Realme : ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులు పక్కా.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P4R 5G లాంచ్

రియల్‌మి P4R 5G ఫోన్ లో ఏకంగా 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్, సూపర్ స్మూత్ 144Hz డిస్‌ప్లే వంటి హై-ఎండ్ ఫీచర్లను అందించారు.

Realme : ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులు పక్కా.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P4R 5G లాంచ్

Photo Credit: Realme

Realme P4R 5G

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి రియల్‌మి కొత్త బాహుబలి ఫోన్
  • ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులు పక్కా
  • బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.2,000 తక్కువకే సొంతం చేసుకునే ఛాన్స్!
ప్రకటన

Realme : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి, భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త మిడ్-బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది.  రియల్‌మి P4R 5G పేరుతో వచ్చిన ఈ మొబైల్ ఫీచర్ల పరంగా దుమ్మురేపుతోంది. ఈ ఫోన్ లో ఏకంగా 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్, సూపర్ స్మూత్ 144Hz డిస్‌ప్లే వంటి హై-ఎండ్ ఫీచర్లను అందించారు. తన సెగ్మెంట్‌లోనే అత్యంత భారీ బ్యాటరీ కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇదేనని, ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 3 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ గర్వంగా చెప్తోంది.

ధరలు, వేరియంట్లు, సేల్స్ వివరాలు
రియల్‌మి P4R 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని అఫీషియల్ సేల్స్ జూన్ 17, 2026 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‎తో పాటు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభం కానున్నాయి. ధరల విషయానికి వస్తే బేస్ వేరియంట్ 4GB రామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.18,999గా ఉంది. అలాగే 6GB రామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.20,999 కాగా, టాప్ ఎండ్ మోడల్ 6GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.22,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

భారీ లాంచ్ ఆఫర్లు.. రూ.2,000 తక్షణ డిస్కౌంట్
కొత్తగా ఫోన్ కొనేవారిని ఆకట్టుకోవడానికి రియల్‌మి అదిరిపోయే లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ల కింద అన్ని వేరియంట్లపై రూ.2,000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీనితో పాటు ఎలాంటి అదనపు వడ్డీ లేని 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే రియల్‌మి P4R 5G కారు చౌకగా మారి.. దీని ప్రారంభ ధర కేవలం రూ.16,999కే కస్టమర్లకు లభించనుంది. తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాన్స్.

7 ఏళ్ల లైఫ్ ఇచ్చే టైటాన్ బ్యాటరీ టెక్నాలజీ
ఈ స్మార్ట్‌ఫోన్  ప్రధాన ఆకర్షణ దీని 8000mAh టైటాన్ బ్యాటరీ. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ పట్టుకోవడానికి వీలుగా కేవలం 8.8mm మందం, 224 గ్రాముల బరువుతో స్లిమ్‌గా డిజైన్ చేయడం విశేషం. ఈ బ్యాటరీ 1600 చార్జింగ్ సైకిళ్లను తట్టుకునేలా రూపొందించబడింది. అంటే సుమారు 7 సంవత్సరాల పాటు వాడినా కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతానికి పైగా పటిష్టంగా ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది. దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, రాత్రి వేళల్లో బ్యాటరీ పాడవకుండా కాపాడే ఏఐ నైట్ చార్జింగ్, ఏఐ కోల్డ్ చార్జింగ్ మోడ్‌లను కూడా ఇందులో అమర్చారు.

గేమర్ల కోసం స్పెషల్ బైపాస్ చార్జింగ్ ఫీచర్
మొబైల్ గేమింగ్ లవర్స్ కోసం రియల్‌మి ఇందులో ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే బైపాస్ చార్జింగ్. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు చార్జింగ్ పెట్టినా సరే.. కరెంట్ నేరుగా మదర్‌బోర్డ్‌కు వెళ్తుంది తప్ప బ్యాటరీని హీట్ చేయదు. దీనివల్ల ఫోన్ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. కారు వేడిని తగ్గించడానికి ఇందులో 5300mm² వైడర్ వీసీ కూలింగ్ సిస్టమ్, వన్ టాప్ కూలింగ్ ఫీచర్లు ఉన్నాయి. BGMI, ఫ్రీ ఫైర్ వంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్‌లను ఆడేటప్పుడు కూడా లాగ్స్ లేకుండా స్థిరంగా 60fps పర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
 

Budget Smartphones : ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 వర్సెస్ మోటో జి37 వర్సెస్ రియల్‌మీ పి4 లైట్.. తక్కువ ధరలో బెస్ట్ ఏది?

గూగుల్ జెమిని ఏఐ, పవర్‌ఫుల్ కెమెరా
ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు F1.8 అపెర్చర్ కలిగిన 50MP ఏఐ మెయిన్ కెమెరాను అందించారు. ఇందులో ఫోటోలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మోషన్ ఫోటో, ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఫోటోలో వద్దనుకున్న వాటిని తీసేసే ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ అల్ట్రా క్లారిటీ, బ్లర్ అయిన ఫోటోలను క్లియర్ చేసే ఏఐ అన్‌బ్లర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆఫీస్ పనుల కోసం టెక్స్ట్ స్కానర్, నోట్స్ కోసం ఏఐ అసిస్టెంట్, గూగుల్ జెమిని  ఏఐ సపోర్ట్ కూడా లభిస్తుంది. సేఫ్టీ కోసం ఏఐ యాంటీ-థెఫ్ట్, గూగుల్ రిమోట్‌లీ లాక్ ఫీచర్లు ఉన్నాయి.

సన్‌లైట్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ భద్రత
స్క్రీన్ విషయానికి వస్తే.. ఇందులో 6.8 ఇంచుల భారీ 144Hz సన్‌లైట్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనివల్ల ఎండలో వెళ్లినా సరే 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత రియల్‌మి యూఐ 7.0 పై పనిచేస్తుంది. ఫోన్ కింద పడినా పగలకుండా ఉండేందుకు  ఆర్మోర్‌షెల్ టఫ్ బిల్డ్ తో పాటు మిలిటరీ గ్రేడ్ ధృవీకరణ అయిన MIL-STD-810H, నీటి చుక్కలు, దుమ్ము నుంచి రక్షణ ఇచ్చే IP65 రేటింగ్‌ను కూడా ఈ ఫోన్‌కు అందించారు.

#తాజా కథనాలు
  1. Xiaomi 17T : రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. భారత్‌లో షావోమి ఫస్ట్ T సిరీస్ ఫోన్ సేల్స్ షురూ
  2. Data Center : చైనా సరికొత్త రికార్డు.. సముద్ర గర్భంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ డేటా సెంటర్
  3. Realme : ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులు పక్కా.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P4R 5G లాంచ్
  4. Google : మనం మాట్లాడుతుండగానే అవతలి భాషలోకి మార్చేస్తుంది.. జెమిని 3.5 సరికొత్త అస్త్రం
  5. Meta Reliance : భారత్‌లో మెటా బిగ్ ప్లాన్.. రిలయన్స్‌తో కలిసి సరికొత్త ఏఐ డేటా సెంటర్ స్థాపన
  6. Wi-Fi : మీ ఇంటి వైఫై స్లో అయిపోయిందా? మీ వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారో ఇలా కనిపెట్టండి!
  7. Budget Smartphones : ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 వర్సెస్ మోటో జి37 వర్సెస్ రియల్‌మీ పి4 లైట్.. తక్కువ ధరలో బెస్ట్ ఏది?
  8. Vivo : ఫ్లిప్‌కార్ట్‌లో వీవో ఎక్స్300 ప్రోపై బంపర్ డిస్కౌంట్.. వేల రూపాయలు ఆదా చేసుకునే గోల్డెన్ ఛాన్స్
  9. IRCTC : రైలు ప్రయాణికులకు అదిరిపోయే ట్రిక్.. మీ మొబైల్ లోనే ఖాళీ బర్త్‌ల వివరాలు
  10. Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో పెను సంచలనం.. మెటా ఏఐ సిస్టమ్ లోపంతో 20 వేల అకౌంట్లు హ్యాక్!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »