How to find Your UAN: ఆధార్ నంబర్ ఉంటే చాలు.. ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే

How to find your UAN: అనేది ఈపీఎఫ్ఓ సంస్థ తన పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి జారీ చేసే ఒక ప్రత్యేకమైన 12 అంకెల యూనిక్ నంబర్. UAN మిస్ అయితే ఇలా తిరిగి తెచ్చుకోండి.

How to find Your UAN: ఆధార్ నంబర్ ఉంటే చాలు.. ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే

Photo Credit: Pexels

UMANG App

ముఖ్యాంశాలు
  • ఉమంగ్ యాప్’ (UMANG App) ద్వారా ఇంట్లోనే మీ UAN నంబర్!
  • పాన్ లేదా ఆధార్ నంబర్ ఉంటే చాలు
  • కేవలం 6 స్టెప్స్.. ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే సింపుల్ ప్రాసెస్
ప్రకటన

How to Find Your UAN: ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ భవిష్య నిధి లేదా పీఎఫ్ అకౌంట్ అనేది చాలా సాధారణమైన విషయం. ఈ పీఎఫ్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి  యూఏఎన్ (Universal Account Number) చాలా అవసరం అవుతుంది. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, పాస్‌బుక్ చూడటం, పీఎఫ్ క్లెయిమ్ ఫైల్ చేయడం, ఇతర ఆన్‌లైన్ సేవలను పొందడానికి ఈ నంబర్ కచ్చితంగా ఉండాలి. అయితే చాలా మంది ఉద్యోగులు తమ యూఏఎన్ నంబర్‌ను ఎక్కడో రాసి మర్చిపోతుంటారు. ఆ తర్వాత దానిని వెతకడానికి ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ లేదా కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉమంగ్ యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చుని మీ నంబర్ తెలుసుకోవచ్చు.

అసలు యూఏఎన్ అంటే ఏమిటి?

UAN అనేది ఈపీఎఫ్ఓ సంస్థ తన పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి జారీ చేసే ఒక ప్రత్యేకమైన 12 అంకెల యూనిక్ నంబర్. ఒక ఉద్యోగి తన జీవితంలో ఎన్ని ఉద్యోగాలు మార్చినా.. ఈ యూఏఎన్ నంబర్ మాత్రం మారకుండా ఒకే విధంగా ఉంటుంది. మీరు మారిన ప్రతి కొత్త కంపెనీ పీఎఫ్ మెంబర్ ఐడీని ఈ ఒకే ఒక్క యూఏఎన్ నంబర్‌కు లింక్ చేస్తారు. దీనివల్ల మీ పాత, కొత్త పీఎఫ్ అకౌంట్స్ అన్నీ ఒకే చోట సులభంగా కనిపిస్తాయి.

UAN వెతకడానికి ఏం కావాలి?

ఉమంగ్ యాప్ ద్వారా మీ యూఏఎన్ నంబర్‌ను తెలుసుకోవడానికి మీ దగ్గర కొన్ని ముఖ్యమైన వివరాలు సిద్ధంగా ఉండాలి. కింది వాటిలో ఏవైనా వివరాలు మీ దగ్గర ఉండాలి:

*  మీ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్ నంబర్ లేదా పాన్ కార్డ్ నంబర్ లేదా పీఎఫ్ మెంబర్ ఐడీ).

*  ఈపీఎఫ్ఓ రికార్డులలో లింక్ అయి ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్.

*  ఈ రెండు వివరాలు మీ దగ్గర ఉంటే చాలు.. కేవలం కొన్ని క్లిక్‌లలో మీ నంబర్ మీ స్క్రీన్ పైకి వచ్చేస్తుంది.

ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే 6 సింపుల్ స్టెప్స్..

*  స్టెప్ 1: మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.

*  స్టెప్ 2: యాప్ హోమ్ స్క్రీన్‌ పై ఉన్న సెర్చ్ బాక్స్‌లో EPFO అని టైప్ చేసి,  EPFO Services పై క్లిక్ చేయండి.

*  స్టెప్ 3: ఇప్పుడు అక్కడ కనిపించే పలు ఆప్షన్లలో  Know Your UAN అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

*  స్టెప్ 4: ఆ తర్వాత మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, మీ ఫోన్‌కు వచ్చే OTPని వెరిఫై చేయండి.

*  స్టెప్ 5: ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, అక్కడ అడిగిన మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ లేదా మెంబర్ ఐడీ వివరాలను కరెక్ట్‌గా పూరించండి.

*  స్టెప్ 6: మీరు ఇచ్చిన వివరాలన్నీ ఈపీఎఫ్ఓ డేటాబేస్‌తో మ్యాచ్ అయిన వెంటనే, మీ 12 అంకెల యూఏఎన్ నంబర్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని భద్రంగా నోట్ చేసి పెట్టుకోండి.

Avataar AI : భారతీయ స్టార్టప్ సరికొత్త సంచలనం.. సొంత వీడియో జనరేషన్ ఏఐ మోడల్ Varya లాంచ్

యూఏఎన్ దొరికిన తర్వాత ఏమేం చేయవచ్చు..?

మీ యూఏఎన్ నంబర్ మీకు తిరిగి లభించిన తర్వాత, మీరు ఈపీఎఫ్ఓ కి సంబంధించిన దాదాపు అన్ని రకాల ఆన్‌లైన్ సేవలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దీని ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవచ్చు, ప్రతినెలా పడే వడ్డీ వివరాలతో కూడిన ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అత్యవసర సమయాల్లో డబ్బుల కోసం ఆన్‌లైన్ క్లెయిమ్ పెట్టుకోవచ్చు, కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు, మీ యూఏఎన్‌ను కొత్తగా యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ నంబర్ పీఎఫ్ ఖాతాకు లింక్ లేకపోతే మాత్రం మీరు మీ కంపెనీ హెచ్ఆర్ విభాగం లేదా ఈపీఎఫ్ఓ హెల్ప్‌లైన్ నంబర్ 14470ని సంప్రదించాల్సి ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »