Specialized Levo 4 X : లైట్ వెయిట్ కార్బన్ ఫ్రేమ్, పవర్‌ఫుల్ ఫాక్స్ సస్పెన్షన్.. ఈవీ మార్కెట్లోకి సరికొత్త సైకిల్

ఈ స్పెషలైజ్డ్ లెవో 4 X అంత సులభంగా సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. దీని ధరను కంపెనీ 11,999.99 డాలర్లుగా నిర్ణయించింది.

Specialized Levo 4 X : లైట్ వెయిట్ కార్బన్ ఫ్రేమ్, పవర్‌ఫుల్ ఫాక్స్ సస్పెన్షన్.. ఈవీ మార్కెట్లోకి సరికొత్త  సైకిల్

Specialized Levo 4 X

ముఖ్యాంశాలు
  • ఒక్క ఛార్జ్‌తో 4.4 గంటల నాన్-స్టాప్ రైడింగ్
  • కొండలు, గుట్టల్లో సైతం పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్
  • లైట్ వెయిట్ కార్బన్ ఫ్రేమ్, పవర్‌ఫుల్ ఫాక్స్ సస్పెన్షన్
ప్రకటన

Specialized Levo 4 X : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కేవలం ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లే కాకుండా.. హై-ఎండ్ ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా మార్కెట్లో క్రేజ్ పెరుగుతోంది. ప్రముఖ ప్రీమియం సైకిళ్ల తయారీ సంస్థ Specialized, అడ్వెంచర్, ఆఫ్-రోడ్ రైడింగ్ ప్రియుల కోసం స్పెషలైజ్డ్ లెవో 4 X అనే సరికొత్త హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది పవర్‌ఫుల్ ఫుల్-సస్పెన్షన్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడిన ఒక లగ్జరీ ఈ-బైక్.

ధర విషయానికి వస్తే.. ఈ స్పెషలైజ్డ్ లెవో 4 X అంత సులభంగా సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. దీని ధరను కంపెనీ 11,999.99 డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1,20,000 ఆస్పాస్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రీమియం బైక్ కంపెనీ అధికారిక గ్లోబల్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ ఒకే ఒక క్లాసిక్ కలర్ వేరియంట్ అయిన ఫియరీ రెడ్ రంగులో లాంచ్ చేసింది. ఈ బైక్ బాడీని అత్యంత తేలికైన, గట్టిదైన Levo 4 11m కార్బన్ ఫ్రేమ్‎తో తయారు చేయడం విశేషం.

ఈ ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్‌లో కంపెనీ సరికొత్త హై-పర్ఫార్మెన్స్ కలిగిన 850 Wh పవర్‌ఫుల్ మోటార్‌ను అమర్చింది. ఇది ఎస్‌-వర్క్స్ 3.1 మిడ్-మోటార్ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ మోటార్ సహాయంతో ఈ సైకిల్ ఏకంగా 111 Nm భారీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎంతటి కఠినమైన కొండ మార్గాలు, మట్టి రోడ్లయినా సరే ఎలాంటి శ్రమ లేకుండా చాలా సులభంగా దూసుకెళ్లవచ్చు. ఈ సైకిల్ మొత్తం బరువు 27.2 కిలోలుగా ఉంది.

Oppo Reno 16 Pro : జులై 2న ఇండియాలో గ్రాండ్ ఎంట్రీ.. ఒప్పో రెనో 16 సిరీస్ స్పెసిఫికేషన్ల లీక్

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బైక్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 4.4 గంటల పాటు నాన్-స్టాప్ రైడింగ్ టైమ్‌ను అందిస్తుంది. అయితే ఈ రైడింగ్ టైమ్ అనేది మనం ప్రయాణించే రోడ్డు, మనం ఎంచుకునే అసిస్టెన్స్ లెవెల్ పై ఆధారపడి ఉంటుంది. రైడర్ల భద్రత, కంఫర్ట్ కోసం దీని ఫ్రంట్ సైడ్ లో 160 mm FOX 38 ఫ్యాక్టరీ ఫోర్క్ సస్పెన్షన్‌ను, అలాగే రియర్ సైడ్ లో 150 mm FOX ఫ్లోట్ X ఫ్యాక్టరీ షాక్ అబ్జార్బర్‌ను అందించారు. ఇందులో సరికొత్త GENIE షాక్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎలాంటి భారీ గుంతల్లో ప్రయాణించినా రైడర్‌కు కుదుపులు అస్సలు తెలియవు.

ఈ అడ్వెంచర్ ఈ-బైక్‌లో ముందూ వెనుకా కలిపి ప్రత్యేకమైన కార్గో (క్యారియర్) సెటప్‌ను అందించారు. దీని సహాయంతో రైడర్లు ప్రయాణంలో దాదాపు 22 కిలోల వరకు అదనపు లగేజ్ బరువును సులభంగా మోసుకెళ్లవచ్చు. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఫ్రంట్, రియర్ లో 220mm ఓవర్‌సైజ్ ఫోర్-పిస్టన్ రోటర్ బ్రేక్స్‌ను అమర్చారు, ఇవి ఎంత వేగంలోనైనా బైక్‌ను సురక్షితంగా ఆపుతాయి. అలాగే హ్యాండిల్ బార్ పై 2.2 ఇంచుల స్మార్ట్ డిస్‌ప్లే ఉంది, దీనిని కంపానియన్ మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీనితో పాటు లభించే 12amp స్మార్ట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా మల్టిపుల్ ఛార్జింగ్ మోడ్స్‌లో ఈ బైక్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

#తాజా కథనాలు
  1. Jio 1-Year Recharge Plans : జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌తో ఏడాది పాటు నో టెన్షన్
  2. Specialized Levo 4 X : లైట్ వెయిట్ కార్బన్ ఫ్రేమ్, పవర్‌ఫుల్ ఫాక్స్ సస్పెన్షన్.. ఈవీ మార్కెట్లోకి సరికొత్త సైకిల్
  3. Apple MacBook Neo : యాపిల్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న చౌకైన మ్యాక్‌బుక్ నియో
  4. OTT Movies : ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వీకెండ్ డిఫరెంట్ జోనర్లలో ఐదు సరికొత్త సినిమాలు, సిరీస్‌లు
  5. Honor X80 Pro Max : ఏకంగా 11,000mAh బ్యాటరీ.. సరికొత్త రికార్డు సృష్టించబోతున్న హానర్ నయా మొబైల్
  6. OnePlus Nord Buds : ఏకంగా 50 గంటల బ్యాటరీ లైఫ్?.. వన్‌ప్లస్ కొత్త ఇయర్‌బడ్స్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
  7. Oppo Reno 16 : ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా... భారత్‌లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ డేట్ లీక్
  8. iPhone 18 Pro Max : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్స్ లీక్.. మూడు సరికొత్త రాయల్ షేడ్స్‌తో మార్కెట్లోకి ఐఫోన్
  9. WhatsApp : ఉచిత సేవలకు కాలం చెల్లనుందా?.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు నెలకు రూ.2,200
  10. Oppo Reno 16 Pro : జులై 2న ఇండియాలో గ్రాండ్ ఎంట్రీ.. ఒప్పో రెనో 16 సిరీస్ స్పెసిఫికేషన్ల లీక్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »