గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న తన అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ ఫోన్ మోటరోలా రేజర్ ఫోల్డ్ ఇండియా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
Photo Credit: Motorola
Motorola Razr Fold will be launched in India in two shades
Motorola Razr Fold: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటరోలా తన పట్టును పెంచుకునేందుకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న తన అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ ఫోన్ మోటరోలా రేజర్ ఫోల్డ్ ఇండియా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. బుక్-స్టైల్ డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్, మార్కెట్లో ఉన్న ఇతర ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఫోన్ సేల్స్ జరగనున్నాయి. మోటరోలా ఇండియా తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. మే 13వ తేదీన అంటే నేడు ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. దీనికోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఒక ప్రత్యేక పేజీని కూడా సిద్ధం చేశారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా, దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
ఈ ఫోన్ రెండు అద్భుతమైన రంగుల్లో లభించనుంది. ఒకటి పాంటోన్ బ్లాకెన్డ్ బ్లూ, రెండోది పాంటోన్ లిల్లీ వైట్. మెమరీ విషయానికి వస్తే, 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో ఇది రానుంది. ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఫిఫా వరల్డ్ కప్ 26 ఎడిషన్ ను కూడా మోటరోలా లాంచ్ చేయబోతోంది.
ఈ ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కవర్ స్క్రీన్ 6.6 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. దీని బ్రైట్‌నెస్ ఏకంగా 6000 నిట్స్. అంటే మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లోపలి వైపు 8.1 అంగుళాల భారీ 2K డిస్‌ప్లే ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 మరియు అల్ట్రా థిన్ గ్లాస్ రక్షణ కల్పించారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిప్‌సెట్లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఈ ఫోన్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మై యూఎక్స్ సాఫ్ట్‌వేర్‌తో ఇది నడుస్తుంది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. దీనిలో 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉండటం విశేషం.
మోటరోలా రేజర్ ఫోల్డ్ వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా సోనీ లైటియా సెన్సార్‌తో వస్తుంది. అలాగే 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం కవర్ స్క్రీన్‌పై 32MP, లోపలి స్క్రీన్‌పై 20MP కెమెరాలను అమర్చారు.
సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ తక్కువగా ఉంటుంది, కానీ మోటరోలా ఇందులో 6,000mAh భారీ బ్యాటరీని ఇచ్చింది. దీనికి 80W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే దీనికి IP49 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర సుమారు రూ.2.14 లక్షలుగా ఉంది, ఇండియాలో కూడా ఇదే రేంజ్ లో ఉండవచ్చని అంచనా.
ప్రకటన
ప్రకటన
Oppo Find X10 Tipped to Feature 165Hz Refresh Rate Display, 8,000mAh Battery