ఒప్పో ఫైండ్ X9 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఒప్పో ఫైండ్ X10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
Photo Credit: Oppo
Oppo Find X9 Pro
Oppo : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఈ ఏడాది చివర్లో టెక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ X9 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఒప్పో ఫైండ్ X10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ఫైండ్ X10 ప్రోతో పాటు బేస్ మోడల్ ఒప్పో ఫైండ్ X10, అల్ట్రా ప్రీమియం మోడల్ ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ ఫోన్లను కూడా ఒకే వేదికపై కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ Weibo వేదికగా ప్రముఖ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలను లీక్ చేశారు. ఆయన పోస్ట్‌లో నేరుగా ఫోన్ పేరు చెప్పనప్పటికీ.. పాత రికార్డులను బట్టి ఇది ఒప్పో ఫైండ్ X10 ప్రో అని స్పష్టమైంది. ఈ లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల భారీ ఎల్‌టీపీఓ కనెక్టెడ్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది అత్యంత స్పష్టమైన 1.5K రెజడ్యూషన్‌తో వస్తుంది. ఫోన్ లుక్ పరంగా చాలా స్లిమ్‌గా, రౌండ్ కార్నర్స్‌తో చూడముచ్చటగా ఉంటుంది. దీని కోసం ఒప్పో సరికొత్త జనరేషన్‌కు చెందిన టియాన్మా డిస్‌ప్లే సబ్‌స్ట్రెయిట్‌ను ఉపయోగిస్తోంది.
కెమెరాల విషయానికి వస్తే ఒప్పో ఫైండ్ X10 ప్రో మొబైల్ ఫోటోగ్రఫీ ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. అందులో 1/1.3-ఇంచ్ భారీ సెన్సార్ కలిగిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. దీనితో పాటు జూమింగ్ కోసం మరో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, కలర్ కరెక్ట్ షాట్స్ కోసం 3 మెగాపిక్సెల్ మల్టీస్పెక్ట్రల్ కెమెరాను అమర్చనున్నారు. ఈ కెమెరా సెటప్ ద్వారా అత్యంత చీకటి వెలుతురులో కూడా డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల రేంజ్‌లో అద్భుతమైన, అత్యంత స్పష్టమైన ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బ్యాటరీ బ్యాకప్. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒప్పో ఈ ఫోన్‌లో ఏకంగా 8,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీక్స్ ద్వారా వెల్లడైంది. గత మోడల్ అయిన ఫైండ్ X9 ప్రోలో 7,500mAh బ్యాటరీ ఉండగా.. ఈసారి దానిని మరింత పెంచి బ్యాటరీ కింగ్‌గా మార్చేస్తున్నారు. ఈ భారీ బ్యాటరీ బ్యాకప్ వల్ల హెవీ యూజర్లు, గేమర్లకు సైతం రెండు రోజుల పాటు నిరంతరాయంగా పవర్ లభిస్తుంది.
OTT Movies : ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వీకెండ్ డిఫరెంట్ జోనర్లలో ఐదు సరికొత్త సినిమాలు, సిరీస్‌లు
పనితీరు పరంగా చూస్తే.. ఒప్పో ఫైండ్ X10 ప్రో ఫోన్‌లో ప్రపంచంలోనే అత్యంత అధునాతన 2nm ఆర్కిటెక్చర్‌పై తయారైన మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుత మోడల్‌లో డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో స్క్రీన్ కింద అడ్వాన్స్డ్ 3D అల్ట్రాసోనిక్ ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. అలాగే ఫోన్‌కు ధూళి, నీటి నుంచి గరిష్ట రక్షణ కల్పించడానికి IP68, IP69 రేటింగ్‌లను కూడా అందించనున్నారు.
ప్రకటన
ప్రకటన
Google Home Speaker Finally Makes Its Global Debut, Available to Pre-Order in Select Markets: Price, Features