OnePlus N6 : జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్.. రూ.18,000 నుంచే ప్రారంభం కానున్న వన్ ప్లస్ N సిరీస్

భారత మార్కెట్లో వన్ ప్లస్ N సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.18,000 నుంచి రూ.25,000 మధ్యలో ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

OnePlus N6 : జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్.. రూ.18,000 నుంచే ప్రారంభం కానున్న వన్ ప్లస్ N సిరీస్

Photo Credit: Amazon/ OnePlus

OnePlus N6

ముఖ్యాంశాలు
  • వన్ ప్లస్ నుంచి మోస్ట్ అఫర్డబుల్ సిరీస్ ‘వన్ ప్లస్ N6’
  • జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్
  • ₹18,000 నుంచే ప్రారంభం కానున్న వన్ ప్లస్ N సిరీస్!
ప్రకటన

OnePlus N6 : భారతదేశంలో సరికొత్త వన్ ప్లస్ N సిరీస్ లాంచ్‌కు సంబంధించి వన్ ప్లస్ కంపెనీ సోమవారం ఒక భారీ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ సిరీస్ లో వస్తున్న మొట్టమొదటి ఫోన్ వన్ ప్లస్ N6 అని చెప్తూనే.. ఈ సరికొత్త సిరీస్ ఫోన్ల ధరలు ఇండియాలో ఎంత ఉండబోతున్నాయో అధికారికంగా వెల్లడించింది. భారత మార్కెట్లో వన్ ప్లస్ N సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.18,000 నుంచి రూ.25,000 మధ్యలో ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. దీనివల్ల ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వన్ ప్లస్ నోర్డ్ సిరీస్ కంటే ఇవి చాలా చౌకగా లభించనున్నాయి.

జూన్ 30న మధ్యాహ్నం 12 గంటలకు గ్రాండ్ ఎంట్రీ
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్  Xలో వన్ ప్లస్ ఇండియా అధికారికంగా పోస్ట్ చేస్తూ.. సరికొత్త వన్ ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూన్ 30, 2026న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కాబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ సరికొత్త లైనప్‌ను భారతదేశంలోని యువత, సరికొత్త తరాన్ని దృష్టిలో ఉంచుకుని  New, Neo, Never Off  అనే ప్రత్యేకమైన ఫిలాసఫీతో డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ మంది కస్టమర్లకు వన్ ప్లస్ కోర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం.

అఫీషియల్ డిజైన్, కెమెరా మాడ్యూల్
లాంచ్ తేదీ ప్రకటనతో పాటు వన్ ప్లస్ N6 పూర్తి డిజైన్, రూపాన్ని కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో సరికొత్త స్క్వేర్-షేప్డ్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఈ కెమెరా ఐలాండ్ లో రెండు పవర్‌ఫుల్ కెమెరా లెన్స్‌లతో పాటు ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ అమర్చబడి ఉంటుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పూర్తిగా ఫ్లాట్ గా ఉండి.. దాని మధ్యలో వన్ ప్లస్ అధికారిక లోగో హైలైట్ అవుతుంది. చూడటానికి ఈ ఫోన్ లుక్ చాలా వరకు వన్ ప్లస్ నోర్డ్ CE 6 మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, ఈ స్క్వేర్ కెమెరా దీనికి ప్రత్యేక లుక్‌ను ఇస్తుంది.

Specialized Levo 4 X : లైట్ వెయిట్ కార్బన్ ఫ్రేమ్, పవర్‌ఫుల్ ఫాక్స్ సస్పెన్షన్.. ఈవీ మార్కెట్లోకి సరికొత్త సైకిల్

బటన్స్ పొజిషన్, కనెక్టివిటీ ఫీచర్లు
డిజైన్ పరంగా వన్ ప్లస్ N6లో ఫ్లాట్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఫోన్ కు కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ బటన్లను అందించారు. ఎడమ వైపు భాగాన్ని పూర్తిగా క్లీన్ గా వదిలేశారు. ఫోన్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, మెయిన్ స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే స్లాట్‌ను అమర్చారు. అలాగే ఫోన్ పైభాగంలో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం సెకండరీ మైక్రోఫోన్ కటౌట్‌ను ఇచ్చారు. దీనివల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది.

డిస్‌ప్లే స్ట్రక్చర్, కలర్ ఆప్షన్లు
ఇక ముందు భాగం విషయానికి వస్తే.. వన్ ప్లస్ N6 లో ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ పైభాగంలో మధ్యలో సెల్ఫీ కెమెరా, వీడియో కాల్స్ కోసం సెంటర్‌ హోల్-పంచ్ కటౌట్‌ను డిజైన్ చేశారు. స్క్రీన్ చుట్టూ ఉండే బెజెల్స్ కాస్త మందంగానే కనిపిస్తున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మనదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా బ్లాక్, గ్రీన్ వంటి రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అమ్మకానికి రానుంది. గతంలో ఈ ఫోన్ జూలైలో వస్తుందని అంచనా వేసినప్పటికీ, కంపెనీ జూన్ చివరి నాటికే దీనిని మార్కెట్లోకి తెచ్చి సర్ప్రైజ్ చేసింది.

#తాజా కథనాలు
  1. Oppo : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో సెన్సేషన్.. ఈ ఏడాది చివర్లో మోస్ట్ పవర్‌ఫుల్ ఒప్పో ఫైండ్ X10 ప్రో లాంచ్
  2. Honor : బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు.. చైనాలో అఫీషియల్‌గా హానర్ X70 ప్రో మాక్స్ లాంచ్
  3. Vivo : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇండియాలో సైలెంటుగా మొబైల్ ధరలు పెంచేసిన వివో
  4. OnePlus N6 : అమెజాన్‌లో లైవ్‌లోకి వచ్చిన మైక్రోసైట్.. ‘ఆల్వేస్ ఆన్.. ఆల్వేస్ స్మూత్’ ట్యాగ్‌లైన్‌తో రచ్చ
  5. OnePlus N6 : జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్.. రూ.18,000 నుంచే ప్రారంభం కానున్న వన్ ప్లస్ N సిరీస్
  6. Garena Free Fire Max : లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లేటెస్ట్ కోడ్స్ ఇవే.. త్వరపడండి బాసూ
  7. HMD Vibe 2 5G : బడ్జెట్ ధరలోనే 5G పవర్..భారత మార్కెట్లోకి HMD వైబ్ 2 5G లాంచ్
  8. EPFO : ఆధార్ నంబర్ ఉంటే చాలు.. ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే
  9. Amazon : జూన్ 18 వరకే ఛాన్స్.. అమెజాన్లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు
  10. Smartphone Comparison : మిడ్-బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ల మహా సంగ్రామం.. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో ఫోన్ల మధ్య గట్టి పోటీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »