Realme : రియల్‌మీ నుంచి అదిరిపోయే బడ్స్ లాంచ్.. 50 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్

రియల్‌మీ 16టీ స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ వాచ్ ఎస్5 స్మార్ట్‌వాచ్‌లతో పాటు.. సంగీత ప్రియుల కోసం ప్రీమియం ఫీచర్లతో కూడిన రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Realme : రియల్‌మీ నుంచి అదిరిపోయే బడ్స్ లాంచ్.. 50 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్

Photo Credit: Realme

Realme Buds Air 8 Pro comes in Master Black and Master White finishes

ముఖ్యాంశాలు
  • రియల్‌మీ భారత మార్కెట్లో ఒకేసారి మూడు సరికొత్త గ్యాడ్జెట్లు లాంచ్
  • రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ కూడా
  • 10 నిమిషాల ఛార్జింగ్‌తో 11 గంటల పాటలు
ప్రకటన

Realme : ప్రముఖ చైనా టెక్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లో ఒకేసారి మూడు సరికొత్త గ్యాడ్జెట్లను లాంచ్ చేసి దుమ్ములేపింది. రియల్‌మీ 16టీ స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ వాచ్ ఎస్5 స్మార్ట్‌వాచ్‌లతో పాటు.. సంగీత ప్రియుల కోసం ప్రీమియం ఫీచర్లతో కూడిన రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ బడ్స్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ ఇయర్‌బడ్స్‌లో సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా కోయాక్సియల్ డ్యూయల్ డ్రైవర్ ఆడియో సిస్టమ్‌ను పెట్టారు. ఇందులో బేస్ అదిరిపోయేలా 11mm డైనమిక్ డ్రైవర్, అలాగే మ్యూజిక్‌లోని చిన్న చిన్న సౌండ్స్ కూడా స్పష్టంగా వినిపించేలా 6mm మైక్రో ప్లానార్ ట్వీటర్‌ను అమర్చారు. వీటికి తోడు LHDC 5.0 హై-రెస్ వైర్‌లెస్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల పాటలు వింటుంటే థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది.

మీరు ట్రాఫిక్‌లో ఉన్నా లేదా జనం ఎక్కువగా ఉన్న చోట ఉన్నా సరే.. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పాటలు వినడానికి లేదా ఫోన్ మాట్లాడటానికి ఇందులో 55dB వరకు అడాప్టివ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను ఇచ్చారు. ఒకవేళ మీరు ఇయర్‌బడ్స్ తీయకుండానే ఎదుటివారి మాటలు లేదా చుట్టుపక్కల శబ్దాలు వినాలనుకుంటే.. ఇందులోని ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
 

Motorola : మోటరోలా నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఎడ్జ్ 70 ప్రో+ టీజర్ అవుట్

iQOO 16 : 9000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్‌.. ఐకూ 16 లీకైన ఫీచర్లు అదరహో



ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ కోసం రెండు ఇయర్‌బడ్స్‌లో కలిపి మొత్తం 6 మైక్రోఫోన్లను ఇచ్చారు. అలాగే ఇందులో బోన్ కండక్షన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే వాయిస్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పెట్టారు. ఇది చుట్టుపక్కల ఉండే గాలి, ట్రాఫిక్ వంటి అనవసరమైన శబ్దాలను ఏకంగా 90dB వరకు తగ్గించి.. AI సాయంతో మీ వాయిస్‌ను అవతలి వారికి చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.

మొబైల్ గేమ్స్ ఆడేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా గేమ్ మోడ్ ఇచ్చారు. దీనివల్ల లాటెన్సీ (ఆడియో ఆలస్యం కావడం) కేవలం 45ms కి పడిపోతుంది. అంటే మీరు పబ్‌జీ లేదా ఫ్రీఫైర్ ఆడేటప్పుడు గన్ సౌండ్స్ ఎక్కడా లాగ్ లేకుండా త్వరగా వినిపిస్తాయి. కనెక్టివిటీ కోసం లేటెస్ట్ బ్లూటూత్ 6.1, గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.

పాటలు మార్చాలన్నా, వాల్యూమ్ పెంచాలన్నా, లేదా కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా ఫోన్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బడ్స్‌పై ఉండే ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్స్ ద్వారానే అంతా మేనేజ్ చేయవచ్చు. అలాగే ఇయర్‌బడ్స్ చెవిలో నుంచి తీయగానే పాట ఆగిపోయి, మళ్లీ పెట్టుకోగానే ప్లే అయ్యే వేర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. దుమ్ము, నీటి వల్ల పాడవకుండా వీటికి IP55 రేటింగ్ ఇచ్చారు. ఒక్కో బడ్ బరువు కేవలం 4.8 గ్రాములు మాత్రమే ఉంటుంది.

ఈ ఇయర్‌బడ్స్ బ్యాటరీ లైఫ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ మాత్రమే 12 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే మొత్తంగా 50 గంటల పాటు వాడుకోవచ్చు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 11 గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చని రియల్‌మీ చెప్తోంది. టైప్-సి పోర్ట్ ద్వారా కేస్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 2 గంటల సమయం పడుతుంది.

భారత మార్కెట్లో రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో ధరను రూ.6,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.300 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవి మాస్టర్ వైట్, మాస్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దొరుకుతాయి. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 5వ తేదీ అర్ధరాత్రి వరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, రియల్‌మీ వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో వీటి మొదటి సేల్ జరగనుంది.

#తాజా కథనాలు
  1. Budget Smartphones : రూ. 11 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది? హెచ్ఎండీ, రెడ్‌మీ, లావా మధ్య బిగ్ ఫైట్
  2. Realme : రియల్‌మీ నుంచి అదిరిపోయే బడ్స్ లాంచ్.. 50 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్
  3. Motorola : మోటరోలా నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఎడ్జ్ 70 ప్రో+ టీజర్ అవుట్
  4. iQOO 16 : 9000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్‌.. ఐకూ 16 లీకైన ఫీచర్లు అదరహో
  5. OTT Movies : ఈ వారం ఓటీటీలో పండగే.. ఏకంగా 11 కొత్త సినిమాలు, సిరీస్‌లు!
  6. Realme : భారత్‌లోకి రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజుల బ్యాటరీ లైఫ్
  7. Airtel : ఎయిర్‌టెల్ కొత్త 5G ప్రయోగం.. వివాదంలో చిక్కుకున్న ప్రయారిటీ సర్వీస్
  8. Realme : మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మి 16T.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో సరికొత్త రికార్డు!
  9. Xiaomi 17T : భారత్‌లోకి షావోమి T సిరీస్ గ్రాండ్ కంబ్యాక్.. జూన్ 4న మోస్ట్ అవేటెడ్ షావోమి 17T లాంచ్
  10. Google Gemini : గూగుల్ జెమిని ఇక సూపర్ యాప్.. అడోబ్, కాన్వా పార్ట్‌నర్‌షిప్‌తో నయా విప్లవం
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »