్వవు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఇందులో 81mm ఫోకల్ లెంగ్త్ ఉన్న ప్రత్యేకమైన టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఇది సూపర్ జూమ్ ప్రో ఫీచర్ సాయంతో ఏకంగా 50 రెట్లు జూమ్ వస్తువులను కూడా క్లియర్ గా క్యాప్చర్ చేస్తుంది.
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఎడ్జ్ 70 ప్రో మోడల్‌తో పోలిస్తే.. ఈ కొత్త ప్రో+ వేరియంట్‌లో మూడు పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్స్ ఇస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఒకటి.. సుదూరంలో ఉన్న ఫోటోలను అద్భుతంగా తీయడానికి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. రెండు.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్. మూడు.. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఏకంగా 16GB వరకు భారీ ర్యామ్. ఫోన్ కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండగా.. ఎడమవైపు ఒక స్పెషల్ మల్టీ-ఫంక్షన్ బటన్‌ను కూడా అమర్చారు.
OTT Movies : ఈ వారం ఓటీటీలో పండగే.. ఏకంగా 11 కొత్త సినిమాలు, సిరీస్‌లు!
ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో వచ్చే నెల మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విడుదలైన వెంటనే ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు లాంచ్ ఈవెంట్‌లోనే కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.
ప్రకటన
ప్రకటన
TP-Link India Starts Local Manufacturing of Wi-Fi 7 Products Following 6GHz Spectrum Delicensing