ఈసారి రాబోయే నథింగ్ ఫోన్ 4b లో కంపెనీ ఒక పెద్ద మార్పు చేసింది.
Photo Credit: Nothing Phone 4b
Nothing Phone 4b
Nothing Phone 4b : మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే తనదైన స్టైలిష్ డిజైన్‌తో సరికొత్త క్రేజ్ సంపాదించుకున్న బ్రిటన్ మొబైల్ బ్రాండ్ నథింగ్ మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి రెడీ అయింది. తన అప్‌కమింగ్ మోడల్ నథింగ్ ఫోన్ 4bను రాబోయే జూలై 7వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా కంపెనీ తన సరికొత్త 'b' సిరీస్‌ను మార్కెట్లోకి పరిచయం చేస్తోంది. నథింగ్ ఫోన్లలో ఉండే ప్రత్యేకమైన ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను తక్కువ ధరలోనే ఎక్కువ మంది కస్టమర్లకు అందించడానికే ఈ సరికొత్త సిరీస్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకోవడం కోసం కంపెనీ ఇప్పటికే తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.
నథింగ్ ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దాని వెనుక ఉండే లైటింగ్ డిజైన్. అయితే ఈసారి రాబోయే నథింగ్ ఫోన్ 4b లో కంపెనీ ఒక పెద్ద మార్పు చేసింది. వెనుక భాగంలో ఉండే పాత గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ స్థానంలో.. ఈసారి చాలా కాంపాక్ట్‌గా ఉండే హారిజాంటల్ గ్లిఫ్ బార్‌ను అమర్చింది. దీని ద్వారానే యూజర్లు నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్, యాప్‌లకు సంబంధించిన అలర్ట్‌లను ఈజీగా చూసుకోవచ్చు. వీటితో పాటు ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, మెరుగైన పవర్ ఎఫిషియన్సీతో పాటు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా జోడించబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
Sony : ఏఐ ప్రాసెసర్, డాల్బీ అట్మోస్, జెమిని సపోర్ట్.. సోనీ సరికొత్త టీవీలు వచ్చేశాయ్
ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండబోతున్నట్లు నథింగ్ అధికారికంగా ధృవీకరించింది. అయితే అది ఏ మోడల్ అన్నది మాత్రం సీక్రెట్‌గా ఉంచింది. కానీ ఇటీవలే ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్‌లో లీకైన వివరాల ప్రకారం.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని గట్టిగా తెలుస్తోంది. గీక్‌బెంచ్ టెస్టింగ్‌లో ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 1,088 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 3,155 పాయింట్ల స్కోరును సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఫోన్ 8 GB రామ్ వేరియంట్‌తో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ నథింగ్ ఓఎస్ పై రన్ కాబోతోంది.
నథింగ్ ఫోన్ 4b స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.7 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా ఇందులో 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తాయి. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది, అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో రానుంది. అలాగే ఫోన్ ఎక్కువ సమయం బ్యాకప్ ఇవ్వడం కోసం ఇందులో 5,400mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. గత మార్చి నెలలో భారత్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 4a (6.78 ఇంచుల డిస్‌ప్లే, 4500 నిట్స్ బ్రైట్‌నెస్) తో పోలిస్తే.. ఈ కొత్త ఫోన్ 4b మరింత అప్‌గ్రేడెడ్ డిజైన్, సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.
ప్రకటన
ప్రకటన
Qualcomm Schedules Snapdragon Summit 2026 for September: Snapdragon 8 Elite Gen 6 Series Expected to Debut