Honor X6e 4G : 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా.. Honor X6e 4G గ్రాండ్ లాంచ్.. ధర ఎంతంటే?

Honor X6e 4Gకి సంబంధించిన ఏకైక 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను RM 699 గా నిర్ణయించారు.

Honor X6e 4G  : 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా.. Honor X6e 4G గ్రాండ్ లాంచ్.. ధర ఎంతంటే?

Photo Credit: Honor

Honor X6e 4G

ముఖ్యాంశాలు
  • 16 వేల రేంజ్‌లో 7500mAh బ్యాటరీ ఇస్తున్నారు
  • ఐపీ64 రేటింగ్, 50ఎంపీ కెమెరాతో Honor X6e 4G లాంచ్
  • మొబైల్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్
ప్రకటన

Honor X6e 4G  : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. Honor X6e 4G పేరుతో తీసుకొచ్చిన ఈ హ్యాండ్‌సెట్‌లో రోజువారీ వినియోగానికి అవసరమైన దాదాపు అన్ని రకాల కేక పుట్టించే ఫీచర్లను అందించింది. ప్రధానంగా భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని, రఫ్‌గా వాడే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపుదిద్దింది. మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా ప్రాసెసర్, భారీ బ్యాటరీ, ఐపీ64 రేటింగ్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

ధర, లభ్యత వివరాలు
ప్రస్తుతానికి కంపెనీ ఈ ఫోన్‌ను మలేషియా మార్కెట్‌లో అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. Honor X6e 4Gకి సంబంధించిన ఏకైక 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను RM 699 గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 16,000 వరకు ఉంటుంది. మలేషియాలోని హానర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు దీనిని సన్‌రైజ్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.

Dell Laptops : ల్యాప్‌టాప్ మందం కేవలం 12 మిమీ..  టెక్ రంగాన్ని ఊపేస్తున్న డెల్ కంపెనీ

డిస్‌ప్లే, ప్రాసెసింగ్ పవర్
Honor X6e 4G స్మార్ట్‌ఫోన్ 6.61 అంగుళాల TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1604 × 720 పిక్సెల్ల హెచ్‌డీ+ రెసల్యూషన్‌ను, 16.7 మిలియన్ రంగులను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం బలమైన అల్యూమినోసిలికేట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కళ్ల రక్షణ కోసం ఐ కంఫర్ట్, డైనమిక్ డిమ్మింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా  చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండటం వల్ల మొత్తం 8GB వరకు ర్యామ్ సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0 పై రన్ అవుతుంది.

50MP కెమెరా, 7,500mAh భారీ బ్యాటరీ
కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక వైపు f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. దీనితో పాటు 10X డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే సెకండరీ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర f/2.2 అపెర్చర్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇక ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని 7,500mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ. దీనికి తోడు 45W హానర్ సూపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఇచ్చారు. దీని బరువు 207 గ్రాములు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. WhatsApp : ఇక వెబ్‌లోనూ కాల్స్, ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి విజిట్.. వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్
  2. Honor X6e 4G : 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా.. Honor X6e 4G గ్రాండ్ లాంచ్.. ధర ఎంతంటే?
  3. Dell Laptops : ల్యాప్‌టాప్ మందం కేవలం 12 మిమీ..  టెక్ రంగాన్ని ఊపేస్తున్న డెల్ కంపెనీ
  4. Plastic Currency : త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  5. Nokia 250 4G Smart : ఇదేం కీప్యాడ్ ఫోన్ బాబోయ్.. ఫ్రంట్ ఫ్లాష్, AI ఫీచర్లతో వస్తున్న Nokia అదరగొట్టిందిగా
  6. SpaceX Falcon 9 : ఆకాశంలో అరుదైన అద్భుతం.. చంద్రుడిని ఢీకొట్టనున్న 4 టన్నుల స్పేస్‌ఎక్స్ రాకెట్
  7. COLORFUL Rimbook L1 Plus : క్రియేటర్స్, స్టూడెంట్స్‎కు బెస్ట్ ఆప్షన్.. స్లిమ్ డిజైన్, మైండ్ బ్లోయింగ్ స్పీడ్‎తో కొత్త ల్యాప్‌టాప్
  8. Airtel Vs Jio : జియోకు బిగ్ షాక్.. కొత్త కస్టమర్లలో నంబర్-1గా ఎయిర్‌టెల్
  9. Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో
  10. Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »