OnePlus N6x : వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీతో వచ్చిన OnePlus N6x ధర ఎంతంటే?

OnePlus N6x రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999 గా కంపెనీ నిర్ణయించింది.

OnePlus N6x : వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీతో వచ్చిన OnePlus N6x ధర ఎంతంటే?

Photo Credit: OnePlus

OnePlus N6x

ముఖ్యాంశాలు
  • మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు, కూలింగ్ సిస్టమ్‌తో భారత మార్కెట్లోకి OnePlus N6x
  • బ్యాంక్ ఆఫర్లతో అతి తక్కువ ధరకే వన్ ప్లస్ కొత్త ఫోన్
  • ఆగస్టు 4 నుంచి సేల్స్ షురూ
ప్రకటన


OnePlus N6x : గ్లోబల్ టెక్ దిగ్గజం వన్ ప్లస్ భారతీయ వినియోగదారుల కోసం ఎన్ సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus N6xను శుక్రవారం అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ఫుల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో ముందుకు వచ్చింది. రోజువారీ వాడకంతో పాటు గేమింగ్ లవర్లను కూడా ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను అత్యంత మన్నికైన మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో కంపెనీ డిజైన్ చేసింది.

ధరలు, లాంచ్ ఆఫర్లు, సేల్ వివరాలు ఇవే 
ధర విషయానికి వస్తే OnePlus N6x రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999 గా కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. వినియోగదారులు వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్,  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బర్గుండీ రెడ్, ఐస్ బ్లూ రంగుల లభ్యతలో వస్తుంది.

డిస్‌ప్లే క్వాలిటీ, ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అద్భుతం 
ఫీచర్ల పరంగా చూస్తే OnePlus N6xలో 6.8 అంగుళాల HD+ LCD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇది 720x1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేలో వైవిడ్, నేచురల్ కలర్ మోడ్స్, డార్క్ మోడ్, ఐ ప్రొటెక్షన్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్OS 16 పై పనిచేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్  చిప్‌సెట్ అమర్చారు. అంతేకాకుండా ఫోన్ వేడెక్కకుండా చూడటానికి 13,280 sq mm విస్తీర్ణం కలిగిన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.

Sony : గూగుల్ జెమిని ఏఐ, సూపర్ నోయిస్ క్యాన్సిలేషన్‌.. సోనీ నుంచి పవర్ఫుల్ ఆడియో డివైజెస్ లాంచ్

కెమెరా సెటప్.. బిగ్ బ్యాటరీ విశేషాలు 
ఫొటోగ్రఫీ కోసం OnePlus N6x వెనుక భాగంలో f/2.2 అపెర్చర్, 10x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేసే 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్ తిరుగులేని పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇందులో ఇచ్చిన 7,000mAh బ్యాటరీ 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8.65mm మందం, 214 గ్రాముల బరువుతో రాగా, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా MIL-STD-810H క్వాలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు
  2. OnePlus N6x : వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీతో వచ్చిన OnePlus N6x ధర ఎంతంటే?
  3. Sony : గూగుల్ జెమిని ఏఐ, సూపర్ నోయిస్ క్యాన్సిలేషన్‌.. సోనీ నుంచి పవర్ఫుల్ ఆడియో డివైజెస్ లాంచ్
  4. Asus Pad T3201 : టాబ్లెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ.. అసుస్ ప్యాడ్ T3201 చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
  5. Nothing Phone (4a) Price Hike : స్మార్ట్‎ఫోన్ లవర్స్‎కు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న నథింగ్ ఫోన్ ధరలు
  6. Infosys : ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం బిగ్ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం
  7. Kerala Boy Cardboard Robot : పాత అట్టపెట్టెలతో అమ్మకి సాయం చేసే రోబోట్.. కేరళ కుర్రాడి వినూత్న ప్రయోగం
  8. Gemini Spark AI : ఆఫీస్ పనులు చేసేసే గూగుల్ AI ఏజెంట్ వచ్చేసింది.. ఇక నిద్రపోతున్నా పనులు అయిపోతాయ్
  9. Vivo Ignite 2026 : విద్యార్థుల ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్..  వివో ఇగ్నైట్‌లో రూ. 35 లక్షల స్కాలర్‌షిప్‌లు సాధించే ఛాన్స్
  10. Divoom Portable Speaker : రాత్రిపూట నిద్రపట్టట్లేదా? మీ మైండ్‌ని రిలాక్స్ చేసే దివూమ్ కొత్త బ్లూటూత్ స్పీకర్ వచ్చేసింది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »